For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గాలె టెస్టులో ధనుంజయ, విలియమ్సన్ అనుమానాస్పద బౌలింగ్!

Kane Williamson, Akila Dananjaya reported for suspected bowling action during Galle Test

హైదరాబాద్: శ్రీలంక స్పిన్నర్ అకిలా ధనుంజయ, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ల బౌలింగ్ యాక్షన్‌పై ఐసీసీకి ఫిర్యాదులు అందాయి. గాలె వేదికగా న్యూజిలాండ్-శ్రీలంక జట్ల మధ్య జరిగిన తొలి టెస్టులో లంక రెండో ఇన్నింగ్స్‌లో విలియమ్సన్‌ మూడు ఓవర్ల పాటు బౌలింగ్‌ వేయగా... ధనుంజయ ఈ మ్యాచ్‌లో ఆరు వికెట్లు తీశాడు.

వీరిద్దరి బౌలింగ్‌ శైలిపై అనుమానం వ్యక్తం చేసిన మ్యాచ్ అఫీసియిల్స్ ఇరు జట్ల మేనేజ్‌మెంట్‌‌కు ఫిర్యాదు చేశారు. దీంతో వారిద్దరూ 14 రోజులలోపు ఐసీసీ ముందు హాజరై తమ బౌలింగ్‌శైలికి సంబంధించిన పరీక్షలకు హాజరు కావాలని ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇందుకు ఆగస్టు 18ని గడువు తేదీగా నిర్దేశించింది.

'టీమిండియాకు ఆడని సమయంలో లైన్‌ అండ్‌ లెంగ్త్‌పై కఠోరంగా శ్రమించా'

ఈ మేరకు రెండు జట్ల మేనేజ్‌మెంట్‌కు నోటీసులు అందజేశామని ఐసీసీ పేర్కొంది. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో అకిలా ధనుంజయ 5 వికెట్లు తీయడంతో పాటు పర్యాటక జట్టు 83.2 ఓవర్లలో 249 పరుగులకే పరిమితమైంది. ఆ తర్వాత శ్రీలంక తన తొలి ఇన్నింగ్స్‌లో 267 పరుగులకు ఆలౌటైంది.

అనంతరం న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 285 పరుగులు చేయడంతో శ్రీలంకకు 268 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ క్రమంలో దిముత్‌ కరుణరత్నె (122) సెంచరీతో చెలరేగగా తిరిమానె (64) హాఫ్ సెంచరీతో రాణించడంతో శ్రీలంక ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

బౌన్సర్లకు 20 మంది బలి: క్రికెట్‌లో జోఫ్రా ఆర్చర్ అత్యంత ప్రమాదకరమైన బౌలరా?

కాగా, గాలె టెస్టులో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలిమయ్సన్ నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్‌లో 4 పరుగులకే పెవిలియన్‌కు చేరాడు. దీంతో రెండు టెస్టుల సిరీస్‌లో లంక 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు గురువారం నుంచి ఆరంభం కానుంది.

Story first published: Tuesday, August 20, 2019, 15:49 [IST]
Other articles published on Aug 20, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+