Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: ఆ ఇద్దరి వల్లే గెలిచాం: జోస్ బట్లర్

ఆదిల్ రషీద్, మార్క్ వుడ్ అసాధారణ ప్రదర్శనతో విజయం సాధించామని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ అన్నాడు. చివర్లో ఈ ఇద్దరు నెలకొల్పిన 24 పరుగుల భాగస్వామ్యం మ్యాచ్‌ను మలుపు తిప్పిందని చెప్పాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా రాజ్‌కోట్ వేదికగా మంగళవారం జరిగిన మూడో టీ20లో ఇంగ్లండ్ 26 పరుగుల తేడాతో టీమిండియాను ఓడించిన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో ఇంగ్లండ్ 1-2తో సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.

ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన జోస్ బట్లర్.. ఆదిల్ రషీద్, మార్క్‌వుడ్‌లపై ప్రశంసల జల్లు కురిపించాడు. తమ బౌలర్లు పిచ్ కండిషన్స్ తగ్గట్లు బౌలింగ్ చేశారని కొనియాడాడు. 'మా కుర్రాళ్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. అద్భుతమైన తమ నైపుణ్యాలను ప్రదర్శించారు. వారి బౌలింగ్ వేగమే కాకుండా పరిస్థితులను చక్కగా అందిపుచ్చుకున్నారు. ఆదిల్ రషీద్.. మా జట్టులో ముఖ్యమైన ఆటగాడు. అతను మా జట్టులో ఉండటం మేం చేసుకున్న అదృష్టం.

Jos Buttler Says Credit to Adil Rashid and Mark Wood After England beat India in 3rd T20I

అతనిలో అన్ని రకాల వేరియేషన్స్ ఉన్నాయి. జోఫ్రా ఆర్చర్ నిలకడగా బౌలింగ్ చేయగలడు. ఎక్కువగా సిక్సర్లు సమర్పించుకోడు. వికెట్ చాలా భిన్నంగా ఉంది. డకెట్ అద్భుతంగా ఆడాడు. మేం వరుసగా వికెట్లు కోల్పోవడం నిరాశకు గురి చేసింది. పవర్ ప్లేలో వికెట్లు తీయడం చాలా ముఖ్యం. కీలక వికెట్లు తీసి భారత్‌పై ఒత్తిడి పెంచాం. ఈ గెలుపు క్రెడిట్ రషీద్, మార్క్ వుడ్‌లదే.

చివర్లో కీలక భాగస్వామ్యంతో పోరాడే లక్ష్యాన్ని అందించారు. వారి భాగస్వామ్యమే మాకు విజయాన్నందించింది.'అని జోస్ బట్లర్ చెప్పుకొచ్చాడు. ఆదిల్ రషీద్(10 నాటౌట్), మార్క్ వుడ్(10 నాటౌట్) ఆఖరి వికెట్‌కు 24 పరుగులు జోడించారు. భారత్ 26 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ ఇద్దర్ని ఔట్ చేసి ఉంటే భారత్ సునాయసంగా గెలిచేది.

Jos Buttler Says Credit to Adil Rashid and Mark Wood After England beat India in 3rd T20I

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 171 పరుగులు చేసింది. బెన్ డకెట్(28 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 51) హాఫ్ సెంచరీతో రాణించగా.. లియామ్ లివింగ్‌స్టోన్(24 బంతుల్లో ఫోర్, 5 సిక్స్‌లతో 43) ధాటిగా ఆడాడు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ(5/24) ఐదు వికెట్లతో సత్తా చాటగా.. హార్దిక్ పాండ్యా(2/24) రెండు వికెట్లు పడగొట్టాడు. రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసారు.

అనంతరం భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 146 పరుగులు చేసి ఓటమిపాలైంది. భారత బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా(35 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 40), అభిషేక్ శర్మ(14 బంతుల్లో 5 ఫోర్లతో 24) మినహా అంతా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కార్స్ రెండేసి వికెట్లు తీయగా.. జామీ ఓవర్టన్ మూడు వికెట్లు పడగొట్టాడు. మార్క్ వుడ్‌‌కు ఓ వికెట్ దక్కింది.

Story first published: Wednesday, January 29, 2025, 8:37 [IST]
Other articles published on Jan 29, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+