For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs ENG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: జోస్ బట్లర్

తిలక్ వర్మ అసాధారణ బ్యాటింగ్‌ ప్రదర్శనతోనే గెలిచే మ్యాచ్‌లో ఓటమిపాలయ్యామని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ తెలిపాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా శనివారం చెన్నై వేదికగా జరిగిన రెండో టీ20లోనూ భారత్ 2 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది.

ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో తెలుగు తేజం తిలక్ వర్మ(55 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 72 నాటౌట్) అసాధారణ ప్రదర్శనతో టీమిండియా విజయాన్నందుకుంది. 116 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును టెయిలెండర్ల సాయంతో తిలక్ వర్మ ఓటమి నుంచి గట్టెక్కించాడు.

Jos Buttler Says All Credit To Tilak Varma After India Beat England In 2nd T20I

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 165 పరుగులు చేసింది. కెప్టెన్ జోస్ బట్లర్(30 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 45) టాప్ స్కోరర్‌గా నిలవగా.. బ్రైడన్ కార్స్(17 బంతుల్లో ఫోర్లు, 3 సిక్స్‌లతో 31) విలువైన పరుగులు చేశాడు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మలకు తలో వికెట్ పడగొట్టారు.

అనంతరం భారత్.. 19.2 ఓవర్లలో 8 వికెట్లకు 166 పరుగులు చేసి గెలుపొందింది. తిలక్ వర్మకు అండగా వాషింగ్టన్ సుందర్(19 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 26) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్(3/29) మూడు వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్, ఆదిల్ రషీద్, ఓవర్టన్, లివింగ్ స్టోన్ తలో వికెట్ తీసారు.

ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన జోస్ బట్లర్.. ఓడినా గట్టి పోటీనిచ్చామని సంతోషం వ్యక్తం చేశాడు. 'ఇదో గొప్ప మ్యాచ్. ఈ గెలుపు క్రెడిట్ తిలక్ వర్మదే. అసాధారణ బ్యాటింగ్‌తో టీమిండియాకు విజయాన్నందించాడు. ఈ మ్యాచ్‌లో మేం చాలా అవకాశాలను సృష్టించాం. దూకుడుగా ఆడాం. ప్రతీ ఒక్కరు రాణించారు. విజయం కోసం తీవ్రంగా పోరాడారు.

Jos Buttler Says All Credit To Tilak Varma After India Beat England In 2nd T20I

మా బ్యాటింగ్ తీరు పట్ల సంతోషంగా ఉంది. ఆరంభంలోనే వికెట్లు కోల్పోయినా.. మేం కోరుకున్న విధంగానే తదుపరి బ్యాటర్లు దూకుడు కనబర్చారు. పోరాడే లక్ష్యాన్ని అందించారు. మా ఆట తీరు సంతృప్తినిచ్చింది. ఈ మ్యాచ్‌లో ఓడినా మాకు అనేక సానూకూలంశాలు లభించాయి.

అరంగేట్రంలోనే జేమీ స్మిత్ అదరగొట్టాడు. బ్రైడన్ కార్స్ బ్యాట్, బంతితో రాణించి విజయ అవకాశాలను సృష్టించాడు. ఈ ప్రదర్శనలు సంతోషాన్నిచ్చాయి. మేం ఎప్పుడైనా మెరగవచ్చు. కానీ మా ఆట తీరు మరింత సంతోషాన్నిచ్చింది. భారత్ ఎప్పుడూ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతోంది. వారు కొన్ని వికెట్లు తీస్తున్నారు. అయితే వారి బౌలింగ్‌లో మేం పరుగులు చేస్తే నేను సంతోషిస్తాను.'అని జోస్ బట్లర్ చెప్పుకొచ్చాడు.

Story first published: Sunday, January 26, 2025, 7:14 [IST]
Other articles published on Jan 26, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+