Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCB vs SRH: ఆర్‌సీబీ కెప్టెన్‌గా జితేష్ శర్మ.. ఎందుకంటే?

ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న లీగ్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో రెగ్యులర్ కెప్టెన్ రజత్ పటిదార్‌కు బదులు జితేష్ శర్మ జట్టును నడిపిస్తున్నాడు. టాస్‌కు రజత్ పటిదార్‌కు బదులు జితేష్ శర్మ వచ్చాడు. రజత్ పటిదార్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్ మాత్రమే చేయనున్నాడని, దాంతోనే తాను జట్టును నడిపిస్తున్నానని టాస్ సందర్భంగా జితేశ్ శర్మ తెలిపాడు.

అదే మా లక్ష్యం..
పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ముందుగా బౌలింగ్ ఎంచుకున్నామని జితేష్ శర్మ తెలిపాడు. 'ఈ సీజన్‌లో మేం మెరుగైన ప్రదర్శనతో మా స్థాయిని పెంచుకున్నాం. పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో నిలవాలనుకుంటున్నాం. మా విజయాలతో మేం సంతృప్తి పడటం లేదు. టేబుల్ టాపర్‌గా ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు ఆడాలనుకుంటున్నాం. సీనియర్లు.. జూనియర్ ఆటగాళ్లకు మార్గదర్శకంగా నిలిచి జట్టులో మంచి క్రికెట్ వాతావారణాన్ని సృష్టించారు.

Jitesh Sharma Reveals Why Rajat Patidar Is Not Captaining in the RCB vs SRH Clash of IPL 2025
Photo Credit: IPL twitter (X)

ఆర్‌సీబీ ఎప్పుడూ తమ ఆటను ఆస్వాదిస్తోంది. మేం ప్రతీ మ్యాచ్ గెలవాలనుకుంటున్నాం. రజత్ పటీదార్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్ మాత్రమే చేయనున్నాడు. దేవదత్ పడిక్కల్ స్థానంలో మయాంక్ అగర్వాల్ ఆడుతున్నాడు.'అని జితేష్ శర్మ చెప్పుకొచ్చాడు. ఫిట్‌నెస్ సమస్యల నేపథ్యంలోనే రజత్ పటీదార్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడిస్తున్నట్లు అర్థమవుతోంది. ప్లే ఆఫ్స్‌కు ముంగిట రిస్క్ ఎందుకని అతన్ని బ్యాటింగ్‌కు పరిమితం చేశారని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వచ్చే సీజన్‌పై ఫోకస్ పెట్టాం..
మరోవైపు గత కొన్ని మ్యాచ్‌ల్లో తమ జట్టు మెరుగైన ప్రదర్శన చేసిందని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలిపాడు. వచ్చే సీజన్‌ కోసం జట్టును నిర్మించడంపై ఫోకస్ పెట్టామన్నాడు. 'గత కొన్ని మ్యాచ్‌ల్లో మేం బాగా ఆడాం. వచ్చే సీజన్ కోసం జట్టును నిర్మిస్తున్నాం. మేం మరింత నిలకడగా ఆడాలి. మా ఆట మా స్థాయికి తగ్గట్లు ఉండాలి. గత మ్యాచ్‌లో మా జట్టు 200 పరుగులను సునాయసంగా ఛేదించాం. అప్‌కమింగ్ టెస్ట్ సిరీస్‌ల కోసం షమీతో కలిసి నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ మ్యాచ్‌కు మేం మూడు మార్పులతో బరిలోకి దిగుతున్నాం. ట్రావిస్ హెడ్, అభినవ్ మనోహర్, జయదేవ్ ఉనాద్కత్ తిరిగిన తుది జట్టులోకి వచ్చారు.'అని ప్యాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు.

Story first published: Friday, May 23, 2025, 19:39 [IST]
Other articles published on May 23, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+