Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Joginder Sharma: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన 2007 టీ20 ప్రపంచకప్ హీరో!

Joginder Sharma retires from all forms of cricket

న్యూఢిల్లీ: టీమిండియా వెటరన్ బౌలర్, 2007 టీ20 ప్రపంచకప్ హీరో జోగిందర్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు అన్ని రకాల ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పాడు. ఈ మేరకు జోగిందర్ శర్మ ట్విటర్ వేదికగా బీసీసీఐకి రాసిన లేఖను పంచుకున్నాడు. 'అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు అన్ని రకాల క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నాను. 2002-2017 వరకు సాగిన నా క్రికెట్ ప్రయాణంలో ఎన్నో ఏళ్లు అద్భుతంగా గడిచాయి. భారత్ తరఫున ఆడే అవకాశం దక్కడం గౌరవంగా భావిస్తున్నా.

ఈ అవకాశం ఇచ్చిన బీసీసీఐకి కృతజ్ఞతలు. తొలి ఐసీసీ టీ20 ప్రపంచకప్ గెలిచిన టీమిండియాలో సభ్యుడిగా ఉండటం నా అదృష్టం. ఆరోజు నన్ను నమ్మి నాకు ధోనీ బంతినివ్వడం.. నేను వికెట్ తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించడం ఎప్పటికీ మరిచిపోను.

వారికి స్పెషల్ థ్యాంక్స్..

ఐపీఎల్‌లో నన్ను ప్రోత్సహించిన చెన్నై సూపర్ కింగ్స్, నాకు అండగా నిలిచిన హర్యానా ప్రభుత్వానికి నా ప్రత్యేక ధన్యవాదాలు. నా కెరీర్‌‌కు అండగా నిలిచిన సహచర ఆటగాళ్లు, కోచ్‌లకు కృతజ్ఞతలు. నాపై అమితమైన ప్రేమను కనబర్చిన కుటుంబానికి, స్నేహితలుకు ధన్యావాదాలు. వారి సహకారం వల్లే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను. నా జీవితం కొత్త అధ్యాయం కోసం ఎదురు చూస్తున్నాను'అని జోగిందర్ శర్మ ఆ లేఖలో పేర్కొన్నాడు.

పాక్‌తో ఫైనల్లో..

2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో జోగిందర్ శర్మ వేసిన చివరి ఓవర్‌ను ఏ క్రికెట్ అభిమాని మరిచిపోడు. పాకిస్థాన్‌తో జరిగిన నాటి ఫైనల్లో క్రీజులో పాతుకుపోయిన మిస్బా ఉల్ హక్‌ను శ్రీశాంత్ సాయంతో క్యాచ్‌ ఔట్‌గా పెవిలియన్ చేర్చిన జోగిందర్ .. భారత్‌కు చిరస్మరణీయ విజయాన్నందించాడు.

దేశవాళీ టోర్నీల్లో హర్యానా రాష్ట్రానికి సారథ్యం వహించిన జోగిందర్ శర్మ.. 2004లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ ఆరంగ్రేటం చేశాడు. టీమిండియా తరుపున 4 వన్డేలు ఆడిన జోగిందర్ శర్మ ఒకే ఒక్క వికెట్ తీయగలిగాడు.

ఆస్ట్రేలియాతో సెమీఫైనల్లో..

ఆస్ట్రేలియాతో సెమీఫైనల్లో..

టీ20ల్లో మెరుగైన ప్రదర్శన చేసిన జోగిందర్ శర్మ.. టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో ఆఖరి ఓవర్ వేసి విజయాన్నందించాడు. ఫైనల్లోనూ అదే ఫామ్‌ను కనబర్చాడు.ఇదే నమ్మకంతో పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ వేసే బాధ్యత కూడా జోగిందర్ శర్మకే అప్పగించాడు అప్పటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. ఆఖరి ఓవర్‌లో పాకిస్తాన్ విజయానికి 13 పరుగులు కావాలి. చేతిలో ఉన్నది ఒకే ఒక్క వికెట్..

ప్రపంచకప్ విజయం తర్వాత జోగిందర్ శర్మకు రూ.21 లక్షల రివార్డుతో పాటు డిప్యూటీ సూపరిండెంట్‌ ఆఫ్ పోలీసు ఉద్యోగాన్ని హర్యానా ప్రభుత్వ ఇచ్చింది. 2007 అక్టోబర్‌లోనే హర్యానా పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో చేరిన జోగిందర్ శర్మ, 2016-17 సీజన్ వరకూ రంజీ మ్యాచుల్లో ఆడాడు.

ఇక రోహిత్ ఒక్కడే..

ఇక రోహిత్ ఒక్కడే..

2012 వరకూ చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడిన జోగిందర్ శర్మ.. రెండు సార్లు ఐపీఎల్ టైటిల్ ముద్దాడాడు. 2013 వేలంలో అమ్ముడుపోని జోగిందర్ శర్మ.. మళ్లీ పునరాగమనం చేయలేదు. 2007లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన జోగిందర్ శర్మ.. తాజాగా రిటైర్మెంట్ ప్రకటించాడు. దాంతో 2007 టీ20 వరల్డ్ కప్ ఆడిన భారత జట్టులో దినేశ్ కార్తీక్, రోహిత్ శర్మ, పియూష్ చావ్లా మాత్రమే మిగిలారు. వీరిలో దినేశ్ కార్తీక్, పియూష్ చావ్లా భారత జట్టుకు దూరం కాగా.. రోహిత్ భారత జట్టును నడిపిస్తున్నాడు.

Story first published: Friday, February 3, 2023, 16:31 [IST]
Other articles published on Feb 3, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+