
అహ్మదాబాద్: ఐపీఎల్ 2022 సీజన్‌లో బ్యాట్‌తో దంచికొట్టిన రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్.. ప్రైజ్ మనీలోనూ దుమ్మురేపాడు. ఈ సీజన్‌లో ఏకంగా 37 అవార్డులు అందుకున్న బట్లర్ వాటి ద్వారా రూ.95 లక్షల ప్రైజ్‌మనీ ఖాతాలో వేసుకొని ఔరా అనింపించాడు. ఈ సీజన్ అవార్డుల్లో ఆరెంజ్ క్యాప్, మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్, గేమ్ చేంజర్, మ్యాగ్జిమమ్ ఫోర్స్, మ్యాగ్జిమమ్ సిక్సెస్, పవర్ ప్లే ప్లేయర్ పురస్కారాలతో రూ.60 లక్షలను గెలుచుకున్నాడు.
ఈ సీజన్‌లో 17 మ్యాచ్‌లు ఆడిన జోస్ బట్లర్.. 57.53 యావరేజ్‌తో 863 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇందులో నాలుగు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలున్నాయి. ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా నిలిచిన బట్లర్‌కు రూ.10 లక్షల క్యాష్ రివార్డు లభించింది. ఇక ఈ సీజన్‌లో 45 సిక్స్‌లు, 83 ఫోర్లు కొట్టిన బట్లర్.. మ్యాగ్జిమమ్ సిక్స్‌లు, మ్యాగ్జిమమ్ ఫోర్స్ అవార్డులను దక్కించుకున్నాడు. ఈ లెక్కన పదేసి లక్షల చొప్పున రూ.20 లక్షలు అతని ఖాతాలో చేరాయి. ఇక ఈ సీజన్ గేమ్ చేంజర్ అవార్డుతో పాటు పవర్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ, మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డులను గెలుచుకున్న బట్లర్ రూ. మరో 30 లక్షలు గెలుచుకున్నాడు.
లీగ్ స్టేజ్‌లో రెండు సార్లు, క్వాలిఫయర్-2లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న బట్లర్ వీటి ద్వారా రూ.7 లక్షలు సాధించాడు. వివిధ మ్యాచ్‌ల్లో పవర్ ప్లేయర్, గేమ్ చేంజర్, మోస్ట్ ఫోర్స్, మోస్ట్ సిక్సెస్, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, సూపర్ స్ట్రైకర్ అవార్డులతో మరో 28 లక్షలు కైవసం చేసుకున్నాడు. ఈ లెక్కన మొత్తం రూ.98 లక్షలను అవార్డుల ద్వారానే సంపాదించాడు.
ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్లో రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (35 బంతుల్లో 39; 5 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా, 'ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్ మ్యాచ్' హార్దిక్ పాండ్యా (3/17) మూడు ప్రధాన వికెట్లతో ప్రత్యర్థి వెన్నువిరిచాడు. అనంతరం గుజరాత్ 18.1 ఓవర్లలో 3 వికెట్లకు 133 పరుగులు చేసి గెలిచింది. శుబ్‌మన్ గిల్ (43 బంతుల్లో 45 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), హార్దిక్ పాండ్యా (30 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్), డేవిడ్ మిల్లర్ (19 బంతుల్లో 32 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు.