Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs NZ: అర్ష్‌దీప్ సింగ్‌కు అన్యాయం..!

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఆఖరి లీగ్ మ్యాచ్‌లోనూ టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌కు అవకాశం ఇవ్వకపోవడాన్ని అభిమానులు తప్పుబడుతున్నారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా నలుగురు స్పిన్నర్లతో పాటు ఒకే ఒక్క స్పెషలిస్ట్ పేసర్‌తో బరిలోకి దిగింది. హర్షిత్ రాణాను తుది జట్టులో నుంచి తప్పించి వరుణ్ చక్రవర్తీని తుది జట్టులోకి తీసుకుంది.

ఈ మ్యాచ్‌లో లెఫ్టార్మ్ పేసర్ అయిన అర్ష్‌దీప్ సింగ్‌కు అవకాశం దక్కుతుందని అంతా భావించారు. ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడిన షమీకి రెస్ట్ ఇచ్చి అర్ష్‌దీప్ సింగ్‌ను ఆడిస్తారని అంచనా వేసారు. మాజీ పేసర్ జహీర్ ఖాన్ కూడా అర్ష్‌దీప్ సింగ్ అవకాశం లభిస్తుందని తెలిపాడు. కానీ టీమిండియా మేనేజ్‌మెంట్ మాత్రం విభిన్నంగా ఆలోచించి ఎక్స్‌ట్రా స్పిన్నర్‌తో బరిలోకి దిగింది. అయితే ఈ నిర్ణయాన్ని అభిమానులు తప్పుబడుతున్నారు. భారత జట్టులో కేకేఆర్ ఆటగాళ్లకే గంభీర్ ప్రాధాన్యత ఇస్తున్నాడని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. గంభీర్ కారణంగా అర్ష్‌దీప్ సింగ్‌కు అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తున్నారు.

Justice for Arshdeep Singh Fans slams Gautam Gambhir over India s selection vs New Zealand

కేకేఆర్ ఆటగాడి స్థానంలో మరో కేకేఆర్ ప్లేయర్‌కు అవకాశం దక్కిందని, ఇతర ఆటగాళ్లకు అవకాశాలు రావడం లేదని కామెంట్ చేస్తున్నారు. ఈ టోర్నీలో అర్ష్‌దీప్ సింగ్‌కు ఒక్క అవకాశం ఇవ్వకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుందని పోస్ట్‌లు పెడుతున్నారు.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. పవర్ ప్లేలో టాప్-3 వికెట్లను కోల్పోయింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్(2)ను మ్యాట్ హెన్రీ వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. ఆ వెంటనే రోహిత్ శర్మ(15) తన ట్రేడ్ మార్క్ పుల్‌షాట్ ఆడబోయి.. జెమీసన్ బౌలింగ్‌లో క్యాచ్ ఔటయ్యాడు. ఈ పరిస్థితుల్లో శ్రేయస్ అయ్యర్‌తో కలిసి దూకుడుగా ఆడే ప్రయత్నం చేసిన కోహ్లీకి గ్లేన్ ఫిలిప్స్ కళ్లు చెదిరే క్యాచ్‌తో బ్రేక్ వేసాడు. దాంతో భారత్ 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో అక్షర్ పటేల్-శ్రేయస్ అయ్యర్ జట్టును ఆదుకున్నారు. ఆచితూచి ఆడిన ఈ జోడీ.. క్రీజులో సెట్ అయిన అనంతరం భారీ షాట్లతో చెలరేగింది.

Take a Poll

ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్ 75 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో అక్షర్ పటేల్ హాఫ్ సెంచరీ ముంగిట క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో నాలుగో వికెట్‌కు నమోదైన 98 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి కేఎల్ రాహుల్ రాగా.. అయ్యర్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నాడు.

Story first published: Sunday, March 2, 2025, 17:01 [IST]
Other articles published on Mar 2, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+