న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తోడు ఉండాల్సిందే.. ముద్దులతో రెచ్చిపోయిన జ్వాలా గుత్తా!!

Jwala Gutta posted a romantic photo with Vishnu Vishal

హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి జ్వాలా గుత్తా, తమిళ నటుడు విష్ణు విశాల్ గత రెండేళ్ల నుంచి రిలేషన్‌షిప్‌లో ఉన్న విషయం తెలిసిందే. మొదటలో ఈ విషయాన్ని దాచేసిన ఈ జంట.. గుత్తా జ్వాల పుట్టిన రోజు (సెప్టెంబరు 7) సందర్భంగా ప్రపంచానికి చెప్పారు. తాము త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని.. ఉంగరాలు మార్చుకున్న ఫొటోల్ని విశాల్ సోషల్ ట్విట్ట‌ర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. దాంతో వారి రిలేషన్‌షిప్ అధికారికంగా వెల్లడైంది.

జీవితంలో తోడు ఉండాల్సిందే

ఇటీవలి కాలంలో విష్ణు విశాల్, జ్వాలా గుత్తా రొమాన్స్ పీక్స్‌కు వెళ్లింది. విశాల్‌తో క‌లిసి ఉన్న ఫోటోను జ్వాలా గుత్తా తాజాగా ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానుల‌తో పంచుకున్నారు. అందులో ఆమె విశాల్‌ను గాఢంగా ముద్దు పెట్టుకొంటున్నారు. ప్రియురాలు ముద్దు పెట్టుకొంటుంటే.. విశాల్ ఆనందం వ్యక్తం చేస్తూ కనిపించారు. 'జీవితంలో ఆనందపు క్ష‌ణాల‌ను పూర్తిగా అనుభ‌వించ‌డానికి మ‌న‌కు తోడుగా ఒక‌రు ఉండాల్సిందే' అని జ్వాలా గుత్తా కాప్షన్ పెట్టారు. ఇప్పుడు వారిద్దరి ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

స‌డ‌న్ స‌ర్‌ప్రైజ్

స‌డ‌న్ స‌ర్‌ప్రైజ్

జులై 17న విష్ణు విశాల్ బర్త్ డే సందర్భంగా ఆయనకు స‌డ‌న్ స‌ర్‌ప్రైజ్‌ ఇచ్చారు జ్వాల గుత్తా. బ‌ర్త్‌డే వేడుకలను జరపడానికి హైద‌రాబాద్ నుంచి చెన్నైకు వెళ్లారు. విశాల్‌కు చెప్పకుండా అతడి‌ ఇంటి ముందు ప్ర‌త్య‌క్ష‌మై స‌డ‌న్ స‌ర్‌ప్రైజ్ చేశారు. విశాల్ బ‌ర్త్‌డే వేడుక‌ను ద‌గ్గ‌రుండి నిర్వ‌హించారు. అయితే సాధారణంగా బ‌ర్త్‌డే రోజు ‌ప్రేమికులు ఒక‌రికొరు బ‌హుమ‌తులిచ్చుకుంటారు. అయితే కరోనా నేపథ్యంలో జ్వాల గుత్తా మాత్రం త‌నే పెద్ద గిఫ్ట్ అన్నారు అప్పుడు. ఆ తర్వాత జ్వాల బర్త్ డే సందర్భంగా విశాల్ కూడా స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు.

సంగీత్ వేడుకలో తొలిసారి

సంగీత్ వేడుకలో తొలిసారి

జ్వాలా గుత్తా-విష్ణు విశాల్ దేశంలో కరోనా వైరస్ కేసులు తగ్గిన తర్వాత వివాహం చేసుకోవాలని భావిస్తున్నారు. విశాల్ సోదరి సంగీత్ వేడుకలో తొలిసారి వీరిద్దరు కలిశారు. అప్పుడు వీరి మధ్య చిగురించిన స్నేహం ఆ తరవాత ప్రేమగా మారింది. ఆపై నిచ్చితార్ధం కూడా జరిగింది. ఇరు కుటుంబ సభ్యుల మద్దతు కూడా వీరికి ఉంది. విశాల్ ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. మరోవైపు జ్వాలా కూడా అకాడమీతో తీరికలేకుండా ఉన్నారు.

Jwala Gutta Exclusive Interview
ఆనంద్‌తో ప్రేమ.. విడాకులు

ఆనంద్‌తో ప్రేమ.. విడాకులు

జ్వాల గుత్తా ఫుల్ ఫామ్‌లో ఉన్న సమయంలోనే సహచర ఆటగాడు చేతన్ ఆనంద్‌తో ప్రేమలో పడ్డారు. చాలా కాలం పాటు ప్రేమాయణం సాగించిన తర్వాత వీళ్లిద్దరూ 2005లో వివాహం చేసుకున్నారు. ఆరేళ్ల వైవాహిక జీవితం తర్వాత 2011లో విడిపోయారు. ఇక అప్పటి నుంచి ఆమె ఒంటరిగానే జీవనం సాగిస్తున్నారు. మరోవైపు కాస్ట్యూమ్‌ డిజైనర్‌ రజనీ నటరాజ్‌తో 2011లో విష్ణు విశాల్‌ పెళ్లి జరిగింది. కొన్ని కారణాల వల్ల 2018లో వీరు విడాకులు తీసుకున్నారు. వారికి ఆర్య‌న్‌ అనే నాలుగేళ్ల కుమారుడున్నాడు. విష్ణు తమిళంలో దాదాపు 14 సినిమాల్లో నటించారు.

RR vs MI: శ్రేయాస్ గోపాల్ అద్భుత బంతి.. కీరన్ పొలార్డ్ షాక్!!

Story first published: Monday, October 26, 2020, 12:35 [IST]
Other articles published on Oct 26, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X