Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ భారత బ్యాటర్‌ అంటే ఆస్ట్రేలియా సహించదు: జోష్ హజెల్‌వుడ్

 Josh Hazlewood says Australians love to hate Cheteshwar Pujara

న్యూఢిల్లీ: టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్, నయావాల్ చతేశ్వర్ పుజారా (Cheteshwar Pujara) అంటే ఆస్ట్రేలియా జట్టు సహించదని ఆ దేశ స్టార్ పేసర్ జోష్ హజెల్ వుడ్(Josh Hazlewood) అన్నాడు. ఆసీస్‌పై అద్భుత ప్రదర్శన కనబర్చే ఏ బ్యాటర్‌ను అయినా ఆస్ట్రేలియా జట్టుతో పాటు తమ అభిమానులు కూడా ద్వేషిస్తారని తెలిపాడు. చతేశ్వర్‌ పుజారా అంటే తమ వారికి పడదని చెప్పాడు. ఇటీవల ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చతేశ్వర్ పుజారా వంద టెస్టుల మైలురాయిని ఆసీస్‌పైనే అందుకున్న విషయం తెలిసిందే.

తాజాగా ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జోష్ హజెల్ వుడ్.. చతేశ్వర్ పుజారాపై ప్రశంసల జల్లు కురిపించాడు. 'చతేశ్వర్‌ పుజారాను ఔట్‌ చేస్తే వచ్చే థ్రిల్ మాటల్లో వర్ణించలేం. ఎప్పుడైతే అతని వికెట్‌ను దక్కించుకుంటారో.. జీవితంలో చాలా సాధించామనే ఫీలింగ్ కలుగుతోంది. అయితే అతని వికెట్ కోసం తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. నేను చాలా ఏళ్లుగా అతనికి బౌలింగ్‌ చేస్తున్నా. ఆసీస్‌ అభిమానులు కూడా అతన్ని ద్వేషిస్తారు.
టెస్ట్ క్రికెట్‌లో అద్భుతమైన ఆటగాడు'' అని హజెల్‌వుడ్‌ చెప్పుకొచ్చాడు.

గాయం కారణంగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో పాటు భారత్‌తో మూడు వన్డేల సిరీస్‌కు జోష్ హజెల్ వుడ్ దూరమయ్యాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 2-1తో సొంతం చేసుకున్న టీమిండియా వన్డే సిరీస్‌ను మాత్రం 1-2తో కోల్పోయింది. ఐపీఎల్ 2023లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB) జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న హజెల్ వుడ్.. ఈ సీజన్ ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. గాయంతో బాధపడుతున్న అతను ఇంకా ఆర్‌సీబీ జట్టుతో కలవలేదు. సీజన్ మొత్తానికి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత సీజన్‌లో హజెల్‌వుడ్‌ ఏకంగా 22 వికెట్లు పడగొట్టాడు. అతని గైర్హాజరీ ఆర్‌సీబీకి నష్టం చేయనుంది. మూర్చి 31(శుక్రవారం) నుంచి ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభం కానుంది.

Story first published: Tuesday, March 28, 2023, 22:01 [IST]
Other articles published on Mar 28, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+