Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆల్‌టైమ్ టెస్ట్ ఎలెవన్.. రోహిత్, కోహ్లీకి నో ఛాన్స్!

న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్, ఆస్ట్రేలియా మాజీ ఓపెన్ మాథ్యూ హెడెన్ 21వ శతాబ్దపు ఆల్‌టైమ్ టెస్ట్ ఎలెవెన్‌ను ప్రకటించారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 ఫైనల్ నేపథ్యంలో ఈఎస్‌పీఎన్ క్రి‌క్‌ఇన్‌ఫో ఛానెల్ వేదికగా జరిగిన షోలో.. ఈ ఇద్దరు ఆటగాళ్లు అత్యుత్తమ టెస్ట్ ఎలెవన్‌ను ఎంపిక చేశారు.

కోహ్లీ, బుమ్రాకు నో ఛాన్స్

కేన్ విలియమ్సన్ ఎంపిక చేసిన 21వ శతాబ్దపు ఆల్‌టైమ్ ఎలెవన్‌లో భారత్ నుంచి ముగ్గురు ఆటగాళ్లకు మాత్రమే అవకాశం దక్కింది. మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌తో పాటు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీలకు కేన్ విలియమ్సన్‌ అవకాశం ఇచ్చాడు. ఆశ్చర్యకరంగా తన ఫ్రెండ్ విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రాలకు కేన్ మామ చోటివ్వలేదు.

Kane Williamson and Matthew Hayden Reveal 21st Century Test XI No Kohli or Rohit

కెప్టెన్‌గా పాంటింగ్

సెహ్వాగ్‌తో పాటు మాథ్యూ హెడెన్‌లను ఓపెనర్లుగా పేర్కొన్న కేన్ మామ.. రికీ పాంటి, సచిన్ టెండూల్కర్, స్టీవ్ స్మిత్, ఏబీ డివిలియర్స్‌లను మిడిలార్డర్ బ్యాటర్లుగా ఎంపిక చేశాడు. మహేంద్ర సింగ్ ధోనీని కీపర్‌గా పేర్కొన్నకేన్ మామ.. పేసర్లుగా డేల్ స్టెయిన్, షోయబ్ అక్తర్, గ్లేన్ మెక్‌గ్రాత్‌లను ఎంపిక చేశాడు. ఏకైక స్పిన్నర్‌గా ముత్తయ్య మురళీధరన్‌కు అవకాశం ఇచ్చాడు. తన జట్టుకు రికీ పాంటింగ్‌ను కెప్టెన్‌ చేశాడు.

సచిన్‌కు నో ఛాన్స్..

మరోవైపు మాథ్యూ హెడెన్.. భారత్‌ నుంచి ఇద్దరు ఆటగాళ్లకే చోటిచ్చాడు. విరాట్ కోహ్లీ, వీవీఎస్ లక్ష్మణ్‌లను మాత్రమే తను అత్యుత్తమ జట్టులోకి తీసుకున్నాడు. ఓపెనర్లు అలిస్టర్ కుక్, డేవిడ్ వార్నర్‌లను ఎంపిక చేసిన మాథ్యూ హెడెన్, జాక్వస్ కల్లీస్, బ్రియాన్ లారా, విరాట్ కోహ్లీ, వీవీఎస్ లక్ష్మణ్‌లను మిడిలార్డర్ బ్యాటర్లు‌గా ఎంపిక చేశాడు. వికెట్ కీపర్‌గా ఆడమ్ గిల్‌క్రిస్ట్‌‌ను ఎంచుకున్న హెడెన్.. ప్యాట్ కమిన్స్, బ్రెట్‌లీ,జేమ్స్ అండర్సన్‌లను పేసర్లుగా ఎంపిక చేశాడు. ఏకైక స్పిన్నర్‌గా ఆస్ట్రేలియా దివంగత స్పిన్నర్ షేన్ వార్న్‌‌కు అవకాశం కల్పించాడు.

విలియమ్సన్ ఆల్‌టైమ్ ఎలెవన్

మాథ్యూ హెడెన్, వీరేంద్ర సెహ్వాగ్, రికీ పాంటింగ్(కెప్టెన్), సచిన్ టెండూల్కర్, స్టీవ్ స్మిత్, ఏబీ డివిలియర్స్, మహేంద్ర సింగ్ ధోనీ(కీపర్), డేల్ స్టెయిన్, షోయబ్ అక్తర్, గ్లేన్ మెక్‌గ్రాత్, ముత్తయ్య మురళీ ధరణ్.

మాథ్యూ హెడెన్ ఆల్‌టైమ్ ఎలెవన్

అలిస్టర్ కుక్, డేవిడ్ వార్నర్‌, జాక్వస్ కల్లీస్, బ్రియాన్ లారా(కెప్టెన్), విరాట్ కోహ్లీ, వీవీఎస్ లక్ష్మణ్‌, ఆడమ్ గిల్‌క్రిస్ట్‌‌(కీపర్), ప్యాట్ కమిన్స్, బ్రెట్‌లీ, జేమ్స్ అండర్సన్‌.

Story first published: Saturday, June 14, 2025, 16:12 [IST]
Other articles published on Jun 14, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+