For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

WPL 2026: కొంపముంచిన కమలిని.. గెలిచే మ్యాచ్‌లో ఓడిన ముంబై

వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) శుభారంభం చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో శుక్రవారం ఉత్కంఠగా సాగిన తొలి మ్యాచ్‌లో ఆర్‌సీబీ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఓటమి తప్పదనుకున్న ఈ మ్యాచ్‌లో నదినే డీక్లెర్క్(44 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 63 నాటౌట్)అసాధారణ ప్రదర్శనతో ఆర్‌సీబీ విజయాన్ని కైవసం చేసుకుంది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసింది. నికోలా కేరీ(29 బంతుల్లో 4 ఫోర్లతో 40), సజీవన్ సజన(25 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 45) అద్భుతంగా రాణించారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(17 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 20), గునలన్ కమలిని(28 బంతుల్లో 5 ఫోర్లతో 32)విలువైన పరుగులు చేశారు. అమెలియా కేర్(4), నాట్ సీవర్ బ్రంట్(4) తీవ్రంగా నిరాశపర్చారు. ఆర్‌సీబీ బౌలర్లలో నదినే డీ క్లెర్క్(4/26) నాలుగు వికెట్లు తీయగా.. లారెన్ బెల్, శ్రేయాంక పాటిలో చెరో వికెట్ పడగొట్టారు.

Kamalini s Keeping Error Proves Costly as De Klerk Leads RCB to Victory Over Mumbai Indians in WPL 2026

అనంతరం ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 157 పరుగులే చేసి గెలుపొందింది. నదినే డీ క్లెర్క్ అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగగా.. గ్రేస్ హ్యారీస్(12 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 25) దూకుడుగా ఆడింది. ముంబై బౌలర్లలో నికోలా కారీ(2/35), అమెలియా కేర్(2/13) రెండేసి వికెట్లు తీయగా.. నాట్ సీవర్ బ్రంట్, షబ్నిమ్ ఇస్మాయిల్, అమన్‌జోత్ కౌర్ తలో వికెట్ తీసారు.

4 బంతుల్లో 20 పరుగులు..

ఆఖరి ఓవర్‌లో ఆర్‌సీబీ విజయానికి 18 పరుగులు అవసరం కాగా.. నాట్ సివర్ బ్రంట్ తొలి రెండు బంతులను డాట్ చేసింది. ఆ తర్వాతి మూడు బంతుల్లో నదినే డీ క్లెర్క్ వరుసగా 6, 4, 6 బాది మ్యాచ్‌ను ఉత్కంఠగా మార్చింది. ఆర్‌సీబీ విజయానికి ఆఖరి బంతికి రెండు పరుగులు అవసరం కాగా.. డిక్లెర్క్ బౌండరీ బాది విజయాన్ని సొంతం చేసుకుంది.

కొంపముంచిన కమలిని

షబ్నిమ్ ఇస్మాయిల్ వేసిన 19వ ఓవర్‌లో నదినే డిక్లెర్క్‌ను రనౌట్ చేసే అవకాశాన్ని వికెట్ కీపర్ కమలిని చేజార్చింది. ఈ ఓవర్‌లో డిక్లెర్క్‌కు రెండు లైఫ్స్ లభించడం గమనార్హం. ఈ ఓవర్ తొలి బంతికి డిక్లెర్క్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను నాట్ సివర్ బ్రంట్ నేలపాలు చేసింది. రెండో బంతిని బౌండనీ బాదిన డిక్లెర్క్.. మూడో బంతి డాట్ చేసింది. నాలుగో బంతికి క్విక్ డబుల్‌‌కు ప్రయత్నించగా.. కమలిని తప్పిదంతో రనౌటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకుంది. బంతిని అందుకోకుండా స్టంప్స్‌ను కొట్టేసింది. దాంతో డిక్లెర్క్ ఊపిరి పీల్చుకుంది. ఈ అవకాశంతో డిక్లెర్క్ చెలరేగి ముంబై విజయాన్ని లాగేసుకుంది. ఈ ఓవర్ ఆఖరి బంతికి ప్రేమ రావత్(8) బౌండరీ బాదడం కూడా కలిసొచ్చింది.

Story first published: Friday, January 9, 2026, 23:25 [IST]
Other articles published on Jan 9, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+