Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బట్లర్‌కు మద్దతుగా మిడిలార్డర్ రాణించాలి: రాజస్థాన్ పేసర్

Jos Buttler and Jaydev Unadkat

హైదరాబాద్: రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్‌కు మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ సహకారం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆ జట్టు బౌలర్ జయదేవ్ ఉనాద్కత్ పేర్కొన్నాడు. ఐపీఎల్ టోర్నీలో భాగంగా శుక్రవారం రాత్రి జైపూర్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్-రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడిన సంగతి తెలిసిందే.

గత నాలుగు మ్యాచ్‌ల్లో వరుస హాఫ్ సెంచరీలతో జోస్ బట్లర్‌ అద్భుత ప్రదర్శన చేస్తున్నామిడిలార్డర్ మాత్రం విఫలమవుతూ వస్తోంది. శుక్రవారం నాటి మ్యాచ్‌లో కూడా ఒక ఎండ్‌లో జోస్ బట్లర్ దూకుడుగా ఆడుతుంటే, మరొక ఎండ్‌లో అతడికి మద్దతుగా నిలిచే వారే కరువయ్యారు. అయినా సరే చివరి వరకు క్రీజులో నిలబడి ఒంటి చేత్తో జట్టుకు విజయాన్నందించాడు.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

తాజా విజయంతో రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ రేసులో ఆశలను సజీవంగా ఉంచుకుంది. మ్యాచ్ అనంతరం రాజస్థాన్ పేసర్ జయదేవ్ ఉనాద్కత్ మాట్లాడుతూ 'గత నాలుగు మ్యాచ్‌లో జోస్ బట్లర్‌ ఒక్కడే ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. ఇలాంటి సమయంలో ఇతర బ్యాట్స్‌మెన్లు కూడా బాధ్యత తీసుకోవాలి' అని అన్నాడు.

'చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో బిన్నీ, గౌతమ్‌ కూడా రాణించారు. లేకపోతే జట్టును విజయతీరాలకు చేర్చేందుకు బట్లర్‌కు మరింత కష్టమయ్యేది. జోస్ బట్లర్‌కు మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ సహకారం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది' అని ఉనాద్కత్ అన్నాడు. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో జోస్ బట్లర్ (95 నాటౌట్‌; 60 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

దీంతో చెన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ రాయల్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చెన్నై నిర్ధేశించిన 177పరుగుల లక్ష్య ఛేదనను రాజస్థాన్ రాయల్స్ 19.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి చేధించింది. ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ 10 పాయింట్లతో ఆరో స్థానానికి ఎగబాకింది.

అంతకముందు చెన్నై నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. అంతేకాదు జోస్‌ బట్లర్‌ గత నాలుగు మ్యాచ్‌ల్లో వరుసగా 67, 51, 82, 95 పరుగులతో హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ఈ నాలుగు మ్యాచ్‌ల్లో రాజస్థాన్ రాయల్స్ మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్ పూర్తిగా విఫలమయ్యారు.

Story first published: Saturday, May 12, 2018, 15:58 [IST]
Other articles published on May 12, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+