Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

HCA ప్రక్షాళన షురూ.. అధికారులతో నాగేశ్వరరావు భేటి!

Justice Nageswara Rao who appointed by SC meets HCA officials to clear way for elections

హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) ప్రక్షాళన కోసం సుప్రీం కోర్టు నియమించిన రిటైర్డ్ జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు రంగంలోకి దిగారు. గురువారం హెచ్‌సీఏ ప్రెసిడెంట్ మహమ్మద్ అజారుద్దీన్, మాజీ ప్రెసిడెంట్ శివలాల్ యాదవ్, సెక్రటరీ విజయానంద్, జాన్ మనోజ్, అపెక్స్ కౌన్సిల్ మెంబర్ అనురాధ, మాజీ ట్రెజరర్ నరేశ్ అగర్వాల్‌తో సహా ఇతర అధికారులతో వరుసగా భేటి అయ్యారు.

వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రణాళికలను సిద్దం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అన్ని పెండింగ్ అంశాలపై నాగేశ్వరరావు ఫోకస్ పెట్టినట్లు సెక్రటరీ జాన్‌మనోజ్ వెల్లడించాడు. 2019-2022‌కు సంబంధించిన హెచ్‌సీఏ అకౌంట్స్‌పై ఆడిటింగ్ నిర్వహించాలని నాగేశ్వరరావును కోరినట్లు శివలాల్ యాదవ్‌ తెలిపాడు.

'హెచ్‌సీఏలో జరిగిన ఆకృత్యాల గురించి నేను నాగేశ్వర రావు దృష్టికి తీసుకెళ్లా. వాటికి ఎవరు బాధ్యత వహిస్తారో చూడాలి. బీసీసీఐ నుంచి హెచ్‌సీఏకు దాదాపు రూ.100 కోట్లు రావాలి. కానీ ఏజీఎమ్‌లో అకౌంట్స్‌ను ఆమోదించకపోవడంతో బోర్డు నిధులు రిలీజ్ చేయడం లేదు. ఇది అత్యంత బాధాకర విషయం. అందుకే ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికైన సంఘం ఉండాలని నేను జస్టిస్ దృష్టికి తీసుకెళ్లా'అని శివలాల్ యాదవ్ చెప్పుకొచ్చాడు. పదవీకాల ముగిసినా కూడా ఆఫీస్ బేరర్లు ఇంకా పదవుల్లో కొనసాగుతున్నారని ఫిర్యాదు చేశాడు.

Justice Nageswara Rao who appointed by SC meets HCA officials to clear way for elections

హెచ్‌సీఏలో ఏర్పడిన వివాదాల పరిష్కారం మొదలు గడువు ముగిసిన కార్యవర్గం స్థానంలో కొత్త కమిటీ కొలువుదీరే వరకు అసోసియేషన్‌ను సజావుగా నడిపే బాధ్యతలను మాజీ జడ్జి నాగేశ్వరరావుకు సుప్రీం కోర్టు అప్పగించిన విషయం తెలిసిందే. ఇక ఎన్నికల నిర్వహణకు ముందు పాత ఓటర్ల జాబితాను నాగేశ్వరరావు ప్రక్షాళించాల్సిన అవసరముంది. ప్రస్తుతం హెచ్‌సీఏ ఓటర్ల జాబితాలో 226 మంది సభ్యులు ఉన్నారు.

కాగా.. అజారుద్దీన్‌ అధ్యక్షతన హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌లో లెక్కకు మిక్కిలి అక్రమాలు చోటుచేసుకున్నాయని సుప్రీంకోర్టు నియమించిన పర్యవేక్షక కమిటీ గుర్తించింది. సంఘం సభ్యులు కొందరు..ఒక్కొక్కరు ఏడు నుంచి ఎనిమిది క్లబ్‌లు కలిగి ఉన్నారని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితాను పారదర్శకంగా రూపొందించడంపై జస్టిస్‌ నాగేశ్వరరావు ప్రధానంగా దృష్టి సారించే అవకాశముంది.

Story first published: Friday, February 24, 2023, 11:36 [IST]
Other articles published on Feb 24, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+