క్రికెట్ కంటే పోలీస్ డ్యూటినే కష్టంగా ఉంది: జోగిందర్ శర్మ

హిసార్ : క్రికెట్ కంటే పోలీస్ ఉద్యోగం చాలా కష్టంగా ఉందని 2007 టీ20 ప్రపంచకప్ హీరో జోగిందర్ శర్మ తెలిపాడు. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో డ్యూటీ చేయాలంటే భయంగా కూడా ఉందన్నాడు. కానీ దేశం కోసం సేవ చేస్తున్నానే ఫీలింగ్ తనని ముందుకు నడిపిస్తుందని ఈ వరల్డ్‌కప్ హీరో చెప్పుకొచ్చాడు. తాజాగా ఈఎస్‌పీఎన్ క్రిక్ ఇన్‌ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు తాను 24 గంటల పాటు విధులు నిర్వహిస్తున్నానని తెలిపాడు.

24 గంటలు అందుబాటులో...
‘నా రోజు ఉదయం 6గంటలకే ప్రారంభం అవుతుంది. ఈ రోజు ఉదయం 9గంటలకే డ్యూటీ నిమ్మిత్తం ఇంటి నుంచి బయటకు ఇప్పడే(రాత్రి 8గంటలు) వచ్చాను. అయినా అత్యవసర కాల్స్‌కు సిద్దంగా ఉండటంతో పాటు 24 గంటలు అందుబాటులో ఉండాలి. ఏ క్షణం పిలిచినా నో చెప్పకూడదు.
నా పరిధిలోని హిసార్ జిల్లాలో రూరల్ భాగం ఎక్కువగా ఉంటుంది. దీంతో ప్రతీరోజు చెక్‌పోస్ట్ వద్ద నిలబడి బస్ డ్రైవర్లకు, ప్రైవేటు వాహనాలకు కరోనాపై అవగాహన కల్పిస్తున్నా. బేసిగ్గా.. ఇంట్లోనే ఉంటూ సురక్షితంగా ఉండండి.. అత్యవసరమైతేనే బయటికి రండి అని సూచిస్తున్నాం. ఎలాంటి కారణం లేకుండా బయటకు వచ్చే వారిపై చట్ట ప్రకారం కేసులు కూడా పెడుతున్నాం. ఇక నిత్యవసర సరుకులు, మందుల కోసం బయటకు వచ్చేవారిని అనుమతిస్తున్నాం. భౌతిక దూరంతో పాటు మాస్క్‌లు ధరించాలని, ప్రభుత్వా జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని సూచిస్తున్నాం.

వలస కూలీల విషయంలో భయమేసింది..
ఓ సందర్భంలో తీవ్రంగా భయపడ్డాను. యూపీ, బీహార్ నుంచి పెద్ద ఎత్తున వలస కూలీలు కాలి నడకన వారి సొంతూళ్లకు బయలు దేరారు. నా టీంతో కలిసి వారిని ఆపి కరోనాపై అవగాహన కల్పిస్తూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన షెల్టర్‌లకు తరలించాం. ఈ ప్రక్రియలో మేం మెగా ఫోన్స్ వాడుతున్నప్పటికీ కొంచెం తేడా వచ్చిన పరిస్థితి మరోలా ఉంటుంది. అప్పుడు చాలా కష్టంగా అనిపించింది. భయం కూడా వేసింది.

రిస్క్ వద్దని..
హిసార్‌కు 110 కిలోమీటర్ల దూరంలోని రోహతక్‌లో మా ఇళ్లు. ఇంటికి వెళ్లే అవకాశం ఉన్నా.. డ్యూటీ నేపథ్యంలో రోజుకు ఎంతోమందిని కలవడం.. ఎక్కడెక్కడో తిరుగుతుండటంతో ఇంటికి వెళ్లి మా కుటుంబ సభ్యులను రిస్క్‌లో పెట్టడం అవసరమా అనిపించింది. అందుకే ఇంటికి వెళ్లకూడదని నిశ్చయించుకున్నా' అంటూ చెప్పుకొచ్చాడు.

ఆఖరి ఓవర్‌లో అదరగొట్టి..
2007 టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్లో ఆఖరి ఓవర్ వేసిన జోగిందర్ అద్భుతమైన బౌలింగ్‌తో భారత్‌ను గెలిపించాడు. ఈ మెగా టోర్నీ అనంతరమే హర్యానా ప్రభుత్వం జోగిందర్ సేవలను గుర్తించి రాష్ట్ర పోలీస్ శాఖలో డీఎస్పీ ఉద్యోగాన్ని ఇచ్చింది. 2018 వరకు క్రికెట్ కెరీర్ కొనసాగించిన జోగిందర్.. అదే ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఇక రిటైర్మెంట్ అనంతరం డీఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నాడు. జోగిందర్ భారత్ తరఫున 4 అంతర్జాతీయ వన్డేలు, 4 టీ20లు ఆడాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications