Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs PAK: చరిత్ర సృష్టించిన జియో హాట్‌స్టార్‌.. 61 కోట్ల వ్యూస్‌తో ఆల్‌టైమ్ రికార్డ్!

ప్రముఖ ఓటీటీ యాప్ జియోహాట్ స్టార్ సరికొత్త చరిత్రను లిఖించింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి అధికారిక ఓటీటీ బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరిస్తున్న జియో హాట్‌స్టార్ భారత్-పాకిస్థాన్ హైఓల్టేజ్ మ్యాచ్ సందర్భంగా అత్యధిక కంకరెంట్ వ్యూస్‌ను నమోదు చేసింది. విరాట్ కోహ్లీ సంచలన బ్యాటింగ్‌తో ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించడంతో జియోహాట్ స్టార్ పంట పండింది. ఈ మ్యాచ్‌లో గరిష్టంగా 61 కోట్ల కంకరెంట్ వ్యూస్ నమోదయ్యాయి. క్రికెట్ చరిత్రలోనే ఇది ఆల్‌టైల్ రికార్డ్. కోహ్లీ సెంచరీతో ఈ మ్యాచ్‌లో భారత్ విజయలాంఛనం పూర్తి చేసుకోవడం బ్రాడ్‌కాస్టర్స్‌కు కలిసొచ్చింది.

ఆల్‌టైమ్ రికార్డ్..
కంకరెంట్ వ్యూస్ అంటే ఒకే సమయంలో వచ్చే వ్యూస్ సంఖ్య. సింపుల్‌గా చెప్పాలంటే రియల్‌టైమ్ యూజర్ల సంఖ్య. భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ను ఏకకాలంలో 61 కోట్ల మంది జియో హాట్ స్టార్ యాప్ వేదికగా వీక్షించారు. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ముందుగా బ్యాటింగ్ చేయగా.. హాట్‌స్టార్ వ్యూస్ 10 కోట్లు ఉంది. పాక్ ఇన్నింగ్స్ చివర్లో ఈ సంఖ్య 40 కోట్లకు చేరగా.. భారత్ బ్యాటింగ్ సందర్భంగా 55 కోట్లకు చేరింది. విరాట్ కోహ్లీ శతకం సమయంలో 61 కోట్లకు పెరిగింది. ఇది ఓటీటీ యాప్ చరిత్రలోనే ఆల్‌టైమ్ రికార్డ్. ఇదే టోర్నీలో భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో గరిష్టంగా 35 కోట్ల వ్యూస్ వచ్చాయి. తాజాగా భారత్-పాక్ మ్యాచ్ ఆ రికార్డ్‌ను తిరగరాసింది.

JioHotstar creates history with 61 crore concurrent viewers during IND vs PAK Champions Trophy 2025 clash

కలిసిపోవడంతోనే..
గతంలో హాట్ స్టార్, జియో సినిమా వేర్వేరుగా ఉండేవి. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందే రెండు కలిసిపోయి జియో హాట్ స్టార్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ వేర్వేరుగా ఉన్నప్పుడు గరిష్టంగా ఈ సంఖ్య 5 కోట్లు దాట లేదు. జియో సినిమా యాప్‌లో మొత్తం వ్యూస్‌ను డిస్‌ప్లే చేసేవారు. కానీ హాట్‌స్టార్‌లా కంకరెంట్ వ్యూస్ ఇచ్చే వారు కాదు. టీ20 ప్రపంచకప్ ఫైనల్లో హాట్‌ స్టార్‌లో 4 కోట్లకు పైగా కంకరెంట్ వ్యూస్ వచ్చాయి. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందే ఇదే అత్యధికం.

ఇప్పుడు జియో హాట్‌స్టార్‌గా రెండు కలిసిపోవడం.. ఉచితంగా మ్యాచ్‌లు ప్రసారం చేస్తుండటంతో ఈ సంఖ్య 12 రెట్లు పెరిగింది. శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, మాల్దీవుల దేశాల్లోనూ జియోహాట్‌స్టారే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. ఇది కూడా ఈ రికార్డ్ సాధించడానికి కారణమైంది. అయితే ఇవి అసలు కంకరెంట్ వ్యూస్ కాదని కొందరు వాదిస్తున్నారు.

హాట్‌స్టార్‌ను దెబ్బతీసిన జియోసినిమా
హాట్‌స్టార్, స్టార్ స్పోర్ట్స్‌ను దెబ్బ కొట్టడానికి రిలయన్స్ సంస్థ.. ఐపీఎల్ హక్కులతో పాటు బీసీసీఐ మ్యాచ్‌ల ప్రసారాలను దక్కించుకొని జియో సినిమాలో ఫ్రీగా ప్రసారం చేసింది. ఆ పోటీని తట్టుకోవడానికి హాట్‌స్టార్ కూడా క్రికెట్ మ్యాచ్‌లను ఫ్రీగా ఇవ్వక తప్పలేదు. దాంతో తీవ్రంగా నష్టపోయిన డిస్నీ హాట్‌స్టార్‌ తమ వాటాను రిలయన్స్ సంస్థకు అమ్ముకుంది. .

ఓటీటీ రంగంలో శత్రువులుగా ఉంటే నష్టాలు తప్పవని భావించి ఈ రెండు సంస్థలు ఒక్కటై పక్కా ప్లానింగ్‌తో జియో హాట్‌స్టార్‌గా బరిలోకి దిగాయి. ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లను ఫ్రీగా ప్రసారం చేస్తున్నప్పటికీ.. ఐపీఎల్ మ్యాచ్‌లకు డబ్బులు కట్టాల్సింది. కనీసం రూ. 149తో సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్‌ను తీసుకొచ్చింది. జియో మొబైల్ యూజర్లకు కొన్ని ప్రత్యేకమైన రిచార్జ్ ప్లాన్స్‌ తీసుకొచ్చి ఫ్రీగా జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఇస్తోంది.

Story first published: Monday, February 24, 2025, 7:31 [IST]
Other articles published on Feb 24, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+