టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌పై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కెరీర్ ప్రారంభంలోనే ఇషాన్ కిషన్‌కు మానసిక అలసట ఏంది? అని ప్రశ్నించాడు. ఐపీఎల్ 2024లో ఫ్రెష్‌గా బరిలోకి దిగేందుకు అతను మానసిక అలసట పేరిట డ్రామాలు ఆడుతున్నాడని విమర్శించాడు.
అంతర్జాతీయ క్రికెట్ కంటే అతనికి ఐపీఎల్ ఎక్కువైందని మండిపడ్డాడు. మానసికంగా అలిసిపోయానని, తనకు విశ్రాంతి కావాలని సౌతాఫ్రికా పర్యటన నుంచి ఇషాన్ కిషన్ తప్పుకున్న విషయం తెలిసిందే. ఫ్రెండ్స్‌తో దుబాయ్‌లో చిల్ అయిన ఇషాన్ కిషన్.. ఎలాంటి అనుమతి లేకుండా పాపులర్ టీవీ షో కౌన్ బనేగా కరోడ్‌పతిలో పాల్గొన్నాడు.

అంతేకాకుండా ఇండియా-అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్‌కు కూడా దూరంగా ఉన్నాడు. అటు దేశవాళీ క్రికెట్ కూడా ఆడటం లేదు. దాంతో ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు బీసీసీఐ ఇషాన్ కిషన్‌ను పక్కనపెట్టింది. అతని స్థానంలో యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్‌కు అవకాశం కల్పించింది. ఈ క్రమంలోనే ఇషాన్ కిషన్ మానసిక అలసట గురించి కమ్రాన్ అక్మల్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా స్పందించాడు.
ఇషాన్ కిషన్ కంటే ఎక్కువ క్రికెట్ ఆడుతున్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రాలు ఎప్పుడూ మానసిక అలసటతో విశ్రాంతి తీసుకోవడం తాను వినలేదని చెప్పుకొచ్చాడు.
'మానసిక అలసటతో ఇషాన్ కిషన్ సౌతాఫ్రికా పర్యటన నుంచి తప్పుకోవడం చర్చనీయాంశమైంది. అసలు కెరీర్ ప్రారంభంలో ఉన్న ఓ ఆటగాడు మానసిక అలసటకు గురవ్వడం ఏంటో నాకు అర్థం కావడం లేదు. భారత జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా కూడా మానసిక అలసటకు గురవుతున్నారు.
వారు ఐపీఎల్‌తో పాటు అంతర్జాతీయ మ్యాచ్‌లు, టెస్ట్‌ల్లో ఆడుతున్నారు. కానీ వారు మానసిక అలసటతో విశ్రాంతి తీసుకోవడం నేను ఎప్పుడూ వినలేదు.
నాకు ఎందుకో ఐపీఎల్ కోసమే ఇషాన్ కిషన్ బ్రేక్ తీసుకున్నాడనే సందేహం కలుగుతోంది. భారత జట్టు కంటే ఐపీఎల్ ఆడటమే అతను గొప్పగా భావిస్తున్నాడు.
ఐపీఎల్‌లో ఫ్రెష్‌గా బరిలోకి దిగేందుకు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడనిపిస్తోంది. ఇషాన్ కిషన్‌ను ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ఎంపిక చేయకుండా బీసీసీఐ మంచి పనిచేసింది. మరో ఆటగాడు ఇలా మానసిక ఒత్తిడి అంటూ రెస్ట్ అడగకుండా అందరికి ఇది ఓ గుణపాఠం కావాలి. భారత జట్టులోకి వచ్చే ముందు ఇషాన్ కిషన్ దేశవాళీ క్రికెట్ ఆడాలి.'అని కమ్రాన్ అక్మల్ అభిప్రాయపడ్డాడు.
ఇషాన్ కిషన్‌పై బీసీసీఐ క్రమశిక్షణ చర్యలు తీసుకుందని ప్రచారం జరగ్గా.. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఖండించాడు. అందులో వాస్తవం లేదని, అతను ఇంకా జట్టుకు అందుబాటులోకి రాలేదని చెప్పాడు.