For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్ సక్సెస్‌కు.. పాకిస్థాన్ వైఫల్యానికి అదే కారణం: కమ్రాన్ అక్మల్

Kamran Akmal lauds Indian team management over Seniors stayed until they groomed Virat Kohli, Rohit Sharma

కరాచీ: 1990లో భారత జట్టు కన్నా పాకిస్థాన్ ఏవిషయంలో చూసుకున్నా మెరుగైన జట్టే. కానీ 2000 వచ్చే సరికి ఈ సీన్ కొద్దిగా రివర్సైంది. ఇప్పుడైతే వ్యత్యాసమే లేకుండా మారిపోయింది. టీమిండియా ప్రపంచ క్రికెట్ శాసించే స్థాయికి ఎదగగా.. పాకిస్థాన్ పాతాళానికి పడిపోయింది. అయితే దీనికి పాకిస్థాన్ టీమ్ మేనేజ్‌మెంట్ ప్రణాళిక లోపమే కారణమని ఆ జట్టు వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ అభిప్రాయపడ్డాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) యువ ఆటగాళ్లకు అండగా నిలిచిందని, వారు కుదురుకున్న తర్వాతే సీనియర్ ఆటగాళ్లను తప్పించిందన్నాడు. కానీ పాకిస్థాన్ క్రికెట్‌లో ఇది జరగేలదని చెప్పుకొచ్చాడు.

విరాట్, రోహిత్ సక్సెస్‌కు వాళ్లే కారణం..

విరాట్, రోహిత్ సక్సెస్‌కు వాళ్లే కారణం..

భారత క్రికెట్‌లో విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌ లాంటి ఆటగాళ్లు విజయవంతం కావడానికి మాజీ క్రికెటర్లు సచిన్‌ టెండూల్కర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, రాహుల్‌ ద్రవిడ్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌ వంటి సీనియర్ ఆటగాళ్లే కారణమని అక్మల్ తెలిపాడు. 2007 వన్డే ప్రపంచకప్‌ తర్వాత టీమిండియా యువకులపై దృష్టిసారించిందని, దాంతో వారు గాడిన పడేవరకూ సీనియర్లు సహకరించారని చెప్పాడు. ఆ తర్వాతే సీనియర్లు పక్కకు తప్పుకున్నారని గుర్తు చేశాడు. తాజాగా అక్మల్‌ ఓ పాకిస్థాన్‌ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించాడు.

వారు ఆడి ఉంటే..

వారు ఆడి ఉంటే..

‘భారత జట్టు సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్‌ల సాయంతో 2007 టీ20 ప్రపంచకప్ తర్వాత యువ క్రికెటర్లపై దృష్టిసారించింది. ఈ సీనియర్ ఆటగాళ్లంతా తదుపరి జనరేజ్ ఆటగాళ్లు అందుబాటులోకి వచ్చే వరకు జట్టుతోనే ఉన్నారు. ఇది భారత జట్టుకు సక్సెస్‌కు కారణమైంది.

ఈ కారణంగానే విరాట్, రోహిత్, కేఎల్ రాహుల్ సక్సెస్ అయ్యారు. అయితే పాక్ క్రికెట్‌లో ఈ విధానం కొరవడింది. బోర్డు అనాలోచిత నిర్ణయాల వల్ల షోయబ్‌ అక్తర్‌, మహ్మద్‌ యూసుఫ్‌, అబ్దుల్‌ రజాక్‌ లాంటి ఆటగాళ్లు మరింత కాలం ఆడాల్సి ఉన్నా.. ముందే రిటైర్మెంట్‌ ప్రకటించారు. వారు మరికొంత కాలం ఉంటే మేటి ఆటగాళ్లను తీర్చిదిద్దే వాళ్లు.

యూనిస్ ఖాన్‌తోనూ..

యూనిస్ ఖాన్‌తోనూ..

సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ యూనిస్‌ఖాన్‌ తోనూ జట్టుమేనేజ్‌మెంట్ సరిగ్గా వ్యవహరించలేదు. వారి ప్రణాళికలను అతనికి సరిగ్గా వివరించలేకపోయింది. దీంతో అతడు బలవంతంగానే జట్టు నుంచి తప్పుకున్నాడు. ఇలాంటి ఆటగాళ్లంతా మరి కొన్నేళ్లు ఆడి ఉంటే పాకిస్థాన్‌ జట్టులో కొంత మంది స్టార్లు తయారయ్యే వారు. అబ్దుల్ రజాక్ మంచి ఆల్‌రౌండర్లను, షోయబ్ అక్తర్ సూపర్ పేసర్లను తీర్చిదిద్దేవారు. ఈ విషయంలో పాక్‌ జట్టు వ్యవహార శైలే బాగోలేదు. టీమిండియా సరైన ప్రణాళికతో ముందుకెళ్లి సక్సెస్ సాధించింది'అని అక్మల్‌ తెలిపాడు.

ఎంకరేజ్ చేయండి..

ఎంకరేజ్ చేయండి..

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ ముగిసిన తర్వాత పాకిస్థాన్ పరిమిత ఓవర్ల కెప్టెన్ బాబర్ ఆజామ్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా అతని స్ట్రైక్ రేట్, సారథ్య లోపాలను ప్రస్తావిస్తూ విమర్శకులు నోరుపారేసుకున్నారు. అయితే ఈ విషయంలో బాబర్‌ను కమ్రాన్ అక్మల్ వెనుకేసుకొచ్చాడు. వీలైతే అతన్ని ప్రోత్సహించండి, కానీ విమర్శించవద్దని చురకలంటించాడు. జట్టు మేనేజ్‌మెంట్ కూడా ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం పెంచే చర్యలు చేపట్టాలన్నాడు.

Story first published: Sunday, September 13, 2020, 18:51 [IST]
Other articles published on Sep 13, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+