బుడ్డోడే నా వరల్డ్ రికార్డ్‌ను బ్రేక్ చేస్తాడు: జోస్ బట్లర్
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ విధ్వంసకర వీరులు కీరన్ పోలార్డ్, క్రిస్ గేల్‌లను బట్లర్ అధిగమించాడు.
ది హండ్రెడ్ లీగ్ టోర్నీలో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న బట్లర్.. వెల్ష్ ఫైర్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 20 బంతుల్లో 51 పరుగులు చేసి ఈ ఫీట్ సాధించాడు. దాంతో 522 టీ20 మ్యాచ్‌ల్లో 14,833 పరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు. కీరన్ పోలార్డ్ 746 మ్యాచ్‌ల్లో 14803 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతుండగా.. క్రిస్ గేల్ 14,562 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు.

ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంచైజీ లీగ్స్ ఆడే బట్లర్ అత్యధికంగా ఐపీఎల్‌లో 138 మ్యాచ్‌ల్లో 4646 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఇంగ్లండ్ తరఫున 160 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 4,212 పరుగులు సాధించాడు. ది హండ్రెడ్ టోర్నీలో 31 మ్యాచ్‌ల్లో 1,192, విటాలిటీ బ్లాస్ట్ లీగ్‌లో 115 మ్యాచ్‌ల్లో 2688, ఎస్‌ఏ20లో 31 మ్యాచ్‌ల్లో 969, బిగ్ బాష్ లీగ్‌లో 18 మ్యాచ్‌ల్లో 605, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో 14 మ్యాచ్‌ల్లో 225, ఛాంపియన్స్ లీగ్‌లో 5 మ్యాచ్‌ల్లో 59 పరుగులు చేశాడు.
ఈ రికార్డ్‌ను టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీనే బద్దలు కొడుతాడని జోస్ బట్లర్ జోస్యం చెప్పాడు. 'క్రికెట్ చాలా వేగంగా మారుతుంది. ఒక రోజు దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటే.. మరో రోజు అదృష్టం కలిసొస్తుంది. కొన్ని నెలల కిందట ఫామ్ కోసం ఇబ్బంది పడ్డా. ఇప్పుడు నా కెరీర్‌లోనే అత్యుత్తమంగా ఆడుతున్నాననిపిస్తోంది.
ప్రతీ ఆటగాడి ముందు రెండు మార్గాలు ఉంటాయి. గేమ్‌ను వదిలేయడం లేదా ముందుకు సాగుతూ ఫామ్ అందుకోవడం. నేను రెండోదానిని ఎంచుకున్నా. ప్రపంచంలోనే టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలవడం చాలా సంతోషంగా ఉంది. అయితే, ఎవరో ఒకరు ఈ రికార్డునూ అధిగమిస్తారనుకుంటున్నా.. అదీ వైభవ్ సూర్యవంశీ కావొచ్చనేది నా అంచనా. ఇప్పటికైతే ఈ ఘనత పట్ల గర్వంగా ఉంది.'అని జోస్ బట్లర్ చెప్పుకొచ్చాడు.
జోస్ బట్లర్ అద్భుత బ్యాటింగ్‌తో ఈ మ్యాచ్‌లో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెల్ష్ ఫైర్ టీమ్ 155 పరుగులే చేసింది. ఆ తర్వాత పోరాడిన మాంచెస్టర్ టీమ్.. ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

