IND vs ENG: చెత్త బ్యాటింగ్‌తో మరోసారి గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమి పాలయ్యామని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ అన్నాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా భారత్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 100 పరుగుల తేడాతో చిత్తయ్యింది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన జోస్ బట్లర్.. పాత కథే పునరావృతమైందని తెలిపాడు.
'ఈ ఓటమితో తీవ్ర నిరాశకు గురయ్యాం. ఫస్ట్ ఇన్నింగ్స్ అనంతరం 230 పరుగుల లక్ష్యాన్ని సునాయసంగా చేధిస్తామని అనుకున్నాం. కానీ మళ్లీ పాథ కథే పునరావృతమైంది. డ్యూ వస్తుందా? రాదా? అనేది నాకు కచ్చితంగా తెలియదు. మేం అద్భుతంగా బౌలింగ్ చేసాం. వికెట్లను తీసాం. 229 పరుగుల లక్ష్యాన్ని కూడా చేధించాల్సింది.

ఆరంభంలోనే వికెట్లు కోల్పోవడంతో వ్యక్తిగతంగా నేను కాస్త ఒత్తిడిని తగ్గించి భాగస్వామ్యం నెలకొల్పాలని భావించా. తద్వారా భారత్ వైపు ఉన్న మూమెంటమ్‌ను మా వైపు తిప్పుకోవాలనుకున్నా. కానీ కుదరలేదు. మరోసారి మేం మా ప్లాన్‌ను పకడ్బందీగా అమలు చేయలేకపోయాం. స్కోర్ బోర్డ్ ప్రెజర్ కూడా మాపై ఏం లేదు.
నాతో సహా మా టాప్ క్లాస్ ఆటగాళ్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. పవర్ ప్లేలో అద్భుతమైన ఆరంభాన్ని అందుకున్నాం. అనూహ్యమైన బౌన్స్‌తో భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టాం. ఫీల్డింగ్ కూడా బాగుంది. ఈ రోజు మేం గెలవాల్సిన మ్యాచ్. కానీ బ్యాటింగ్‌లో విఫలమై ఓటమికి తల వంచాం. ఛాంపియన్స్ ట్రోఫీకి ఇంకా చాలా సమయం ఉంది. ఇప్పుడే ఆ టోర్నీ గురించి ఆలోచించడం లేదు.'అని బట్లర్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 229 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ(101 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 87) తృటిలో శతకం చేజార్చుకోగా.. సూర్యకుమార్ యాదవ్(47 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 49) హాఫ్ సెంచరీకి పరుగు దూరంలో ఔటయ్యాడు.
కేఎల్ రాహుల్(58 బంతుల్లో 3 ఫోర్లతో 39), జస్‌ప్రీత్ బుమ్రా(25 బంతుల్లో ఫోర్‌తో 16) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇంగ్లండ్ బౌలర్లలో డేవిడ్ విల్లే(3/45) మూడు వికెట్లు తీయగా.. క్రిస్ వోక్స్(2/33), ఆదిల్ రషీద్(2/35) రెండేసి వికెట్లు దక్కాయి. మార్క్‌వుడ్ (1/46) ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్.. 34.5 ఓవర్లలో 129 పరుగులకు కుప్పకూలింది. మహమ్మద్ షమీ(4/22), జస్‌ప్రీత్ బుమ్రా(3/32), కుల్దీప్ యాదవ్(2/24) ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు. రవీంద్ర జడేజా(1/16)కు ఓ వికెట్ దక్కింది. సంచలన బౌలింగ్‌తో 229 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకున్నారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో లియామ్ లివింగ్ స్టోన్(27) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.