For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చెత్త షాట్లే మా కొంప ముంచాయి: జోస్ బట్లర్

అహ్మదాబాద్: చెత్త షాట్లే తమ ఓటమిని శాసించాయని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ తెలిపాడు. వన్డే ప్రపంచకప్‌ 2023లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 9 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన జోస్ బట్లర్.. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో దారుణంగా విఫలమయ్యామని తెలిపాడు.

స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయామని చెప్పిన బట్లర్.. న్యూజిలాండ్ అసాధారణ ఆటతో ఆకట్టుకుందని కొనియాడాడు. అయితే ఈ తరహా పరాజయాలు తమకు కొత్త కాదని, గతంలో కూడా ఇలాంటి ఓటముల నుంచి తేరుకొని విజయాలందుకున్నామని గుర్తు చేశాడు.

Jos Buttler says we werent clinical in shot selection after England loss in World Cup opener

ఈ ఓటములు కొత్త కాదు: 'ఈ ఓటమి తీవ్రంగా నిరాశపరిచింది. న్యూజిలాండ్ అసాధారణ ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఈ ఓటమిని జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. పెద్ద టోర్నీలో ఒక్క ఓటమితో వచ్చే నష్టం ఏం లేదు. మా జట్టులోని చాలా మంది ఆటగాళ్లకు ఎంతో క్రికెట్ ఆడిన అనుభవం ఉంది. ఈ తరహా పరాజయాలను గతంలో కూడా మాకు ఎదురయ్యాయి.

ఈ తరహా ఓటముల నుంచి తేరుకొని విజయాలను అందుకున్న అనుభవం కూడా మాకు ఉంది. ఈ రోజు మేం చెత్త ప్రదర్శన కనబర్చాం. న్యూజిలాండ్ బ్యాటింగ్‌ను చూసి ఈ మాట చెప్పడం లేదు. మేం 330 పరుగులు చేయాల్సింది. బ్యాటింగ్‌కు అనుకూలమైన వికెట్. ఆట సాగుతున్నా కొద్దీ వికెట్‌ పూర్తిగా బ్యాటింగ్‌కు సహకరించింది. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ మరీ ఈజీ అయ్యింది.

Joe Root England Team

షాట్ సెలెక్షన్‌లో తప్పు చేశాం: ఆరంభంలోనే వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్.. కీలక భాగస్వామ్యం నెలకొల్పడం చాలా కష్టం. కానీ మేం మా ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేయలేకపోయాం. బ్యాటింగ్‌లో చెత్త షాట్లతో వికెట్లు పారేసుకున్నాం. మేం సానుకూలంగా ఉండటం ముఖ్యమే. మా శైలికి తగ్గట్లు బ్యాటింగ్‌ను కూడా కొనసాగించాలి. మరీ డిఫెన్సీవ్‌గా ఆడాల్సిన పని కూడా లేదు. కానీ షాట్ సెలెక్షన్‌లో తప్పు చేశాం. మా వ్యూహాలను సరిగ్గా అమలు చేయలేకపోయాం.

England New Zealand Match

మా పతనాన్ని శాసించారు: న్యూజిలాండ్ బ్యాటర్లు మాత్రం అద్భుతమైన షాట్స్ ఆడి ఫలితం రాబట్టారు. ఈ పిచ్‌పై మేం చేసిన తప్పులు చాలా చిన్నవి. కాన్వే బిగ్ షాట్స్ ఆడకున్నా వేగంగా పరుగులు చేశాడు. రచిన్ రవీంద్ర కూడా పెద్దగా బౌండరీలు బాదకున్నా పరుగులు రాబట్టాడు. ఈ ఇద్దరూ అసాధారణ ప్రదర్శన కనబర్చారు. అద్భుతమైన భాగస్వామ్యంతో మా పతనాన్ని శాసించారు.

ఫ్లడ్ లైట్స్ కింద బౌలింగ్ చేయడం కష్టమనే ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం. జోరూట్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అతని ఆట గురించి ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఏ ఫార్మాట్‌లోనైనా అతను రాణించగలడు. బెన్ స్టోక్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఫిజియోలతో కలిసి ఫిట్‌నెస్ కోసం అతను శ్రమిస్తున్నాడు.'అని జోస్ బట్లర్ చెప్పుకొచ్చాడు.

rachin ravindra devon conway

శతక్కొట్టిన కాన్వే, రచిన్: ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 282 పరుగులు చేసింది. జోరూట్(86 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 77) హాఫ్ సెంచరీతో రాణించగా.. కెప్టెన్ జోస్ బట్లర్(42 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43) పర్వాలేదనిపించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ మూడు వికెట్లకు తీయగా.. మిచెల్ సాంట్నర్, గ్లేన్ ఫిలిప్స్ రెండేసి వికెట్లు పడగొట్టారు. ట్రెంట్ బౌల్డ్, రచిన్ రవీంద్రకు తలో వికెట్ దక్కింది.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన న్యూజిలాండ్ 36.2 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 283 పరుగులు చేసి మరో 82 బంతులు మిగిలి ఉండగానే సునాయస విజయాన్నందుకుంది. డెవాన్ కాన్వే(121 బంతుల్లో 19 ఫోర్లు, 3 సిక్స్‌లతో 152 నాటౌట్), రచిన్ రవీంద్ర (96 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 123 నాటౌట్) సెంచరీలతో చెలరేగి కివీస్ విజయంలో కీలక పాత్ర పోషించారు.

ఇంగ్లండ్ బౌలర్లలో సామ్ కరణ్ ఒక్కడే ఒక వికెట్ తీసాడు. డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర బ్యాటింగ్‌కు ఇంగ్లండ్ బౌలర్లు తేలిపోయారు.

Story first published: Thursday, October 5, 2023, 22:43 [IST]
Other articles published on Oct 5, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+