ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్‌లో టీమిండియా అద్భుత పోరాటం కనబర్చింది. ఓటమి తప్పదనుకున్న మ్యాచ్‌లో అద్వితీయమైన బ్యాటింగ్ ప్రదర్శనతో డ్రా చేసుకుంది. మరోవైపు గెలవాల్సిన మ్యాచ్‌ను ఇంగ్లండ్ చేజేతులా చేజార్చుకుంది.తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగుల భారీ ఆధిక్యాన్ని అందుకొని కూడా ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించలేకపోయింది. దాంతో బెన్ స్టోక్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శన వృథా అయ్యింది. రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ జోడీని విడదీయలేక డ్రాకు తల వంచింది.
అయితే ఆఖరి రోజు ఆటలో జో రూట్ చేసిన తప్పిదం ఇంగ్లండ్ కొంపముంచింది. క్రీజులోకి వచ్చిన వెంటనే జడేజా ఇచ్చిన క్యాచ్‌ను జో రూట్ నేలపాలు చేశాడు. ఈ అవకాశంతో చెలరేగిన జడేజా.. అజేయ శతకంతో టీమిండియాను ఓటమి నుంచి గట్టెక్కించాడు. ఆఖరి రోజు ఆట లంచ్ బ్రేక్ ముందు ఆర్చర్ బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన జడేజా.. ఎదుర్కొన్న తొలి బంతికే క్యాచ్ ఇచ్చాడు. సెకండ్ స్లిప్ పొజిషన్‌లో ఉన్న జోరూట్ తలపైకి బంతి దూసుకు వచ్చింది. జోరూట్ బంతిని అడ్డుకున్నప్పటికీ తొలి ప్రయత్నంలో అందుకోలేకపోయాడు. రెండో ప్రయత్నంలో చేజార్చాడు. దాంతో జడేజాతో పాటు టీమిండియా ఊపిరి పీల్చుకుంది.

ఈ క్యాచ్ గనుక పట్టి ఉంటే టీమిండియా మరింత ఒత్తిడికి గురయ్యేది. ఇంగ్లండ్ మరింత కసితో బౌలింగ్ చేసే అవకాశాలు ఉండేవి. జడేజా ఔటైన తర్వాత టీమిండియా స్పెషలిస్ట్ బ్యాటర్ కూడా లేడు. గాయంతో ఉన్న పంత్ బ్యాటింగ్‌కు వచ్చినా.. అతను డ్రా చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉండేవి. ఈ అవకాశంతో జడేజా ఆచితూచి ఆడి సెంచరీతో చేయడంతో పాటు ఓటమిని తప్పించాడు. అతనికి వాషింగ్టన్ సుందర్ కూడా అండగా నిలిచాడు. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కు అజేయంగా 203 పరుగులు జోడించారు. దాంతో 174/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా మ్యాచ్ ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 145 ఓవర్లలో 4 వికెట్లకు 430 పరుగులు చేసింది.
భారత్ తొలి ఇన్నింగ్స్ 358 ఆలౌట్( సాయి సుదర్శన్ 61, బెన్ స్టోక్స్ 5/72)
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 669 ఆలౌట్(జోరూట్ 150, బెన్ స్టోక్స్ 141, జడేజా 4/143)
భారత్ రెండో ఇన్నింగ్స్: 425/4 (శుభ్‌మన్ గిల్ 103, జడేజా 107*, సుందర్ 101*, క్రిస్ వోక్స్ 2/67)