Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రూట్ అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ కాదు.. ఆ ముగ్గురి తర్వాతే: గవాస్కర్

Sunil Gavaskar said I dont think Joe Root is the best batsman in the world

చెన్నై: ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ జో రూట్‌ ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడని లిటిల్ మాస్టర్, టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ అన్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ, ఆసీస్ మాజీ సారథి స్టీవ్‌ స్మిత్‌, కివీస్ కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌తో పోలిస్తే మాత్రం వారి తర్వాతి స్థాయేనని సన్నీ అభిప్రాయపడ్డారు. అయితే చెపాక్‌ మైదానంలో జరిగిన తొలి టెస్టులో తొలి బంతి నుంచే అతడెంతో సానుకూలంగా ఆడాడని ప్రశంసించారు. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మార్క్‌ బుట్చేర్ ‌మాత్రం సన్నీతో కాస్త విభేదించారు. ప్రస్తుతానికి రూట్‌ అత్యుత్తమ క్రికెటరని పేర్కొన్నారు.

అద్భుత ఫామ్‌లో రూట్:

అద్భుత ఫామ్‌లో రూట్:

ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 227 పరుగుల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. తొలి టెస్టులో జో రూట్‌ ద్విశతకం సాధించాడు. అంతకుముందు శ్రీలంక సిరీసులోనూ వరుసగా శతకాలు బాదాడు. ఓ డబుల్ సెంచరీ, మరో భారీ సెంచరీ బాదాడు. రూట్ ప్రస్తుతం అద్భుత ఫామ్‌లో కొనసాగుతున్నాడు. ఉపఖండంలో ఆడేందుకు కష్టమైన స్పిన్‌లోనూ పరుగుల వరద పారిస్తున్నాడు. దాంతో అంతర్జాతీయ క్రికెట్లో ఫ్యాబ్‌ 4 (అత్యుత్తమ క్రికెటర్లు కోహ్లీ, కేన్‌, స్మిత్‌, రూట్)పై మరోసారి చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సునీల్ గవాస్కర్ స్పందించారు.

మిగతా ముగ్గురి కన్నా రూట్ కాస్త దిగువే:

మిగతా ముగ్గురి కన్నా రూట్ కాస్త దిగువే:

సునీల్ గవాస్కర్ తాజాగా స్టార్ స్పోర్ట్స్ షో 'క్రికెట్ కనెక్టెడ్'లో మాట్లాడుతూ... 'జో రూట్‌ చాలా బాగా ఆడుతున్నాడు. కానీ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ అని అనుకోను. ప్రస్తుతం దానికి నలుగురు పోటీలో ఉన్నారు. అందులో రూట్‌ ఒకడు. అయితే మిగతా ముగ్గురి (కోహ్లీ, కేన్‌, స్మిత్) కన్నా రూట్ కాస్త దిగువే అని అనుకుంటున్నా' అని అన్నారు. ప్రస్తుతం కోహ్లీ, కేన్‌, స్మిత్, రూట్ టెస్ట్ క్రికెట్లో పరుగుల వరద పారిస్తున్నారు. ముఖ్యంగా స్మిత్, కోహ్లీ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఫ్యాబ్‌ 4లో ఎవరు రాణించినా మాజీలు మిగతా ముగ్గురితో పోల్చుతూ మాట్లాడుతున్నారు.

రూట్‌ అత్యుత్తమ క్రికెటర్:

రూట్‌ అత్యుత్తమ క్రికెటర్:

'చెన్నై టెస్టులో జో రూట్‌ ద్విశతకంలో నన్ను బాగా ఆకట్టుకున్నది తొలి బంతి నుంచే ఆత్మవిశ్వాసంతో ఆడటం. క్రీజులోంచి అడుగు ముందుకేసినా.. వెనక్కి వేసినా సానుకూలంగా ఉన్నాడు' అని సునీల్ గవాస్కర్ పేర్కొన్నారు. అయితే ఇంగ్లీష్ మాజీ క్రికెటర్‌ మార్క్‌ బుట్చేర్ ‌మాత్రం సన్నీతో కాస్త విభేదించారు. ప్రస్తుతానికి రూట్‌ అత్యుత్తమ క్రికెటరని పేర్కొన్నారు. 'ఇప్పటికైతే జో రూటే అత్యుత్తమ క్రికెటర్‌. ఎందుకంటే ప్రస్తుతం మిగతా ముగ్గురూ టెస్టుల్లో ఎక్కువ పరుగులు చేయడం లేదు. మిగతా వాళ్లెవరూ లేనంత ఫామ్‌లో రూట్ ఉన్నాడు' అని అభిప్రాయపడ్డారు.

రెండు మార్పులు ఖాయం:

రెండు మార్పులు ఖాయం:

తొలి టెస్టులో ఘన విజయం సాధించిన ఇంగ్లండ్ రెండో టెస్టులోనూ అదే ఫలితం పునరావృతం చేయాలని చోస్తోంది. అయితే రెండో టెస్ట్ మ్యాచ్‌కు ఇంగ్లండ్ జట్టులో రెండు మార్పులు ఖాయం. శనివారం నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్టులో పేసర్ జోఫ్రా ఆర్చర్‌కు బదులు స్టువర్ట్‌ బ్రాడ్‌ జట్టులోకి రానున్నాడు. అలాగే విశ్రాంతి కోసం స్వదేశానికి వెళ్లిన వికెట్ కీపర్ జోస్‌ బట్లర్‌ స్థానంలో బెన్‌ ఫోక్స్‌ కీపింగ్‌ బాధ్యతలు చేపట్టనున్నాడు.

ఏం పర్లేదు.. క్రికెట్‌ ఆడేందుకు ఇప్పటికే 8 ఏళ్లు వేచిచూశా! మరిన్ని రోజులు ఎదురుచూస్తా!

Story first published: Friday, February 12, 2021, 13:52 [IST]
Other articles published on Feb 12, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+