Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చరిత్ర సృష్టించిన జో రూట్.. సెంచరీతో ఆల్‌టైమ్ రికార్డ్స్!

ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్(13,378)‌ను జోరూట్ అధిగమించాడు. భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో సెంచరీ సాధించడం ద్వారా జో రూట్ ఈ ఫీట్ సాధించాడు. అన్షుల్ కంబోజ్ వేసిన 101 ఓవర్ మూడో బంతికి సింగిల్ తీయడం ద్వారా రికీ పాంటింగ్‌ను అధిగమించాడు. టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్(15921) అగ్రస్థానంలో ఉండగా.. జోరూట్(13379) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. రికీ పాంటింగ్, జాక్వస్ కల్లీస్(13289), రాహుల్ ద్రవిడ్(13288) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

Joe Root s Record-Breaking Century Puts Him Above Ricky Ponting in All-Time Test Runs List

పాంటింగ్ రికార్డ్ బద్దలు..

అన్షూల్ కంబోజ్ వేసిన 96వ ఓవర్ తొలి బంతిని బౌండరీకి తరలించిన జో రూట్ 178 బంతుల్లో సెంచరీ సాధించాడు. జోరూట్‌కు ఇది 38వ టెస్ట్ సెంచరీ కాగా.. అత్యధిక శతకాలు నమోదు చేసిన నాలుగో బ్యాటర్‌గా నిలిచాడు.ఈ క్రమంలో శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర రికార్డ్‌ను జోరూట్ సమం చేశాడు. ఈ జాబితాలో 51 శతకాలతో సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. జాక్వస్ కల్లీస్(45), రికీ పాంటింగ్(41), జోరూట్ కంటే ముందున్నారు. రాహుల్ ద్రవిడ్(36), స్టీవ్ స్మిత్(36) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

భారత్‌పై అత్యధిక శతకాలు బాదిన బ్యాటర్‌గా కూడా జోరూట్ నిలిచాడు. ఇప్పటి వరకు జోరూట్.. భారత్‌పై 12 సెంచరీలు నమోదు చేశాడు. ఈ క్రమంలో అతను స్టీవ్ స్మిత్ రికార్డ్‌ను అధిగమించాడు. భారత్‌పై స్మిత్ 11 శతకాలు నమోదు చేశాడు. ఓవరాల్‌గా ప్రత్యర్థి జట్టుపై అత్యధిక శతకాలు బాదిన బ్యాటర్ల జాబితాలో డాన్ బ్రాడ్‌మన్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ ఆసీస్ దిగ్గజం ఇంగ్లండ్‌పై 19 శతకాలతో ఈ జాబితాలో టాప్‌లో ఉన్నాడు. సునీల్ గవాస్కర్(వెస్టిండీస్‌పై 13 సెంచరీలు), జాక్ హాబ్స్(ఆస్ట్రేలియాపై 12 శతకాలు), స్టీవ్ స్మిత్(ఇంగ్లండ్‌పై 12 సెంచరీలు), జోరూట్( భారత్‌పై 12 శతకాలు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

Story first published: Friday, July 25, 2025, 20:50 [IST]
Other articles published on Jul 25, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+