Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సమీ బయ్యా.. 'కాలూ' ఎల్లప్పుడూ జాత్యాంహకార పదం కాదు!!

Kalu is not always a racist slur, Twitter user tells Daren Sammy

హైదరాబాద్: జాత్యాంహకారం ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. అమెరికాలో నల్లజాతీయుడు జార్జ్‌ ఫ్లాయిడ్‌ ఉదంతంతో క్రికెట్‌లోనూ వర్ణ వివక్ష ఉందంటూ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా గళం విప్పుతున్నారు. క్రికెట్​లో తాను వర్ణ వివక్షతో కూడిన వ్యాఖ్యలను ఎదుర్కొన్నానని విండీస్ మాజీ కెప్టెన్ డారెన్​ సమీ మొదటగా ఆరోపించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్)కు ఆడిన సమయంలో సహచరులు కొందరు 'కాలూ' అని పిలిచేవారని సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేసాడు. ఇక సన్‌రైజర్స్ జట్టులో తనను 'కాలూ' అని పిలిచిన వారందరూ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ కూడా చేసాడు.

 వేర్వేరు అర్థాలుంటాయి:

వేర్వేరు అర్థాలుంటాయి:

తాజాగా ఓ ట్విట్టర్ యూజర్.. డారెన్​ సమీ వ్యాఖ్యలపై స్పందించాడు. 'కాలూ' పదానికి వేర్వేరు అర్థాలు ఉంటాయని, సందర్భానుసారంగా అర్ధం మారుతుందని వివరించాడు. ఆ యూజర్ తన దివంగత అమ్మమ్మ తనను 'కాలూ' అని ఆప్యాయంగా పిలిచేదని ఓ ఉదాహరణ చెప్పాడు. మరోవైపు భారతదేశంలో 'కాలూ'ను ఓ పేరుగా కూడా ఉపయోగించుటున్నారు అని చాలా మంది ట్విట్టర్ వినియోగదారులు పేర్కొన్నారు.

 ఎల్లప్పుడూ జాత్యాంహకార పదం కాదు:

ఎల్లప్పుడూ జాత్యాంహకార పదం కాదు:

'డారెన్​ సమీ బయ్యా.. మీకు ఓ విషయం తెలుసా!!. 'కాలూ' ఎల్లప్పుడూ జాత్యాంహకార పదం కాదు. దీన్ని భారతీయ కుటుంబాలలో కూడా ఉపయోగించబడే అద్భుతమైన పదం. నా దివంగత అమ్మమ్మ నన్ను 'కాలూ' అని ముద్దుగా పిలిచేవారు. ఇది సందర్భంపై ఆధారపడి ఉంటుంది. అవును ఇది జాత్యహంకారంగా ఉండవచ్చు కానీ ఎల్లప్పుడూ కాదు' అని ఓ ట్విట్టర్ యూజర్ ట్వీట్ చేసాడు. దీనిపై సమీ స్పందిస్తూ.. 'నువ్ చెప్పేది నిజమే కావొచ్చు.. నాకు మాత్రం అలా అనిపించడం లేదు' అని రాసుకొచ్చాడు.

'కాలూ... కాలూ' అని పిలిచేవారు:

'కాలూ... కాలూ' అని పిలిచేవారు:

ఐపీఎల్‌ మ్యాచ్‌ల సందర్భంగా తాను జాతి వివక్ష వ్యాఖ్యల్ని ఎదుర్కొన్నానని డారెన్‌ స్యామీ అన్నాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున ఆడిన సమయంలో తనతో పాటు శ్రీలంక క్రికెటర్‌ తిసారా పెరీరా వర్ణ వివక్షకు గురయ్యాడని తెలిపాడు. 'సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సమయంలో నన్ను, పెరీరాను 'కాలూ... కాలూ' అని పిలిచేవారు. అప్పుడు దానర్థం మాకు తెలిసేది కాదు. భారత్‌లో 'కాలూ' అంటే 'బలమైన వ్యక్తి' అని పిలుస్తున్నారేమో అనుకునేవాడిని. కానీ ఈ మధ్యే ఆ పదానికి అర్థం తెలుసుకున్నా. చాలా బాధగా ఉంది' అని స్యామీ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పేర్కొన్నాడు.

సమానత్వాన్ని కోరుకుంటున్నారు:

సమానత్వాన్ని కోరుకుంటున్నారు:

జాత్యాంహకారంపై పోరాడేందుకు మరీ ఎక్కువ ఆలస్యం కాలేదని వెస్టిండీస్ ​విధ్వంసక ఓపెనర్ 'యూనివర్సల్ బాస్' క్రిస్ గేల్ చెప్పాడు. 'సరైన విషయం కోసం పోరాడేందుకు సమయం మించిపోలేదు. కొన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఎదుర్కొన్న చేదు అనుభవాలపై పోరాడేందుకు మరీ ఆలస్యం కాలేదు. నీ కథ లాగే ఇంకా చాలా ఉన్నాయి. నేను చెప్పినట్టే క్రికెట్​లోనూ వర్ణ వివక్ష ఉంది' అని గేల్ ట్వీట్ చేశాడు. నల్ల జాతీయుల పట్ల ఇప్పటి వరకు జరిగింది చాలని, ఇక నుంచైనా వారిని అందరితో సమానంగా గౌరవించాలని వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో అన్నాడు. ఎన్నో ఏళ్లుగా వివక్షకు గురవుతోన్న నల్ల జాతీయులు ప్రతీకారం కోసం చూడట్లేదని, సమానత్వాన్ని కోరుకుంటున్నారని బ్రేవో పేర్కొన్నాడు.

'ఇప్పుడు కోహ్లీనే గొప్ప బ్యాట్స్‌మన్‌.. మరో ఐదేళ్లలో బాబర్'

Story first published: Thursday, June 11, 2020, 17:44 [IST]
Other articles published on Jun 11, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+