Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఈ తరం క్రికెటర్లలో ఆ ఇద్దరు అత్యుత్తమం: జోరూట్

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీలపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జోరూట్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ తరం ఆటగాళ్లలో ఈ ఇద్దరూ అత్యుత్తమ బ్యాటర్లని కొనియాడాడు. వారు సాధించిన ఘనతలే ఈ విషయాన్ని తెలియజేస్తాయని చెప్పాడు. భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు విరాట్ కోహ్లీ దూరమయ్యాడు.

తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ విజయం సాధించగా.. రెండో టెస్ట్‌లో భారత్ గెలిచింది. మూడో టెస్ట్ ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్ వేదికగా జరగనుంది. ఈ క్రమంలో ఓ స్పోర్ట్స్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జోరూట్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

Joe Root says Rohit Sharma and Virat Kohli are modern greats

'టెస్ట్‌ సిరీస్‌లో భారత్ కూడా దూకుడుగా ఆడుతోంది. విరాట్ కోహ్లీ జట్టులో లేకపోయినా టీమిండియా బలంగానే ఉంది. ఈ తరం క్రికెటర్లలో కోహ్లీ, రోహిత్ అత్యుత్తమ ప్లేయర్లు. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. వారు సాధించిన ఘనతలే ఈ విషయాన్ని తెలియజేస్తాయి. సీనియర్ ఆటగాళ్లు అయిన ఈ ఇద్దరూ మిగతా ఆటగాళ్లకు ఆదర్శంగా నిలుస్తారు.

వారు భారీ స్కోర్లు చేయకుండా ఆపేందుకు వ్యూహాలు రచిస్తాం. త్వరగా ఔట్ చేయగలిగితే దాదాపు మ్యాచ్‌పై పట్టు సాధించవచ్చు. వారు ఒక్కసారి క్రీజులో కుదురుకుంటే ఆపడం చాలా కష్టం.'అని జోరూట్ చెప్పుకొచ్చాడు. ఇక మూడో టెస్ట్‌తో పాటు నాలుగో టెస్ట్‌కు కూడా విరాట్ కోహ్లీ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.

తన సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ రెండో బిడ్డకు జన్మనివ్వనున్న నేపథ్యంలో తొలి రెండు టెస్ట్‌లకు కోహ్లీ దూరంగా ఉన్నాడు. ప్రసవ సమయంలో ఆమె పక్కన ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నాడు. బీసీసీఐ అనుమతితోనే ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. అలాగే తన రెండో బిడ్డకు సంబంధించిన విషయాలను కోహ్లీ గోప్యంగా ఉంచాడు.

ఎక్కడా కూడా ఈ విషయాన్ని ప్రకటించలేదు. అంతేకాకుండా అనుష్క శర్మ గర్భవతి అనే విషయం తెలియకుండా ఈ జోడీ చాలా జాగ్రత్తలు తీసుకుంది. కోహ్లీ రెండోసారి తండ్రి కాబోతున్నాడనే విషయాన్ని అతని సన్నిహితుడు, సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ అభిమానులకు తెలిపాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఈ విషయాన్ని పంచుకున్నాడు.

అనుష్క శర్మ ప్రసవం పూర్తి కాకపోవడంతో కోహ్లీ తన లీవ్‌ను పొడిగించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతను ఇంగ్లండ్‌తో మూడు, నాలుగో టెస్ట్‌కు దూరమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

Story first published: Thursday, February 8, 2024, 18:09 [IST]
Other articles published on Feb 8, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+