పాక్ ఆటగాడి నోట రాహుల్ గాంధీ పేరు.. భారత క్రికెటర్లు పట్టించుకోరంటూ..!
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ క్రమాన్ అక్మల్.. భారత ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పేరు ఉచ్చరిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాజకీయ నేతకు వ్యతిరేకంగా పోస్ట్ పెట్టి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఆగ్రహానికి గురైన ఆ దేశ క్రికెటర్ నసీమ్ షాకు కమ్రాన్ అక్మల్ తనదైన శైలిలో బుద్ది చెప్పాడు.
భారత క్రికెటర్లు ఎప్పుడైనా ఆ దేశ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మద్దతుగా పోస్ట్‌లు పెట్టడం చూశావా? అని ప్రశ్నించాడు. భారతే కాదు.. ప్రపంచంలో ఏ క్రికెటర్ కూడా రాజకీయ నేతలకు అండగా పోస్ట్‌లు పెట్టరని, క్రికెటర్లు రాజకీయాలకు దూరంగా ఉండాలని, తటస్థంగా ఉంటేనే మంచిదని అక్మల్ చురకలంటించాడు.
ఆమెను రాణిలా ఎందుకు చూస్తున్నారు..?
పాకిస్థాన్ రాజకీయ నాయకురాలు మరియం నవాజ్ గురించి నసీమ్ షా పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ అతన్ని ఇబ్బందుల్లోకి నెట్టింది. ప్రేక్షకుల్లేకుండా జరుగుతున్న పీఎస్‌ఎల్ ఆరంభ వేడుకులకు మరియం నవాజ్ హాజరైంది. అయితే ఇందన కొరత, భద్రతా కారణాలతో ప్రేక్షకులను అనుమతించని అధికారులు.. మరియం నవాజ్‌కు ప్రత్యేకమైన ప్రొటోకాల్ ఏర్పాట్లు చేయడంపై నసీమ్ షా ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'ఆమెను లార్డ్స్ మైదానంలో క్వీన్ లాగా ఎందుకు చూస్తున్నారు'అని ప్రశ్నించాడు.

రూ.67 లక్షల జరిమానా..
ఈ పోస్ట్‌పై సోషల్ మీడియా వేదికగా తీవ్ర దుమారం రేగగా.. నసీమ్ షా తన పోస్ట్‌ను తొలగించి మరియం నవాజ్‌కు క్షమాపణలు చెప్పాడు. కానీ ఆ పోస్ట్ స్క్రీన్ షాట్స్ నెట్టింట వైరల్ కాగా.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) కఠిన చర్యలు తీసుకుంది. 20 మిలియన్ల పాకిస్థాన్ రూపాయలను(రూ.67 లక్షలు) జరిమానాగా విధించింది. పాకిస్థాన్ ఆటగాళ్లు తమ సెంట్రల్ కాంట్రాక్ట్ ద్వారా 8 నెలల్లో సంపాదించే మొత్తానికి ఇది సమానం. పాకిస్థాన్ క్రికెట్ చరిత్రలో ఓ ఆటగాడికి విధించిన అతిపెద్ద జరిమానా కూడా ఇదే.
బతికిపోయావ్ బిడ్డా..
అయితే నిషేధం విధించకుండా జరిమానాతో సరిపెట్టి నసీమ్ షాను పీసీబీ రక్షించిందని క్రమాన్ అక్మల్ అభిప్రాయపడ్డాడు. ఈ వ్యవహారంపై తన యూట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడిన అక్మల్.. నసీమ్ షా నిషేధానికి గురై ఉంటే కెరీర్ నాశనమయ్యేదని అభిప్రాయపడ్డాడు. 'పీసీబీ కమిటీ సభ్యులు, చైర్మన్ నసీమ్ షా కెరీర్‌ను కాపాడారు. ఒకవేళ అతను నిషేధానికి గురై ఉంటే.. అతని కెరీర్ నాశనమయ్యేది.
అసలు అతని బౌలింగ్‌లోనే వేగం ఎక్కడికి పోయింది? అతను 145, 150 కిలోమీటర్ల వేగంతో కెరీర్ ప్రారంభించాడు. ఇప్పుడు అది 135, 137కి పడిపోయింది. అతని డైట్ ప్లాన్ ఏంటి? నువ్వు ఏం చేశావు? అనవసర విషయాలను వదిలేయ్. ఆడు, జీవితాన్ని ఆస్వాదించు.. విజయవంతం అవ్వు, మంచి ఆటగాడిగా మారు, ఏకాగ్రత వహించు. నీ బౌలింగ్‌లో మరిన్ని నైపుణ్యాలను పెంచుకో... 2018లో నసీమ్ షాను చూసి నేను చాలా సంతోషించాను.
రాహుల్ గాంధీ గురించి పోస్ట్‌లు పెట్టారా..?
ఎంతో ప్రతిభావంతుడైన ఫాస్ట్ బౌలర్. తన కష్టార్జితం, నైపుణ్యం వల్ల చిన్న వయసులోనే అన్నీ సాధించాడు. సొంత బిడ్డను రక్షించినట్లు నసీమ్ షాను కాపాడిన పీసీబీ ఛైర్మన్‌కు అతను వెళ్లి ధన్యవాదాలు చెప్పాలి. డబ్బు తిరిగి రావచ్చు కానీ.. నిషేధం విధిస్తే మాత్రం అతని కెరీర్ ముగిసిపోయేది.
నసీమ్ షా నువ్వు ఒక వ్యవస్థలో భాగమైనప్పుడు తటస్థంగా ఉండాలి. క్రికెట్‌పై మాత్రమే దృష్టి పెట్టాలి. భారత ఆటగాళ్లలో ఎంతమంది రాహుల్ గాంధీ గురించి ట్వీట్లు చేస్తున్నారు? ప్రపంచంలో ఎక్కడా ఇలా జరగదు,' అని కమ్రాన్ అక్మల్ సూచించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications