Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే సూర్యవంశీని సూపర్ ఓవర్‌లో ఆడించలేదు

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టీ20 టోర్నీలో టీమిండియా పోరాటం ముగిసింది. శుక్రవారం బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీఫైనల్లో జితేష్ శర్మ సారథ్యంలోని భారత్-ఏ సూపర్ ఓవర్‌లో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆద్యాంతం హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌.. ఆఖరికి బంగ్లాదేశ్ వశమైంది. అయితే సెమీఫైనల్లో తమ జట్టు ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని కెప్టెన్ జితేష్ శర్మ తెలిపాడు. తానే మ్యాచ్‌ను ముగించాల్సిందని అభిప్రాయపడ్డాడు. తన బ్యాటింగ్ వైఫల్యంతో పాటు తప్పుడు నిర్ణయాల కారణంగానే భారత్-ఏ ఫైనల్ చేరలేకపోయిందని అంగీకరించాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్-ఏ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 194 పరుగులు చేసింది. అనంతరం భారత్ కూడా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 194 పరుగులే చేసింది. దాంతో సూపర్ ఓవర్ ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే సూపర్ ఓవర్‌లో విధ్వంసకర బ్యాటర్, చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీని బ్యాటింగ్ పంపించకుండా జితేష్ శర్మ, రమణ్‌దీప్ సింగ్, అషుతోష్ శర్మలు బరిలోకి దిగారు.

Jitesh Sharma Reveals Why India A Didn t Send Vaibhav Suryavanshi for the Super Over vs Bangladesh A

సూపర్ ఓవర్‌లో వరుసగా రెండు బంతుల్లో జితేష్ శర్మ, అషుతోష్ శర్మలు ఔటవ్వడంతో భారత్-ఏ ఒక్క పరుగు చేయకుండానే ఆలౌటైంది. రూల్స్ ప్రకారం సూపర్ ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోతే ఆలౌటైనట్లు. అనంతరం బంగ్లాదేశ్.. తొలి బంతికే వికెట్ కోల్పోగా.. రెండో బంతిని సుయాష్ శర్మ వైడ్ వేయడంతో విజయం లాంఛనమైంది.

ఈ టోర్నీలో అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చిన వైభవ్ సూర్యవంశీ, ప్రియాన్ష్ ఆర్యలను సూపర్ ఓవర్‌లో ఆడించకపోవడంపై విమర్శలు వచ్చాయి. ఈ ఇద్దర్నీ ఆడించి ఉంటే భారత్ గెలిచేదనే అభిప్రాయం వ్యక్తమైంది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన జితేష్ శర్మ.. వైభవ్ సూర్యవంశీని సూపర్ ఓవర్‌లో ఆడించకపోవడం వెనుక ఉన్న కారణాన్ని వెల్లడించాడు. ఈ ఓటమికి తనదే పూర్తి బాధ్యత అని కూడా చెప్పాడు.

'మా జట్టులో వైభవ్ సూర్యవంశీ, ప్రియాన్ష్ ఆర్య పవర్ ప్లే ఆడటంలో మాస్టర్లు. డెత్ ఓవర్లలో నాతో పాటు అషుతోష్ శర్మ, రమణ్‌దీప్‌లు భారీ షాట్లు ఆడగలరు. ఈ క్రమంలోనే సూపర్ ఓవర్ లైనప్‌ను జట్టుగా నిర్ణయించాం. కానీ ఎవర్నీ ఆడించాలనే తుది నిర్ణయం మాత్రం నేను తీసుకున్నా.

ఇదో అద్భుతమైన క్రికెట్ మ్యాచ్‌. ఈ ఓటమితో ఎంతో విలువైన పాఠాన్ని నేర్చుకున్నాం. ఈ ఓటమికి పూర్తి బాధ్యత నాదే. జట్టులో సీనియర్ ఆటగాడిగా నేను ఈ మ్యాచ్‌ను ముగించాల్సింది. ఈ టోర్నీలో ఎన్నో విషయాలను నేర్చుకున్నాం. ఈ కుర్రాళ్లు ఏదో ఒక రోజు భారత్‌కు ప్రపంచకప్ అందిస్తారు. ప్రతిభ విషయంలో మా కుర్రాళ్లు ఆకాశాన్ని తాకుతున్నారు. ఈ టోర్నీ వారికి నేర్చుకోవడానికి, అనుభవాన్ని గడించడానికి ఉపయోగపడింది.'అని జితేష్ శర్మ చెప్పుకొచ్చాడు.

Story first published: Saturday, November 22, 2025, 10:57 [IST]
Other articles published on Nov 22, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+