For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 WC 2024: వారి వల్లే ఈ ఘోర పరాజయం: అఫ్గానిస్థాన్ హెడ్ కోచ్

టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీ నిర్వాహకుల కారణంగానే తొలి సెమీస్‌లో తమ జట్టు ఘోర పరాజయం చవిచూసిందని అఫ్గానిస్థాన్ హెడ్ కోచ్ జోనాథన్ ట్రాట్ అన్నాడు. టీ20 ప్రపంచకప్ వంటి మెగా టోర్నీలో సెమీఫైనల్ మ్యాచ్‌కు నాసిరకం పిచ్ తయారు చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

సంచలన ప్రదర్శనతో పెద్ద పెద్ద జట్లను ఇంటిదారి పట్టించి సెమీఫైనల్ చేరిన అఫ్గానిస్థాన్.. కీలక పోరులో మాత్రం తేలిపోయింది. గురువారం ఉదయం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 9 వికెట్ల తేడాతో అఫ్గానిస్థాన్‌ను చిత్తు చేసింది.

Jonathan Trott slams Trinidad wicket after 2024 T20 World Cup semi-final loss

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్థాన్ 56 పరుగులకే కుప్పకూలింది. బ్యాటింగ్‌కు కఠినంగా ఉన్న వికెట్‌పై అఫ్గాన్ బ్యాటర్లు 12 ఓవర్లు ఆడలేకపోయారు. దాంతో అఫ్గాన్ 11.5 ఓవర్లకే ఆలౌటైంది. సఫారీ బౌలర్లలో టబ్రైజ్ షంసీ(3/6), మార్కో జాన్సన్(3/16) మూడేసి వికెట్లు తీయగా.. కగిసో రబడా(2/14) రెండు వికెట్లు పడగొట్టాడు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన సౌతాఫ్రికా 8.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 60 పరుగులు చేసి 67 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. అఫ్గాన్ బౌలర్లలో ఫజలక్ ఫరూకీ మాత్రమే వికెట్ తీసాడు. అద్భుత ప్రదర్శనతో తొలి సారి సెమీఫైనల్ చేరిన అఫ్గాన్ అనూహ్య రీతిలో ఓటమిపాలైంది.

అఫ్గాన్ ఘోర పరాజయానికి చెత్త పిచ్ కారణమని జోనాథన్ ట్రాట్ అసహనం వ్యక్తం చేశాడు. 'నన్ను నేను ఇబ్బందులో పడేసుకోవడం ఇష్టం లేదు. కానీ వాస్తవం మాట్లాడకుండా ఉండలేను. ప్రపంచకప్‌లో సెమీఫైనల్ వంటి బిగ్ మ్యాచ్‌కు ఇలాంటి వికెట్ తయారు చేయడం సరికాదు. ఇరు జట్ల మధ్య రసవత్తరపోరు జరిగే వికెట్‌ను రూపొందించాలి. ఇరు జట్ల మధ్య న్యాయమైన పోటీ ఉండాలి.

స్పిన్‌, పేస్‌కు అనుకూలించకుండా పూర్తిగా ఫ్లాట్‌గా ఉండాలని నేను చెప్పడం లేదు. కానీ బ్యాటర్లు భయపడేలా అనూహ్య స్పిన్, బౌన్స్ ఉండటం సరికాదు. బ్యాటర్లు దైర్యంగా తమ నైపుణ్యాలను ఉపయోగించి బ్యాటింగ్ చేసేలా ఉండాలి. టీ20 అంటేనే దూకుడుగా ఆడుతూ పరుగులు చేయడం, వికెట్లు తీయడమే. ఎవరూ కూడా ఔటవ్వకుండా ఉండేందుకు ప్రయత్నించరు.

ప్రత్యర్థి అద్భుతంగా బౌలింగ్ చేసి మా పతనాన్ని శాసించి ఉంటే ఈ ఘోర పరాజయాన్ని స్వీకరించేవాళ్లం. పరిస్థితులను అందిపుచ్చుకున్నారని సరిపెట్టుకునేవాళ్లం. మేం ముందుగా బ్యాటింగ్ చేయకుండా బౌలింగ్ చేసుంటే ఫలితం మరోలా ఉండేది. విభిన్నమైన సెకండాఫ్ చూసేవారు.'అని జోనాథన్ ట్రాట్ చెప్పుకొచ్చాడు. జోనాథన్ ట్రాట్‌తో పాటు రికీ పాంటింగ్, నవ్ ‌జ్యోత్ సింగ్ సిద్దూ‌లు కూడా ఈ పిచ్‌పై విమర్శలు గుప్పించారు.

Story first published: Thursday, June 27, 2024, 16:10 [IST]
Other articles published on Jun 27, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+