కోహ్లీ, రోహిత్ కాదు.. అతనే నేను ఎదుర్కొన్న కఠినమైన బ్యాటర్: జోఫ్రా ఆర్చర్
ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ వరల్డ్ బెస్ట్ బౌలర్లలో ఒకడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో అతన్ని ఎదుర్కోవడం బ్యాటర్లకు పెద్ద సవాలే. ఐపీఎల్‌లోనూ ఆర్చర్ అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. తన వేగవంతమైన బంతులతో ఆర్చర్ ఎందరో మేటి బ్యాటర్లను వణికించాడు.
అయితే ఐపీఎల్‌లో తాను ఎదుర్కొన్న వారిలో అత్యంత కఠినమైన భారత బ్యాటర్ కేఎల్ రాహుల్ అని ఆర్చర్ తెలిపాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజాలకు బౌలింగ్ చేసినప్పటికీ, రాహుల్‌ను ఎదుర్కోవడమే తనకు అత్యంత క్లిష్టంగా అనిపించిందని చెప్పాడు.

కార్లోస్ బ్రాత్‌వైట్‌తో కలిసి'ది సూపర్ ఓవర్ షో'లో జోఫ్రా ఆర్చర్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తన కెరీర్‌లో బౌలింగ్ చేయడానికి ఇబ్బంది పడిన ఆటగాడు ఎవరనే ప్రశ్నకు ఆర్చర్ ఏమాత్రం తడుముకోకుండా కేఎల్ రాహుల్ పేరు చెప్పాడు. 'ఐపీఎల్ ఆరంభ సీజన్లలో కేఎల్ రాహుల్ అత్యుత్తమ ఫామ్ కనబర్చాడు.
ఆ సమయంలో అతనికి బౌలింగ్ చేయడం ఒక సవాల్‌గా అనిపించేది. ఆ రోజుల్లో రాహుల్ బ్యాటింగ్ శైలి అద్భుతంగా ఉండేది. పిచ్‌పై ఎలాంటి బంతి వేసినా, మైదానంలోని ఏ మూలకైనా చాలా సులువుగా సిక్స్‌లు కొట్టేవాడు.
వికెట్ల వెనుక, అలాగే గ్రౌండ్ చుట్టూ అతడు ఆడే షాట్లు బౌలర్లలో ఆందోళన కలిగించేవి. రాహుల్‌కు బంతులు వేసేటప్పుడు ఎక్కడ వేయాలో అర్థం కాక బౌలర్లు తీవ్ర ఒత్తిడికి లోనయ్యేవారు.’అని జోఫ్రా ఆర్చర్ చెప్పుకొచ్చాడు.
సాధారణంగా టీ20 క్రికెట్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి విధ్వంసకర బ్యాటర్లకు బౌలింగ్ చేయడం కష్టమని ఎక్కువ మంది బౌలర్లు చెబుతుంటారు. కానీ ఆశ్చర్యకరంగా..జోఫ్రా ఆర్చర్ కేఎల్ రాహుల్ పేరు చెప్పడం తీవ్ర చర్చనీయాంశమైంది. కేఎల్ రాహుల్ టెక్నికల్ పరంగా చాలా బలమైన ఆటగాడు.
బంతిని అలవోకగా టైమింగ్ చేయడం సిద్దహస్తుడు. క్లాసిక్ షాట్లతోనే ప్రత్యర్థి బౌలింగ్‌ను ముక్కలు చేయగల అతని శైలిని ఆర్చర్ ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ప్రస్తుతం జోఫ్రా ఆర్చర్ గాయాల నుంచి కోలుకుని తిరిగి పూర్వ లయను అందుకోవడానికి శ్రమిస్తుండగా.. కేఎల్ రాహుల్ వైట్ బాల్ ఫార్మాట్‌లో తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమవుతున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications