బ్యాటింగ్‌లో నన్ను ముందు పంపించండి.. కింగ్స్ పంజాబ్‌కు జిమ్మీ నీషమ్ రిక్వెస్ట్!

దుబాయ్: న్యూజిలాండ్ క్రికెటర్ జిమ్మీ నీషమ్ సోషల్ మీడియా వేదికగా ఎంత యాక్టివ్‌గా ఉంటాడో తెలిసింది. సరదా పోస్టులు, తనదైన వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ నవ్వులు పూయిస్తుంటాడు. ఐపీఎల్ 2020లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు ఆడుతున్న జిమ్మీ నీషమ్ ఫ్రాంచైజీ ట్విటర్ హ్యాండిల్‌కు తన మనసులోని కోరికను తెలియజేశాడు.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు( ఆర్‌సీబీ)తో జరిగిన మ్యాచ్‌లో ఆడిన జిమ్మీ నీషమ్‌కు కెప్టెన్ కేఎల్ రాహుల్ సెంచరీ పుణ్యమా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఇక బౌలింగ్‌లో కూడా రెండు ఓవర్లు మాత్రమే వేసే అవకాశం వచ్చింది. తన కట్టుదిట్టమైన బంతులతో ప్రత్యర్థిని కట్టడి చేసిన జిమ్మీ.. 13 పరుగులే ఇచ్చి ఒక్క వికెట్ తీయలేదు. విజయంలో తన పాత్ర లేకపోవడంతో ఫీలయ్యాడు.
తాజాగా కింగ్స్ పంజాబ్ తమ ఆటగాళ్లకు సంబంధించిన ఫొటోను షేర్ చేసింది. ఇందులో జిమ్మీ నీషమ్, మ్యాక్స్‌వెల్ పగలబడి నవ్వుతున్నారు. వీరిలా మిమ్మల్ని నవ్వించే వారెవరున్నారో కనుక్కోండని కింగ్స్ పంజాబ్ ఈ ఫొటోకు క్యాప్షన్‌గా పెరుగుతుంది. దీన్ని రీట్వీట్ చేసిన జమ్మి తనదైన శైలిలో.. 'నేను ఎక్కువగా బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాను. నన్ను ముందు పంపించండి'అని కామెంట్ చేశాడు.
దీనికి ఫన్నీగా స్పందించిన కింగ్స్ పంజాబ్ ఈ ట్వీట్‌కు 1000 రీట్వీట్స్ వస్తే.. నెట్స్‌లో ముందు బ్యాటింగ్ చేయిస్తామని హామీ ఇచ్చింది. ఈ ఫన్నీ ట్వీట్స్ ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఇక జిమ్మీని నమ్ముకొని డ్రీమ్ ఎలెవన్‌లో డబ్బులో పొగొట్టుకున్నానని ఓ అభిమాని చేయగా.. నాకు అవసం లేదని జిమ్మీ రిప్లే ఇచ్చాడు. ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 97 పరుగులతో ఘన విజయాన్నందుకున్న విషయం తెలిసిందే. తదుపరి మ్యాచ్ షార్జా వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో ఆడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications