తేలిపోయిన భారత బౌలర్లు.. రూట్ డబుల్ సెంచరీ! రెండో రోజూ ఇంగ్లండ్‌దే పైచేయి!!

చెన్నై: చెపాక్ మైదానంలో తొలి రోజు సీనే రెండో రోజూ రిపీట్ అయ్యింది. రెండో రోజు కూడా భారత బౌలర్లు తేలిపోగా.. ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ చెలరేగిపోయారు. 263/3 ఓవర్‌నైట్ స్కోరుతో ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ శనివారం రెండో రోజు ఆట ముగిసేసరికి తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 555 పరుగుల భారీ స్కోరు సాధించింది. జో రూట్ (218; 377 బంతుల్లో, 19×4, 2×6), బెన్ స్టోక్స్ (82; 118 బంతుల్లో, 10×4, 3×6) నాలుగో వికెట్‌కు శతక భాగస్వామ్యం (124) నెలకొల్పారు. బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్, షాబాజ్ నదీమ్, ఇషాంత్ శర్మ తలో రెండు వికెట్లు తీశారు. అయితే ఇంగ్లీష్ జట్టు ఇన్నింగ్స్‌ను ఇంకా డిక్లేర్ చేయలేదు.

స్టోక్స్ హాఫ్ సెంచరీ
263/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో శనివారం రెండో రోజు ఆట ప్రారంభించిన జో రూట్, బెన్ స్టోక్స్ వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. ఈ జోడి భారత బౌలర్లను ఈజీగా ఎదుర్కొన్నారు. పెద్దగా ప్రభావం లేని పిచ్‌పై.. రూట్, స్టోక్స్‌లు పరుగుల ప్రవాహం సృష్టించారు. బౌండరీల వర్షం కురిపించారు. స్టోక్స్ భారీ సిక్సులు కూడా బాదాడు. అయితే స్టోక్స్ ఇచ్చిన క్యాచ్‌లను మనోళ్లు రెండుసార్లు వదిలేశారు. దీంతో అతడు హాఫ్ సెంచరీ బాదాడు. 73 బంతుల్లో అర్ధ శతకం చేశాడు. మరోవైపు రూట్ తన శైలిలో ఆడుతూ 150 పరుగుల మార్క్ అందుకున్నాడు. రూట్ 260 బంతుల్లో 150 పరుగులు అందుకున్నాడు. తొలి సెషన్‌లో ఇంగ్లండ్ ఆధిపత్యం చెలాయించింది. భోజన విరామ సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 355 రన్స్ చేసింది.

రూట్ డబుల్ సెంచరీ
రెండో సెషన్‌లో కూడా రూట్, స్టోక్స్ ధాటిగా ఆడారు. దీంతో ఇంగ్లండ్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. అయితే 82 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద స్టోక్స్ స్పిన్నర్ నదీమ్ బౌలింగ్‌లో క్యాచ్ అవుటయ్యాడు. స్వీప్ షాట్‌కు ప్రయత్నించిన స్టోక్స్.. డీప్ లెగ్‌లో ఉన్న చేటేశ్వర్ పుజారాకు క్యాచ్ ఇచ్చాడు. దాదాపు క్యాచ్‌ను వదిలేసినంత పని చేసిన పుజారా.. చివర్లో ఆ క్యాచ్‌ను అందుకుని స్టోక్స్‌ను పెవిలియన్‌కు పంపించాడు. స్టోక్స్, రూట్‌లు నాలుగవ వికెట్‌కు 124 రన్స్ జోడించారు. అనంతరం రూట్‌కు ఓలి పోప్ (34; 89 బంతుల్లో, 3×4) జతకలిశాడు. ఈ క్రమంలో జట్టు స్కోర్ 400 దాటింది. ఆపై రూట్ డబుల్ సెంచరీ చేశాడు. అశ్విన్ బౌలింగ్‌లో సిక్సర్‌తో అతడు డబుల్ సెంచరీని సాధించడం విశేషం. తన కెరీర్‌లో ఇది అయిదో ద్విశతకం కాగా గత మూడు టెస్టుల్లో రెండో డబుల్ సెంచరీ.

చివరి సెషన్‌లో మెరిసిన భారత బౌలర్లు
రూట్ సహా పోప్ కూడా నిలకడగా బ్యాటింగ్ చేయడంతో ఇంగ్లండ్ టీ విరామానికి 454/4 స్కోరుతో పటిష్ఠ స్థితిలో నిలిచింది. అయితే చివరి సెషన్‌లో భారత బౌలర్లు చెలరేగారు. పోప్‌ను అశ్విన్ ఔట్ చేయగా.. ఆ తర్వాతి ఓవర్‌లోనే రూట్‌ను నదీమ్ బోల్తాకొట్టించాడు. ఈ సమయంలో జోస్ బట్లర్ (30; 51 బంతుల్లో, 5×4) వికెట్ల పతనానికి బ్రేక్‌లు వేశాడు. డొమినిక్ బెస్‌తో కలిసి ఏడో వికెట్‌కు 48 పరుగులు సాధించాడు. కానీ ఇషాంత్ వరుస బంతుల్లో బట్లర్, ఆర్చర్ (0)ను ఔట్ చేశాడు. భారత బౌలర్లు జోరు చూస్తే ఇంగ్లీష్ జట్టు ఆలౌట్ అవుతుందని అనిపించింది. కానీ బెస్, లీచ్ ఆ అవకాశం ఇవ్వలేదు. బెస్ (28; 84 బంతుల్లో, 5×4), లీచ్ (6; 28 బంతుల్లో, 1×4) ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
84 ఏళ్ల తర్వాత.. తొలి కెప్టెన్‌గా రూట్ అరుదైన ఘనత!!