పాక్ క్రికెటర్‌ను హగ్ చేసుకున్న భారత క్రికెటర్.. నెటిజన్లు ఫైర్!(వీడియో)
భారత మహిళా క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్‌పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్థాన్ ఆల్‌రౌండర్ ఫాతిమా సనాను జెమీమా రోడ్రిగ్స్ హగ్ చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. జెమీమా రోడ్రిగ్స్ దేశ ద్రోహి అంటూ భారత నెటిజన్లు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.
గతేడాది చోటు చేసుకున్న పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ ఘటనలతో భారత్, పాక్ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా.. పాక్ ఆటగాళ్లతో కనీసం కరాచాలనం చేయడానికి కూడా భారత ఆటగాళ్లు నిరాకరించారు. పురుషుల ఆసియా కప్ 2025 నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. క్రికెట్‌లోనే కాకుండా ఇతర క్రీడల్లో కూడా ఈ సంప్రదాయాన్ని భారత ఆటగాళ్లు కొనసాగించారు.

జెమీమా దేశద్రోహి..
భారత మహిళల జట్టు కూడా వన్డే ప్రపంచకప్, టీ20 ప్రపంచకప్ సందర్భంగా పాక్ మహిళా ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. కానీ ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ది హండ్రెడ్ లీగ్ టోర్నీలో జెమీమా సౌతెర్న్ బ్రేవ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తుండగా.. ఫాతిమా బర్మింగ్ హామ్ ఫీనిక్స్ తరఫున ఆడుతోంది. గత గురువారం ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరగ్గా.. మ్యాచ్ అనంతరం జెమీమా, ఫాతిమా షేక్యా హ్యాండ్ ఇచ్చుకోవడంతో పాటు ఆలింగనం చేసుకోవడం వివాదాస్పదమైంది.
జెమీమా దేశ ద్రోహి అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. భారత సైనికులు, జనాల ప్రాణాలు తీసిన పాక్ ఆటగాళ్లతో స్నేహం ఏంటని మండిపడుతున్నారు. జెమీమాపై నిషేధం విధించాలని బీసీసీఐని కోరుతున్నారు. మహిళల వన్డే ప్రపంచకప్ 2025 సందర్భంగా కూడా జెమీమా తీవ్ర ట్రోలింగ్‌కు గురైంది. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై అద్భుత శతకంతో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన జెమీమా.. ఆ ఏసు దయవల్లే ఇది సాధ్యమైందని చెప్పడం అప్పట్లో తీవ్ర వివాదాస్పదమైంది. కొందరు నెటిజన్లు జెమీమాపై జుగుప్సాకరంగా ట్రోలింగ్ చేశారు.
జెమీమా టీమ్ విజయం..
హండ్రెడ్ లీగ్ మ్యాచ్ విషయానికొస్తే.. జెమీమా ప్రాతినిధ్యం వహిస్తున్న సౌత్రన్ బ్రేవ్ జట్టు 24 పరుగుల తేడాతో ఫాతిమా ఫీనిక్స్ జట్టును ఓడించింది. ఈ మ్యాచ్‌లో జెమీమా కేవలం 18 బంతుల్లో 28 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. మరోవైపు ఫాతిమా సనా బౌలింగ్‌లో 15 బంతుల్లో 33 పరుగులు ఇచ్చి నిరాశపరిచింది.
తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్రన్ బ్రేవ్ జట్టు.. లిజెల్ లీ (43), మైయా బౌచియర్ (45) రాణించడంతో నిర్ణీత 100 బంతుల్లో 3 వికెట్లకు 140 పరుగులు చేసింది. చివర్లో జెమీమా మెరుపు ఇన్నింగ్స్ జట్టుకు భారీ స్కోరు అందించింది. అనంతరం ఛేదనకు దిగిన ఫీనిక్స్ జట్టు టామీ బ్యూమాంట్ (22), డవినా పెర్రిన్ (43 బంతుల్లో 52) శుభారంభం అందించినా, వారిద్దరూ ఔటయ్యాక మ్యాచ్ మలుపు తిరిగింది. చివరికి ఫీనిక్స్ జట్టు 5 వికెట్ల నష్టానికి 116 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలయ్యారు. ఎల్లీస్ పెర్రీ (16 నాటౌట్), ఫాతిమా సనా (5 నాటౌట్) అజేయంగా నిలిచారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

