Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RR vs CSK: ఆర్చర్‌ మెరుపులు.. 2 బంతుల్లో 27 పరుగులిచ్చిన చెన్నై బౌలర్!!

Jofra Archer hits 27 runs in 2 balls vs CSK

షార్జా: ఐపీఎల్‌ 2020లో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ పరుగుల వరద పారించింది. రాయల్స్‌ బ్యాట్స్‌మన్‌ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో.. ఈ సీజన్‌లో తొలిసారి రెండొందల స్కోర్ నమోదైంది. తొలుత సంజూ శాంసన్ ‌(74; 32 బంతుల్లో 1x4, 9x6), స్టీవ్‌ స్మిత్‌ (69; 47 బంతుల్లో 4x4, 4x6) అదరగొట్టగా.. చివరి ఓవర్‌లో జోఫ్రా ఆర్చర్ ‌(27; 8 బంతుల్లో 4x6) చెన్నై పేసర్ లుంగి ఎంగిడీకి పీడకల మిగిల్చాడు. మ్యాచ్‌ 19 ఓవర్‌ వరకూ ఒక ఎత్తైతే.. చివరి ఓవర్‌ మరో ఎత్తు అనేలా ఆర్చర్ ఆడాడు. మొత్తంగా రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7వికెట్లు నష్టానికి 216 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.

2 బంతుల్లోనే 27 పరుగులు:

2 బంతుల్లోనే 27 పరుగులు:

చివరి ఓవర్‌లో జోఫ్రా ఆర్చర్ ధాటికి 30 పరుగులు సమర్పించుకున్న లుంగి ఎంగిడీ.. కేవలం 2 బంతుల్లోనే 27 పరుగులు ఇచ్చుకున్నాడు. అదెలా అంటే.. ఎంగీడీ వేసిన తొలి బంతిని ఎదుర్కొన్న జోఫ్రా ఆర్చర్.. లాంగ్ ఆఫ్ మీదుగా భారీ సిక్స్‌ బాదాడు. తర్వాత ఎంగీడీ షార్ట్ బాల్ వేయగా.. పుల్ చేసిన ఆర్చర్ స్క్వేర్ లెగ్ దిశగా సిక్స్‌ కొట్టాడు. ఎంగీడీ మూడో బంతి వేయగా.. ఆర్చర్ మరో సిక్స్ బాదాడు. అయితే అది నోబాల్. ఫ్రీ హిట్ కోసం బాల్ వేయగా.. దాన్ని కూడా ఇంగ్లీష్ పేసర్ సిక్స్‌ కొట్టాడు. దురదృష్టవశాత్తూ అది సైతం నోబాల్ పడింది.

 చివరి మూడు బంతులకు మూడు పరుగులే:

చివరి మూడు బంతులకు మూడు పరుగులే:

మరో ఫ్రీ హిట్ కోసం ఎంగీడీ బాల్ వేయగా.. ఆర్చర్ మరోసారి సిక్స్ కొట్టాడు. ఆ తర్వాత ఎంగీడీ వైడ్ బాల్ వేశాడు. చివరకు ఎంగీడీ మూడో బంతిని పూర్తి చేశాడు. రెండు లీగల్ డెలివరీలు పూర్తయ్యే సరికి ఎంగిడీ 27 పరుగులు ఇచ్చుకున్నాడు. 4 సిక్సులు, 2 నో బాల్స్, ఒక వైడ్ కలిపి మొత్తం 27 పరుగులు అయ్యాయి. అయితే తర్వాతి మూడు బంతులకు మూడు సింగిల్స్ మాత్రమే రావడంతో.. ఎంగీడీ బతికిబయటపడ్డాడు. లేదంటే ఎక్కువ రన్స్ ఇచ్చిన బౌలర్‌గా రికార్డుల్లోకి ఎక్కేవాడు. మొత్తంగా ఆర్చర్ ధాటికి ఎంగిడీ 30 పరుగులు సమర్పించుకున్నాడు.

సంజూ సిక్సుల వర్షం:

సంజూ సిక్సుల వర్షం:

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. యువ బ్యాట్స్‌మన్‌ యశస్వి జైశ్వాల్ ‌(6) మూడో ఓవర్‌లోనే దీపక్ చహర్‌ చేతికి చిక్కగా.. వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌గా వచ్చిన సంజూ చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. సిక్సుల వర్షం కురిపించాడు. స్మిత్‌తో కలిసి రెండో వికెట్‌కు 122 పరుగులు జోడించాడు. ఈ క్రమంలోనే సెంచరీ వైపు వెళ్తున్న సంజూని ఎంగిడీ ఔట్‌ చేశాడు. భారీ సిక్సర్‌ కొట్టబోయి చహర్‌ చేతికి చిక్కాడు.

4 ఓవర్లలో 56 పరుగులు:

4 ఓవర్లలో 56 పరుగులు:

ఆ తర్వాత రాజస్థాన్‌ వరుసగా వికెట్లు కోల్పోయింది. స్మిత్‌కు సహకరించే బ్యాట్స్‌మన్‌ కరవయ్యారు. ఆఖరికి అతడు కూడా 69 పరుగుల చేశాక సామ్‌ కరన్‌ బౌలింగ్‌లో కేదార్‌ జాదవ్‌కు చిక్కాడు. చివర్లో ఆర్చర్‌ మళ్లీ నాలుగు సిక్సులు బాదడంతో చెన్నై ముందు రాజస్థాన్‌ భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఆర్చర్ 8 బంతుల్లోనే 27 రన్స్ చేశాడు. ఎంగీడి 4 ఓవర్లలో 56 పరుగులిచ్ఛాడు.

RR vs CSK: వరుస సిక్సులతో విరుచుకుపడ్డ ఆర్చర్.. శివమెత్తిన శాంసన్.. చెన్నై లక్ష్యం 217

Story first published: Tuesday, September 22, 2020, 23:25 [IST]
Other articles published on Sep 22, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+