Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ ఒక్కడే మా ఓటమిని శాసించాడు: జోస్‌ బట్లర్

Jos Buttler Says It Was A Really Tough Day For Us After Englands Defeat To India In 1st ODI

లండన్: టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా (6/19) నిప్పులు చెరిగే బంతులతో మా ఓటమిని శాసించాడని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ తెలిపాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మంగళవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను 10 వికెట్ల తేడాతో భారత్‌ ఓడించింది. సొంతగడ్డపై ఇంగ్లండ్ పది వికెట్ల తేడాతో ఓడటం ఇదే తొలిసారి. ఇక ఈ పరాజయం అనంతరం మాట్లాడిన బట్లర్.. బుమ్రా అద్భుత బౌలింగ్ కారణంగానే తమ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలిందన్నాడు. అతనో వరల్డ్ క్లాస్ బౌలరంటూ ప్రశంసించాడు. ఈ ఓటమిని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉందని చెప్పిన బట్లర్.. వీలైనంత త్వరగా ఈ మ్యాచ్‌ను మరిపోయి ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నాడు.

చాలా కష్టంగా ఉంది..

చాలా కష్టంగా ఉంది..

'ఇది చాలా కఠినమైన రోజు. ఈ ఓటమిని జీర్ణించుకోవడం చాలా కష్టం. కానీ వీలైనంత త్వరగా మరిచిపోయి ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. పిచ్‌పై బంతి కదిలిక ఆశ్చర్యానికి గురి చేసింది. వికెట్ కూడా కొంచెం మగ్గీగా ఉంది. ఈ పరిస్థితులను భారత్ చక్కగా వాడుకుంది. పవర్ ప్లేలో వారు అద్భుతంగా బౌలింగ్ చేశారు. భారత్ బౌలింగ్‌ను ధీటుగా ఎదుర్కొవడంపై మేం చర్చించి, వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. టెస్ట్ క్రికెట్‌లో సత్తా చాటి సూపర్ ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో విఫలమయ్యారు. దురదృష్టవశాత్తు వారి బ్యాట్‌కు బంతి ఎడ్జ్ తీసుకొని ఫీల్డర్ చేతిలోకి వెళ్లింది.

బుమ్రా అర్హుడు..

బుమ్రా అర్హుడు..

జస్‌ప్రీత్ బుమ్రా గొప్ప బౌలర్. మరీ ముఖ్యంగా మాపై చెలరేగుతాడు. ఈ రోజు అతను అద్భుతంగా బౌలింగ్ చేశాడు. బుమ్రా అందుకున్న గణంకాలకు అతను పూర్తిగా అర్హుడు. ఇక మా బౌలర్లు వికెట్లు తీయలేకపోయారు. ఎందుకంటే వికెట్లు తీయాలనే ఒత్తిడి ఉన్నప్పుడు అది సాధ్యం కాదు. ఎప్పుడైతే బౌలర్‌కు రిస్క్ తీసుకునే అవకాశం ఉంటుందో అప్పుడే వికెట్లు లభిస్తాయి.'అని జోస్ బట్లర్ పేర్కొన్నాడు.

బూమ్ బూమ్.. బుల్లెట్ బుమ్రా

బూమ్ బూమ్.. బుల్లెట్ బుమ్రా

మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' జస్‌ప్రీత్‌ బుమ్రా (6/19) సంచలన బౌలింగ్‌కు, మహ్మద్‌ షమీ (3/31) మెరుపులు కూడా తోడవడంతో మొదట ఇంగ్లాండ్‌ 25.2 ఓవర్లలో 110 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ (30; 32 బంతుల్లో 6×4) టాప్‌స్కోరర్‌. అనంతరం కెప్టెన్‌, ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (76 నాటౌట్‌; 58 బంతుల్లో 7×4, 5×6) చెలరేగడం.. మరో ఓపెనర్‌ ధావన్‌ (31 నాటౌట్‌; 54 బంతుల్లో 4×4) కూడా నిలకడగా ఆడడంతో భారత్‌ 18.4 ఓవర్లలో ఒక్క వికెట్టూ నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. భారత పేసర్లు విజృంభించిన పిచ్‌ మీద ఇంగ్లిష్‌ బౌలర్లను అసలేమాత్రం లెక్క చేయలేదు రోహిత్‌.

Story first published: Wednesday, July 13, 2022, 8:47 [IST]
Other articles published on Jul 13, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+