Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Kagiso Rabada అరుదైన ఘనత.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి బౌలర్‌గా..!

మొహాలీ: పంజాబ్ కింగ్స్ స్టార్ పేసర్ కగిసో రబడా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగంగా 100 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా నిలిచాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రబడా ఈ ఫీట్ సాధించాడు. గుజరాత్ ఓపెనర్ వృద్దిమాన్ సాహాను ఔట్ చేసిన రబడా.. 100 ఐపీఎల్ వికెట్లను పూర్తి చేసుకున్నాడు.

ఈ క్రమంలో శ్రీలంక దిగ్గజ బౌలర్ లసిత్ మలింగా రికార్డును రబడా అధిగమించాడు. బంతులు, మ్యాచ్‌ల పరంగా రబడానే ఈ జాబితాలో టాప్‌లో ఉన్నాడు. ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన లసిత్ మలింగా.. 70 మ్యాచ్‌ల్లో ఈ ఫీట్ సాధించగా.. రబడా 64 మ్యాచ్‌ల్లో ఈ ఘనతను అందుకున్నాడు.

kagiso rabada punjab kings

భువనేశ్వర్ కుమార్(81), రషీద్ ఖాన్(82), అమిత్ మిశ్రా, ఆశిష్ నెహ్రా.. 83 మ్యాచ్‌ల్లో సెంచరీ వికెట్ క్లబ్‌లో చేరారు. చాహల్‌కు 84 మ్యాచ్‌లు పట్టింది.100 వికెట్లు తీసేందుకు రబడా 1438 బంతులు వేయగా.. మలింగ 1622 బంతులు తీసుకున్నాడు. డ్వేన్ బ్రావో 1619 బంతులతో మూడో స్థానంలో ఉండగా.. 1647 బంతులతో హర్షల్ పటేల్ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ సీజన్‌లో రబడాకు ఇదే తొలి మ్యాచ్ కావడం గమనార్హం.

ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. చివరి 2 బంతుల్లో 4 పరుగులు చేయాల్సిన పరిస్థితుల్లో రాహుల్ తెవాటియా తన ట్రేడ్ మార్క్ షాట్‌తో బౌండరీ బాది విజయాన్నందించాడు.

ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 153 పరుగులు చేసింది. మాథ్యూ షార్ట్(24 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 36), జితేశ్ శర్మ(25) టాప్ స్కోరర్లుగా నిలిచారు. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ రెండు వికెట్లు తీయగా.. షమీ, జోష్ లిటిల్, అల్జారీ జోసెఫ్, రషీద్ ఖాన్ తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన గుజరాత్ టైటాన్స్ 19.5 ఓవర్లలో 4 వికెట్లకు 154 పరుగులు చేసి మరో బంతి మిగిలుండగానే విజయాన్నందుకుంది. శుభ్‌మన్ గిల్(49 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 67) హాఫ్ సెంచరీతో రాణించగా.. వృద్దిమాన్ సాహా(19 బంతుల్లో 5 ఫోర్లతో 30), డేవిడ్ మిల్లర్(17 నాటౌట్) విలువైన పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్, రబడా, సామ్ కరణ్, హర్‌ప్రీత్ బ్రార్ తలో వికెట్ తీసారు.

Story first published: Thursday, April 13, 2023, 23:08 [IST]
Other articles published on Apr 13, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+