Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తోటి క్రీడాకారిణిగా సిగ్గుపడుతున్నా.. బబితా ఫొగాట్‌పై గుత్తా జ్వాల ఫైర్!!

Jwala Gutta slams Babita Phogat over Twitter Controversy
Jwala Gutta Slams Babita Phogat

హైదరాబాద్: భారత స్టార్ రెజ్లర్, బీజేపీ నాయకురాలు బబితా ఫోగాట్‌పై బ్మాడ్మింటన్ డబుల్స్ స్టార్ గుత్తా జ్వాల ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా సంక్షోభ సమయంలో ఓ వర్గాన్ని టార్గెట్ చేస్తూ ట్విటర్ వేదికగా బబితా చేస్తున్న వ్యాఖ్యల పట్ల తోటి క్రీడాకారణిగా సిగ్గుపడుతున్నానని మండిపడింది.

దేశంలో కరోనా బాధితుల సంఖ్య పెరగడానికి తబ్లిగీ జమాత్ ప్రార్థనలే కారణమని బబితా చేసిన ట్వీట్ తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. విద్వేశాన్ని రెచ్చగొట్టేలా ఈ ట్వీట్‌లు ఉన్నాయని వాటిని తొలగించాలని ఇప్పటికే స్వీట్ వార్నింగ్ ఇచ్చిన ఈ టెన్నిస్ స్టార్.. తాజాగా బబితా మత విద్వేషాన్ని రెచ్చగొడుతూ.. భారత దేశ మతసామరస్యాన్ని దెబ్బతీస్తుందని ఆరోపించింది. అలాగే మాటల హింసను ప్రేరేపిస్తున్న బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ సోదరి రంగోలి చందేల్‌‌పై కూడా మండిపడింది.

హింసను ప్రేరేపిస్తున్నారు..

హింసను ప్రేరేపిస్తున్నారు..

హిందూస్తాన్‌ టైమ్స్ చానెల్‌తో జ్వాల మాట్లాడుతూ.. ‘చాలా మంది మాటలతో హింసను ప్రేరేపిస్తున్నారు. బబితా మాత్రమే కాదు కంగనా సోదరి కూడా కొందరిని నాజీలంటూ కాల్చి చంపాలని పిలుపునిచ్చింది. ఇదే ఏ తరహా భాష? అయినా వీరెవరూ వారిని అలా పిలవడానికి? ఇక్కడో చట్టం ఉంది. దానికి విరుద్దంగా ప్రవర్తిస్తే వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయండి. అంతే తప్పా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదు'అని గుత్వాజ్వాల మండిపడింది.

ప్రతీదాడి కోరుకుంటుందా?

ప్రతీదాడి కోరుకుంటుందా?

‘సాధువులపై జరిగిన మూకదాడిని ప్రస్తావిస్తూ బబితా.. ట్వీటర్‌లో ఎందుకంతా నిశబ్దంగా ఉన్నారని రాసుకొచ్చింది. అంటే ఆమె ప్రతీ దాడి జరగాలని కోరుకుంటుందా? అసలేం జరిగిందో ఆమె నిరూపించగలదా? ఆ ఘటనకు బాద్యులెవరో ఆమె గుర్తించగలదా? ఇలాంటి భయంకరమైన వ్యాఖ్యలతో వీరంతా ఏం ఆశిస్తున్నారో అర్థం కావడం లేదు?'అని గుత్తా జ్వాలా అసహనం వ్యక్తం చేసింది.

ఒక్కటేనని చిన్నప్పుడే చెప్పారు కదా..

ఒక్కటేనని చిన్నప్పుడే చెప్పారు కదా..

‘హిందూ, ముస్లిం, సిక్కు, ఇసాయి భాయి, భాయి అని చిన్నప్పుడే మనకు నేర్పించారు. వారితో కలిసి జీవించడం ఎలానో మనం నేర్చుకోలేమా? ఈ విపత్కర పరిస్థితుల్లో దయచేసి ఈ హిందూ-ముస్లిం చర్చలను పక్కన పెట్టండి. మనిషిగా ఎలా ఉండాలో నేర్చుకోండి. ప్రేమను పంచలేనప్పుడు కనీసం ద్వేషాన్నైనా రెచ్చగొట్టకండి. నిశబ్దంగా ఉండండి. ఓ క్రీడాకారిణిగా సిగ్గుపడుతున్నా. మనదేశంలో ముస్లింలు కూడా ఉన్నారు. ఫొగాట్ వారికి ముఖం ఎలా చూపిస్తుంది. నేను ఈ దేశ పౌరురాలిగా గర్వంగా ఫీలవుతూ మాట్లాడుతున్నాను' అని గుత్తా జ్వాలా తెలిపింది.

ప్రధాన సమస్య కరోనా కాదు..

ప్రధాన సమస్య కరోనా కాదు..

సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటూ దేశంలో జరిగే ప్రతిఘటనపై స్పందిస్తూ తన అభిప్రాయాలను నిక్కచ్చిగా పంచుకునే బబితా.. ఇటీవల దేశంలో వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్‌ను ఉద్దేశించి వరుస ట్వీట్‌లు చేసింది. దేశంలో కరోనా వైరస్ కన్నా తబ్లిగీ జమాతే ప్రార్థనలే ప్రధాన సమస్యగా మారాయని ట్వీట్ చేసింది. అంతకు మందు ఈ తబ్లిగీ జమాతే ప్రార్థనల్లో పాల్గొన్న ప్రజలు ఈ వైరస్‌ను ఇతరులకు అంటించకుంటే ఈ పాటికి దేశంలో లాక్‌డౌన్ ఎత్తేసేవారని, కరోనాను భారత్ జయించేదని పేర్కొంది.

Story first published: Friday, April 24, 2020, 17:42 [IST]
Other articles published on Apr 24, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+