Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇంగ్లండ్ సరికొత్త రికార్డు

Johannesburg Test: England become 1st team in history to score 500,000 runs

జోహన్నస్ బర్గ్ : టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇంగ్లండ్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. సంప్రదాయక ఫార్మాట్‌లో 5 లక్షల పరుగులు చేసిన తొలి జట్టుగా నిలిచింది. సౌతాఫ్రికాతో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో జోరూట్ నేతృత్వంలోని ఇంగ్లండ్ ఈ ఘనతనందుకుంది. ఇది ఇంగ్లండ్‌కు 1022వ టెస్ట్ మ్యాచ్ కాగా.. శుక్రవారం తొలి రోజు జోరూట్ సింగిల్‌తో ఈ 5 లక్షల మార్క్‌ను అందుకుంది.

ఇంగ్లండ్ తర్వాత ఆస్ట్రేలియా

ఇంగ్లండ్ తర్వాత ఆస్ట్రేలియా

ఇక ఇంగ్లండ్ తర్వాత ఆస్ట్రేలియా 830 టెస్టుల్లో నాలుగు లక్షల 32 వేల 706 పరుగులతో రెండో స్థానంలో ఉండగా భారత్, వెస్డిండీస్ మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు 540 టెస్ట్‌లు ఆడిన భారత్ 2,73,518(రెండు లక్షల డెబ్బై మూడువేల 518 పరుగులు)రన్స్‌ చేసింది. ఇక వెస్టిండీస్ 545 టెస్ట్‌ల్లో 2,40,441 పరుగులు చేసింది.

అందులోనూ ఇంగ్లండే..

అందులోనూ ఇంగ్లండే..

పోర్ట్ ఎలిజబెత్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మూడో టెస్ట్‌తో ఇంగ్లండ్ విదేశీ గడ్డపై 500 మ్యాచ్‌లు ఆడిన జట్టుగా చరిత్రకెక్కింది. ఈ జాబితాలో 404 మ్యాచ్‌లతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉండగా.. 268 టెస్ట్‌లతో భారత్ మూడో స్థానంలో ఉంది. ఇక వీటిలో 51 గెలిచిన ఇండియా.. 113 ఓడి 104 మ్యాచ్‌లను డ్రా చేసుకుంది.

ఇంగ్లండ్ 192/4

ఇంగ్లండ్ 192/4

ఇక సౌతాఫ్రికాతో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో తొలి రోజు ఆటముగిసే సమయానికి ఇంగ్లండ్ 54.2 ఓవర్లలో 4 వికెట్లకు 192 పరుగులు చేసింది. ఓపెనర్లు జాక్ క్రాలీ(66), డామ్ సిబ్లే(44) శుభారంభాన్ని అందించారు. జాన్ డెన్లీ(27), స్టోక్స్(2) విఫలమైనా... జో రూట్(25 బ్యాటింగ్), పోప్(22 బ్యాటింగ్) మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు.

అసభ్య పదజాలంతో అభిమానిని దూషించిన బెన్ స్టోక్స్

స్టోక్స్ అసభ్య పదజాలం..

స్టోక్స్ అసభ్య పదజాలం..

ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ వికెట్ కోల్పోయిన అసహనంలో ఓ అభిమానిపై నోరు పారేసుకున్నాడు. అసభ్య పదజాలంతో దూషించి అబాసు పాలయ్యాడు. ఈ ఘటనపై అన్ని వైపుల విమర్శలు రావడంతో తన తప్పు తెలుసుకున్న అతను ఆ అభిమానికి క్షమాపణలు తెలియజేశాడు.

Story first published: Saturday, January 25, 2020, 22:57 [IST]
Other articles published on Jan 25, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+