ఈ శతాబ్దపు టాప్-10 బౌలర్లు.. భారత్ నుంచి ఒకే ఒక్కడు!
21వ శతాబ్దంలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన టాప్-10 బౌలర్ల జాబితాను ఇంగ్లండ్ ప్లేయర్ జోస్ బట్లర్, మాజీ పేసర్ స్టవర్ట్ బ్రాడ్ ప్రకటించారు. గత 100 ఏళ్లలో తమ బౌలింగ్‌తో క్రికెట్‌ను శాసించిన బౌలర్ల వివరాలను ఈ జాబితాలో వెల్లడించారు. ఈ లిస్ట్‌లో భారత్ నుంచి జస్ప్రీత్ బుమ్రాకు మాత్రమే అవకాశం దక్కింది.
'ఫర్ ది లవ్ ఆఫ్ క్రికెట్' అనే పాడ్‌కాస్ట్‌లో బ్రాడ్, బట్లర్ ఈ టాప్-10 వరల్డ్ క్లాస్ బౌలర్ల వివరాలను పేర్కొన్నారు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా దివంగత స్పిన్నర్ షేన్ వార్న్ అగ్రస్థానంలో నిలవగా.. ఇంగ్లండ్ దిగ్గజం జేమ్స్ అండర్సన్ రెండో స్థానాన్ని అందుకున్నాడు.
భారత్ నుంచి బుమ్రా మాత్రమే..
మూడో స్థానంలో భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు చోటిచ్చారు. ఇప్పటి వరకు మూడు ఫార్మాట్లలో కలిపి 243 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన బుమ్రా 513 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 18 సార్లు ఐదు వికెట్ల ఘనతను సాధించాడు.
భారత్ గెలిచిన రెండు టీ20 ప్రపంచకప్‌ల్లో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. 2024 టీ20 ప్రపంచకప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన బుమ్రా.. 2026 టీ20 ప్రపంచప్‌లో న్యూజిలాండ్‌తో ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అందుకున్నాడు. ఈ క్రమంలోనే బుమ్రాకు బట్లర్, బ్రాడ్ మూడో స్థానం కేటాయించారు.

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఆస్ట్రేలియా దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్(4వ స్థానం), శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్(6వ స్థానం), సౌతాఫ్రికా పేస్ సెన్సేషన్ డేల్ స్టెయిన్(7వ స్థానం)లను వెనక్కి నెట్టి మరీ బుమ్రాకు మూడో స్థానం కేటాయించడం విశేషం.
స్పిన్నర్లకు దక్కని ప్రాధాన్యత..
ఈ జాబితాలో ఆస్ట్రేలియా ప్రస్తుత కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఐదో స్థానంలో నిలవగా.. సౌతాఫ్రికాకు చెందిన డేల్ స్టెయిన్, కగిసో రబడ, షాన్ పొలాక్ వరుసగా 7, 8, 9 స్థానాల్లో చోటు దక్కించుకున్నారు. ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ పదో స్థానంతో ఈ జాబితాను పూర్తి చేశాడు.
అయితే ఈ అత్యుత్తమ బౌలర్ల జాబితాలో స్పిన్నర్లకు బట్లర్, బ్రాడ్ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు. దాంతోనే భారత దిగ్గజ స్పిన్నర్లు అయిన రవిచంద్రన్ అశ్విన్, అనిల్ కుంబ్లే, రవీంద్ర జడేజాలతో పాటు ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయన్ వంటి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లకు ఈ జాబితాలో చోటు దక్కలేదు. ప్రపంచ క్రికెట్లోనే మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచిన ముత్తయ్య మురళీధరన్‌కు ఆరో స్థానం కేటాయించారు.
బట్లర్, బ్రాడ్ ఎంపిక చేసిన టాప్ -10 బౌలర్లు:
షేన్ వార్న్, జేమ్స్ అండర్సన్, జస్ప్రీత్ బుమ్రా, గ్లేన్ మెక్‌గ్రాత్, పాట్ కమిన్స్, ముత్తయ్య మురళీధరన్, డేల్ స్టెయిన్, కగిసో రబాడా, షాన్ పోలాక్, మిచెల్ స్టార్క్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
