Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఔటైన బ్యాటర్‌ను వెనక్కి పిలిపించడం దారుణం: టీమిండియా క్రికెటర్

మహిళల టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియాకు తొలి మ్యాచ్‌లోనే ఘోర పరాజయం ఎదురైంది. న్యూజిలాండ్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా.. 58 పరుగుల తేడాతో చిత్తయ్యింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 161 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా చేధించలేకపోయింది.

అనూహ్యంగా 102 పరుగులకే కుప్పకూలి ఘోర పరాభావాన్ని మూటగట్టుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ బ్యాటర్ అమేలియా కేర్ రనౌట్ తీవ్ర వివాదాస్పదమైంది. అంపైర్లపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివాదాస్పద రనౌట్‌పై భారత మహిళా క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ ఘాటుగా స్పందించింది.

Jemimah Rodrigues says India respect umpire s decision but it was harsh on controversial run-out

అత్యంత దారుణం..
మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె.. ఔటైన బ్యాటర్‌ను వెనక్కిపిలవడం అత్యంత దారుణమని తెలిపింది. 'ఓవర్ ముగిసిందంటూ దీప్తికి అంపైర్ క్యాప్ ఇవ్వడం నేను చూడలేదు. ఆ సమయంలో నేను దూరంగా ఫీల్డింగ్ చేస్తున్నాను. న్యూజిలాండ్ బ్యాటర్లు రెండో పరుగు కోసం ప్రయత్నించారు.

అమేలియా కేర్ ఓవర్ పూర్తి కాలేదనే ఉద్దేశంతోనే డబుల్ తీయడానికి ప్రయత్నించింది. మేం కూడా అదే ఆలోచనలో ఉండి రనౌట్ చేశాం. కానీ అంపైర్ మాత్రం విభిన్నమైన నిర్ణయం తీసుకున్నారు. అంపైర్ల నిర్ణయం మా చేతుల్లో లేని వ్యవహారం.

ప్లేయర్లుగా వారి నిర్ణయాన్ని గౌరవిస్తాం. కానీ, అమేలియా కేర్‌ తనకు తానే డగౌట్‌గా వెళ్లే సమయంలో ఆపి మరీ బ్యాటింగ్ చేయించడం మాత్రం దారుణం. ఔటైన్లు ఆమెకు తెలుసు కాబట్టే పెవిలియన్ బాట పట్టింది.'అని జెమీమా వెల్లడించింది.

అసలేం జరిగందంటే..?
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ సందర్భంగా అమేలియా కేర్ రనౌట్ అయినా అంపైర్లు నాటౌట్‌గా ప్రకటించారు. దీప్తి శర్మ వేసిన 14 ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ చివరి బంతిని ఎక్స్‌ట్రా కవర్స్‌ వైపు పంపిన అమేలియా కేర్ ఒక పరుగు తీసింది. ఇదే సమయంలో స్క్వేర్ లెగ్ అంపైర్ ఓవర్ పూర్తయిందనే ఉద్దేశంతో షూ లేస్ కట్టుకుంటూ కనిపించింది. అయితే బ్యాటర్లు అమేలియా, సోఫీ రెండో పరుగు కోసం ప్రయత్నించారు.

బంతిని అందుకున్న హర్మన్ ప్రీత్ కౌర్ వేగంగా వికెట్ కీపర్ రిచా ఘోష్‌కు అందించగా.. ఆమె ఏ తప్పిదం చేయకుండా రనౌట్ చేసింది. అమేలియా కూడా ఔటన్న ఉద్దేశంతో పెవిలియన్ వైపు కదిలింది. కానీ అంపైర్ బంతి అప్పటికే డెట్ అయినట్లు ప్రకటించి ఆమెను వెనక్కి పిలిచింది. తాను ఓవర్ పూర్తయిందని చెప్పానని, ఆ తర్వాత పరుగు తీసినా.. వికెట్ తీసినా లెక్కలోని రాదని వివరించింది. ఈ విషయంపై భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అంపైర్‌తో వాదించినా ఫలితం లేకపోయింది. అయితే మరుసటి ఓవర్‌లోనే అమేలియా ఔటైంది.

Story first published: Saturday, October 5, 2024, 8:34 [IST]
Other articles published on Oct 5, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+