For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వారెవ్వా జాంటీ రోడ్స్.. వయసు పెరిగినా జోరు తగ్గలేదుపో!

Jonty Rhodes takes a one-handed stunner during Kings XI Punjab’s training session

దుబాయ్: సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ వయసు పెరిగినా.. ఫీల్డింగ్‌లో మాత్రం జోరు తగ్గలేదు. ప్రపంచ బెస్ట్ ఫీల్డర్‌గా గుర్తింపు పొందిన ఈ సౌతాఫ్రికా దిగ్గజం.. 1990ల కాలంలో తన డైవ్‌లు, క్యాచ్‌లు, ఫీల్డింగ్‌ విన్యాసాలతో ఆకట్టుకున్నాడు. తనలా అద్భుతమైన ఫీల్డర్లు కావాలనుకున్న ఎంతో మంది యువ క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలిచాడు. తనదైన రనౌట్‌లతో ప్రత్యర్థులను వణికించాడు.

ముఖ్యంగా 1992 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ రనౌట్ చేసిన తీరు ప్రత్యేకం. ఇప్పటికి ఆ రనౌట్ అభిమానుల కళ్లల్లో కదలాడుతూనే ఉంటుంది. ఇంజమామ్‌ ఓ బంతిని ఆడి సింగిల్‌ కోసం ప్రయత్నించగా పాయింట్‌ దిశలో ఫీల్డింగ్‌ చేస్తున్న జాంటీ రోడ్స్‌.. అంతే వేగంగా బంతిని అందుకొని అమాంతం వికెట్ల పైకి కొట్టేసాడు. దీంతో రెప్పపాటులో పాక్‌ మాజీ బ్యాట్స్‌మన్‌ ఔటయ్యాడు. అది జాంటిరోడ్స్‌ కెరీర్‌లోనే చిరస్థాయిగా నిలిచిపోయింది.

ప్రస్తుతం ఐపీఎల్‌లో కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ జట్టుకు ఫీల్డింగ్‌ కోచ్‌గా సేవలందిస్తున్న జాంటీ రోడ్స్.. 51 ఏళ్ల వయసులో అద్భుత రీతిలో క్యాచ్ అందుకున్నాడు. మెరికల్లాంటి ఫీల్డర్లను తయారు చేసే క్రమంలో తాజాగా వారితో క్యాచ్‌లు పట్టడం, డైవ్‌లు చేయించడం లాంటివి నేర్పిస్తుండగా ఒకానొక సందర్భంలో తాను కూడా క్యాచ్‌లు పట్టడం మొదలుపెట్టాడు.

ఆటగాళ్లు బంతులు విసురుతుంటే తన ఫీల్డింగ్‌ నైపుణ్యాలను ప్రదర్శించాడు. ఇంత వయసులోనూ తనలోని మునుపటి ఫీల్డర్‌ను గుర్తుకు తెచ్చాడు. ఒక బంతి అతడికి కుడి వైపు దూరంగా వెళుతుండగా గాల్లోకి డైవ్ చేస్తూ దాన్ని ఒంటి చేత్తో అందుకున్నాడు. దీంతో తనలో ఇంకా ఆ వేడి తగ్గలేదని నిరూపించాడు. ఈ వీడియోను పంజాబ్‌ తమ ట్విటర్‌లో అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

Story first published: Monday, September 14, 2020, 19:00 [IST]
Other articles published on Sep 14, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+