సీసీ టీ20 ప్రపంచకప్ 2026 ముందు టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కీలక సలహా ఇచ్చాడు. మెగా టోర్నీలో చాలా నిశబ్దంగా కుల్దీప్ యాదవ్ బౌలింగ్ చేయాలని, ప్రతీ బంతికి అప్పీల్ చేస్తానంటే కుదరదన్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
కుల్దీప్ యాదవ్ ప్రతీ బంతికి అప్పీల్ చేస్తూ డీఆర్‌ఎస్ తీసుకోవాలని కెప్టెన్లపై ఒత్తిడి చేస్తాడనే విషయం తెలిసిందే. గతంలో అనేక సందర్భాల్లో కుల్దీప్ యాదవ్ ఒత్తిడిని తట్టుకోలేక డీఆర్‌ఎస్ తీసుకొని రోహిత్ శర్మ భంగపడ్డాడు. ఈ క్రమంలోనే డీఆర్‌ఎస్‌ల విషయంలో కుల్దీప్ యాదవ్‌కు ఎమైనా సలహాలు ఇస్తావా? అని రోహిత్‌ను ప్రశ్నించగా.. ఆసక్తికర వ్యాఖ్యలతో నవ్వులు పూయించాడు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 నేపథ్యంలో అధికార బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ 'కెప్టెన్ రోహిత్ శర్మ రోడ్ మ్యాప్ షో'లో పాల్గొని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఈ ఇంటర్వ్యూ బుధవారం ప్రసారం కానుంది.
ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో క్లిప్స్‌ను స్టార్ స్పోర్ట్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ క్లిప్స్‌లో రోహిత్ శర్మ కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తీని ఎలా ఉపయోగించుకుంటారో చూడాలన్నాడు. 'కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తీని కలిపి ఆడించడం అతిపెద్ద సవాల్‌గా మారుతుంది. ఈ కాంబినేషన్‌తో బరిలోకి దిగాలనుకుంటే తుది జట్టులో ఇద్దరు పేసర్లనే ఆడించాల్సి ఉంటుంది.'అని రోహిత్ తెలిపాడు.

అనంతరం డీఆర్‌ఎస్ నిర్ణయాల విషయంలో కుల్దీప్ యాదవ్ కు ఏమైనా సలహా ఇస్తారా? అని అడిగినప్పుడు.. రోహిత్ శర్మ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. 'కుల్దీప్ యాదవ్‌కు ఇచ్చేంత సలహాలు నా దగ్గర లేవు. గప్‌చుప్‌గా నీ బౌలింగ్ వేసి వెనక్కి వెళ్లు. ప్రతీ బంతికి అప్పీల్ చేయడం కుదురదు'అని బదులిచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో కుల్దీప్ యాదవ్ దారుణంగా విఫలమయ్యాడు. మూడు వన్డేల్లో మూడు వికెట్లు మాత్రమే తీసాడు. అతని వైఫల్యం టీమిండియా విజయవకాశాలను దెబ్బతీసింది. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్ కోసం కుల్దీప్ యాదవ్ సిద్దమవుతున్నాడు. బుధవారం నాగ్‌పూర్ వేదికగా జరిగే తొలి మ్యాచ్‌తో ఐదు టీ20ల సిరీస్‌కు తెరలేవనుంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ముందు టీమిండియా ఆడుతున్న ఆఖరి సిరీస్ ఇదే కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సిరీస్‌లో రాణించి ఆత్మవిశ్వాసంతో టీ20 ప్రపంచకప్ బరిలోకి దిగాలని కుల్దీప్ యాదవ్ భావిస్తున్నాడు.