నాలుగు మార్పులతో ఇంగ్లండ్.. అండర్సన్, ఆర్చర్, బట్లర్ ఔట్! తుది జట్టు ఇదే!!

చెన్నై: టీమిండియాతో చెన్నై చెపాక్ మైదానంలో జరిగిన తొలి టెస్టులో ఘన విజయం సాధించిన ఇంగ్లండ్ రెండో టెస్టులోనూ అదే ఫలితం పునరావృతం చేస్తుందని ఆ జట్టు కెప్టెన్ జో రూట్ ధీమా వ్యక్తం చేశాడు. రెండో టెస్ట్ కోసం జట్టులో నాలుగు మార్పులు చేస్తున్నట్లు స్పష్టం చేశాడు. స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌కు బదులు సీనియర్ స్టువర్ట్ బ్రాడ్‌ను తీసుకున్నట్లు రూట్ చెప్పాడు. ఇక విశ్రాంతి కోసం స్వదేశానికి వెళ్లిన జోస్ బట్లర్ స్థానంలో బెన్ ఫోక్స్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపడతాడన్నాడు. చెన్నైలోనే శనివారం నుంచి రెండో టెస్ట్ ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే.

విజయ పరంపరను కొనసాగించాలి:
తాజాగా జో రూట్ మీడియాతో మాట్లాడుతూ... 'ఉపఖండ పరిస్థితుల్లో ఆడటం మెరుగుపరుచుకుంటున్నాం. మెల్లిగా ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడుతున్నాం. అలానే మా ప్రణాళికను సరిగ్గా అమలు చేస్తున్నాం. మరోసారి విజయం సాదించేందుకు చెన్నై మాకు మంచి అవకాశంగా భావిస్తున్నాం. ఇక్కడి పరిస్థితుల్లో ఎలా ఆడాలి, ఎలాంటి ప్రణాళికలు రూపొందించుకోవాలనే విషయాలపై జట్టులో చర్చించాం. తొలి టెస్టు విజయ పరంపరను కొనసాగించాలి. అందుకోసం ఆటగాళ్లు తీవ్రంగా కష్టపడుతున్నారు' అని తెలిపాడు.

ఆర్చర్ స్థానంలో బ్రాడ్:
'జోఫ్రా ఆర్చర్ మోచేతికి గాయమైంది. రెండో టెస్ట్ కోసం ఆర్చర్ స్థానంలో స్టువర్ట్ బ్రాడ్ ఆడుతాడు. బ్రాడ్ మేటి బౌలర్. అతడు ఇదివరకు ఎలా రాణించాడో ఇప్పుడు అలానే చెలరేగుతాడు. రెండో టెస్టుకు స్పిన్నర్ డొమినిక్ బెస్, పేసర్ జేమ్స్ అండర్సన్‌కు విశ్రాంతిని ఇచ్చాం. వీరి స్థానాల్లో స్థానాల్లో క్రిస్ వోక్స్, మొయిన్ అలీ మ్యాచ్ ఆడతారు. ఇక ఆటగాళ్లకు తగిన విశ్రాంతి కల్పించాలనే క్రమంలో జోస్ బట్లర్ ఇంటికి వెళ్లాడు. బట్లర్ స్థానంలో బెన్ ఫోక్స్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపడతాడు' అని రూట్ చెప్పాడు.

రెండో టెస్టులో ఎలా ఆడతాడో:
తొలి టెస్టులో ఇంగ్లండ్ 227 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అది జో రూట్‌కు వందో టెస్టు. రూట్ తొలి ఇన్నింగ్స్‌లో 218, రెండో ఇన్నింగ్స్‌లో 40 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక శనివారం నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్టులో ఎలా ఆడతాడో చూడాలి. అంతకుముందు శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల్లోనూ రూట్ శతకం, ద్విశతకం చేసిన విషయం తెలిసిందే.

రెండో టెస్టుకి ఇంగ్లండ్ తుది జట్టు:
డొమినిక్ సిబ్లీ, రోరీ బర్న్స్, డేనియల్ లారెన్స్, జో రూట్ (కెప్టెన్), బెన్ స్టోక్స్, ఓలీ పోప్, బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), మొయిన్ అలీ, స్టువర్ట్ బ్రాడ్, క్రిస్ వోక్స్, జాక్ లీచ్.
రూట్ అత్యుత్తమ బ్యాట్స్‌మన్ కాదు.. ఆ ముగ్గురి తర్వాతే: గవాస్కర్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications