Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Jos Buttler: టాస్ గెలవడమే మా కొంప ముంచింది

న్యూఢిల్లీ: టాస్ గెలవడమే తమ కొంపముంచిందని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ తెలిపాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన ఇంగ్లండ్ 69 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. క్రికెట్ చరిత్రలోనే ఈ ఫలితం సంచలన కాగా.. అఫ్గానిస్థాన్‌కు చారిత్రాత్మక విజయం.

ఈ ఘోర పరాజయంపై స్పందించిన జోస్ బట్లర్.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడం తమ పతనాన్ని శాసించిందన్నాడు. 'టాస్ గెలవకున్నా బాగుండేది. ముందుగా బౌలింగ్‌ చేయడం మా పతనాన్ని శాసిచింది. లెగ్‌సైడ్ వచ్చిన తొలి బంతినే నేను వదిలేయడంతో మూమెంటమ్ చేజారింది. అసాధారణ ప్రదర్శనతో అద్భుత విజయాన్ని అందుకున్న అఫ్గానిస్థాన్‌కు అభినందనలు. బ్యాటింగ్, బౌలింగ్‌లో మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయాం. అఫ్గాన్ మాత్రం రెండు విభాగాల్లో అదరగొట్టింది.

Jos Buttler says Disappointing to win the toss and elected to bowl After Afghanistan Beat England

ఇది ఏ మాత్రం మా స్థాయికి తగ్గ ప్రదర్శన కాదు. అఫ్గాన్ బౌలర్లు మాత్రం అద్భుతంగా బౌలింగ్ చేశారు. మేం ఆశించిన రీతిలో మంచు కూడా రాలేదు. బంతి కూడా అనూహ్యంగా బౌన్స్ అయ్యింది. దాంతో వారు వికెట్ టు వికెట్ లెంగ్త్‌లో బౌలింగ్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు.

ఈ తరహా పరాజయాలు తీవ్రంగా బాధిస్తాయి. అయితే ఈ ఓటమి నుంచి తేరుకునే శక్తి మా ఆటగాళ్లకు ఉంది. తప్పిదాల నుంచి పాఠం నేర్చుకొని బలంగా పుంజుకుంటాం. 'అని జోస్ బట్లర్ తెలిపాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 49.5 ఓవర్లలో 284 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ రెహ్మానుల్లా గుర్బాజ్(57 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 80), ఇక్రామ్ అలిఖిల్(66 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 58) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్(3/42) మూడు వికెట్లు తీయగా.. మార్క్ వుడ్(2/50) రెండు వికెట్లు పడగొట్టాడు. లియామ్ లివింగ్‌స్టోన్(1/33), జోరూట్(1/19)తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్ 40.3 ఓవర్లలో 215 పరుగులకు కుప్పకూలింది. హ్యారీ బ్రూక్(61 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 66) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. అఫ్గాన్ బౌలర్లలో ముజీబ్ ఉర్ రెహ్మాన్, రషీద్ ఖాన్ మూడేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ నబీ రెండు వికెట్లు పడగొట్టాడు. ఫజలక్ ఫరూకీ, నవీన్ ఉల్ హక్ తలో వికెట్ తీసారు.

వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటి వరకు అఫ్గానిస్థాన్ రెండు మ్యాచ్‌లే గెలిచింది. అందులో ఒకటి 2015 వన్డే ప్రపంచకప్‌లో స్కాట్‌లాండ్‌పై విజయం కాగా.. రెండోది తాజా ఫలితమే. డిఫెండింగ్ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌ను ఓడించిన ఆ జట్టు చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది.

Story first published: Sunday, October 15, 2023, 22:32 [IST]
Other articles published on Oct 15, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+