Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

స్పిన్‌‌తో భారత్ మమ్మల్ని ఔట్ చేయలేదు: జోఫ్రా ఆర్చర్

Jofra Archer says India cant out-spin us, we have good spinners in our squad
India VS England: India Can't out-Spin us, we have good Spinners in our Squad : Jofra Archer

చెన్నై: భారత్‌తో జరిగే అప్‌కమింగ్ టెస్ట్ సిరీస్‌లో స్పిన్‌తో తమను ఔట్ చేయలేరని ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ అన్నాడు. తమ జట్టులో కూడా మంచి క్వాలిటీ స్పిన్నర్లు ఉన్నారని స్పష్టం చేశాడు. ఫిబ్రవరి 5 నుంచి చెన్నై వేదికగా ప్రారంభమయ్యే ఈ సిరీస్‌లో పేస్ బౌలింగ్‌కు అనుకూలించే పిచ్‌లు ఉంటాయని ఆశిస్తున్నట్లు ఈ ఇంగ్లండ్ స్టార్ పేసర్ తెలిపాడు. అయితే భారత్‌లో భారత్‌తో ఆడటం కఠిన సవాలేనని, కానీ తమ జట్టు కూడా బలంగా ఉందన్నాడు. విజయవకాశాలు తమకు కూడా ఉన్నాయని ధీమా వ్యక్తం చేశాడు.

శ్రీలంక పర్యటనకు విశ్రాంతి తీసుకున్న ఆర్చర్.. బెన్ స్టోక్స్, రోరీ బర్న్స్‌తో కలిసి నేరుగా భారత్‌కు వచ్చాడు. టీమిండియాతో జరిగే టెస్ట్‌ సిరీస్‌తోనే ఈ ముగ్గురు మళ్లీ ఇంగ్లండ్ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఇప్పటికే చెన్నైలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌లోకి ప్రవేశించారు. ఈ సిరీస్ నేపథ్యంలో డేయిలీ మెయిల్‌కు రాసిన కథనంలో ఆసక్తికర విషయాలను ప్రస్తావించాడు.

'ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్‌)లో భాగంగా ఇక్కడ చాలా క్రికెట్ ఆడాను. కానీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన అనుభవం లేదు. కాబట్టి ఎర్రబంతి బౌలింగ్ చేయడం సవాల్‌తో కూడుకున్నదే. ఐపీఎల్‌లో బ్యాట్స్‌మెన్ దూకుడుగా ఆడేందుకు ప్రయత్నిస్తారు. కానీ టెస్ట్ క్రికెట్‌లో అలా ఉండదు. ఓ ఫుల్ సెషన్ క్రీజులోనే నిలబడతారు. అవసరమైతే పిచ్ పాడైపోయేవరకు కూడా ఆడుతారు. ఆ పరస్థితుల్లో ఎవరూ ఏం చేయలేం. అయితే పేస్ బౌలర్లకు అనుకూలంగా ఉండే పిచ్‌లే ఉంటాయని ఆశిస్తున్నా.

ఒక వేళ టర్న్ అయ్యే వికెట్లు ఉండి స్పిన్‌కు అనుకూలంగా ఉన్న మ్యాచ్‌లేం వన్‌సైడ్ కావు. మా జట్టులో కూడా మంచి క్వాలిటీ స్పిన్నర్లు ఉన్నాయి. భారత్ స్పిన్‌తో మమ్మల్ని ఔట్ చేయలేదు. నేను విశ్రాంతి కారణంగా కరేబియన్‌లోని మా ఇంటికి వెళ్లడంతో నాకు కావాల్సినంత బౌలింగ్ ప్రాక్టీస్ లేదు. భారత్‌కు వచ్చినప్పటి నుంచి ఎప్పుడెప్పుడా ప్రాక్టీస్ చేస్తానా? అని ఉత్సాహంతో ఉన్నా. నేను, బెన్ స్టోక్స్, రోరీ బర్న్స్ ముగ్గురం శ్రీలంక నుంచి వచ్చిన ఇంగ్లండ్ జట్టు కన్న ముందుగానే క్వారంటైన్ పూర్తి చేసుకోనున్నాం. కొన్ని ట్రైనింగ్ సెషన్స్‌లో పాల్గొంటే ఇక్క పరిస్థితులపై మాకు ఓ అవగాహన వస్తుంది.'అని ఆర్చర్ పేర్కొన్నాడు.

Story first published: Friday, January 29, 2021, 14:55 [IST]
Other articles published on Jan 29, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+