భారత బౌలర్లకు బట్లర్ బడిత పూజ.. బ్రూక్ ఊచకోత!
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్(64 బంతుల్లో 12 ఫోర్లు, 8 సిక్స్‌లతో 131)విధ్వంసకర శతకంతో చెలరేగాడు. టీమిండియాతో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా సౌతాంప్టన్ వేదికగా జరిగిన ఆఖరి మ్యాచ్‌లో బట్లర్ ఆకాశమే హద్దుగా విధ్వంసం సృష్టించాడు. 8 భారీ సిక్సర్లతో భారత బౌలర్లకు బడిత పూజ చేశాడు. జోస్ బట్లర్‌తో పాటు కెప్టెన్ హ్యారీ బ్రూక్(45 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్స్‌లతో 95 నాటౌట్) కూడా పరుగుల సునామీ సృష్టించడంతో మైదానంలో భారత ఫీల్డర్లు ప్రేక్షకుల్లా మారిపోయారు.
రికార్డ్ భాగస్వామ్యం..
ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు 233 పరుగుల భాగస్వామ్యం అందించడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 257 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత బౌలర్లలో శివమ్ దూబే(2/22) రెండు వికెట్లు తీయగా.. ప్రసిధ్ కృష్ణ ఒక వికెట్ పడగొట్టాడు.

ఈ మ్యాచ్‌లోనూ పిచ్‌ను అంచనా వేయడంలో భారత్ విఫలమైంది. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న వికెట్‌పై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కానీ పిచ్ కండిషన్స్‌ను సరిగ్గా అంచనా వేసిన ఇంగ్లండ్ మాత్రం టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలనుకుంది. మొత్తానికి టీమిండియా మేనేజ్‌మెంట్ వైఫల్యం బౌలర్లకు శాపంగా మారింది. అంతేకాకుండా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న వికెట్‌పై టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీని పక్కనపెట్టి టీమిండియా మూల్యం చెల్లించుకుంది.
సిక్సర్ల మోత..
రెండో ఓవర్‌లోనే ఫిల్ సాల్ట్(6)ను ప్రసిధ్ కృష్ణ ఔట్ చేసినా.. ఆ ఆనందం ఎక్కువ సేపు లేదు. బట్లర్ నిదానంగా ఆడినా.. హ్యారీ బ్రూక్ విధ్వంసకర బ్యాటింగ్‌తో భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఆ తర్వాత బట్లర్ కూడా బ్యాట్ ఝులిపించడంతో పరుగుల వరద పారింది. 5.3 ఓవర్లలో 50 పరుగులు పూర్తి చేసుకున్న ఇంగ్లండ్.. మరో 4 ఓవర్ల వ్యవధిలోనే 100 పరుగుల మార్క్ అందుకుంది. 19 బంతుల్లో బ్రూక్ హాఫ్ సెంచరీ సాధించగా.. జోస్ బట్లర్ 34 బంతుల్లో అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు.
అనంతరం మరింత దూకుడుగా ఆడిన ఈ జోడీ.. ఎలాంటి అవకాశం ఇవ్వకుండా భారత బౌలర్లపై విరుచుకుపడింది. 51 బంతుల్లో బట్లర్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. శతకం అనంతరం అక్షర్ పటేల్ బౌలింగ్ అతను ఇచ్చిన క్యాచ్‌ను సూర్యాన్ష్ షెడ్గే నేలపాలు చేశాడు. ఈ అవకాశంతో అతను మరిన్ని బౌండరీలు రాబట్టాడు.
చివరకు బట్లర్‌ను శివమ్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చడం.. రెండో వికెట్‌కు నమోదైన 233 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. జాకోబో బెతెల్‌ను దూబే గోల్డెన్ డకౌట్ చేయగా.. విల్ జాక్స్(7 నాటౌట్)తో కలిసి బ్రూక్ జట్టు స్కోర్‌ను 257కు చేర్చాడు. ప్రిన్స్ యాదవ్, అక్షర్ పటేల్ 60+ రన్స్ సమర్పించుకోగా.. శివమ్ దూబే ఒకే ఓవర్‌లో 22 పరుగులిచ్చుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

