Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

స్టేడియంలో అభిమానిపై క్రికెటర్ దాడి(వీడియో)

జమ్మూ కశ్మీర్ క్రికెటర్ జహంగీర్ లోనె స్టేడియంలో ఓ ప్రేక్షకుడిపై దాడి చేయడం కలకలం రేపింది. శ్రీనగర్‌ వేదికగా జరిగిన రెడీ ప్రీమియర్ లీగ్‌‌లో భాగంగా రాయల్ గుడ్‌విల్‌ సీసీ, అథ్వాస్ ఇండియా ఎలెవన్ సెమీస్ మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ టోర్నీలో జహంగీర్ లోనె రాయల్ గుడ్‌విల్ సీసీ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. అయితే ఈ మ్యాచ్‌లో అథ్వాస్ ఇండియా ఎలెవన్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం ఏమైందో ఏమో తెలియదు కానీ.. తీవ్ర ఆగ్రహానికి గురైన జహంగీర్ ఓ ప్రేక్షకుడిపై దాడి చేశాడు. కోపంతో ఊగిపోయిన జహంగీర్.. సదరు ప్రేక్షకుడిని కాలితో తన్నుతూ.. తీవ్రంగా కొట్టాడు. మైదానంలో ఉన్న ఇతర ఆటగాళ్లు, నిర్వాహకులు వచ్చి అతన్ని అడుకునే ప్రయత్నం చేశారు.

Jehangir Lone Incident Viral Red Premier League Video Raises Questions About Cricket Culture in Kashmir

ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ కాగా.. జహంగీర్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రొఫెషనల్ క్రికెటర్ అయిన జహంగీర్ మైదానంలో ఇలాంటి హింసాత్మక ప్రవర్తనకు దిగడం ఏంటని అభిమానులు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని జమ్మూకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్‌ను కోరుతున్నారు.

మరోవైపు తన తల్లిని దూషించడంతోనే ప్రేక్షకుడిని కొట్టినట్లు జహంగీర్ చెప్పాడు. దేశవాళీ క్రికెట్‌లో జమ్మూకశ్మీర్‌కు జహంగీర్ ప్రాతిథ్యం వహిస్తున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో పాటు విజయ్ హజారే ట్రోఫీ ఆడాడు. ఆల్‌రౌండర్ అయిన జహంగీర్ లోనె.. జమ్మూ కశ్మీర్ తరఫున 4 టీ20లు ఆడి 35 పరుగులతో పాటు 2 వికెట్లు పడగొట్టాడు. 2015లోనే అతను చివరి మ్యాచ్ ఆడాడు.

Story first published: Tuesday, October 20, 2026, 14:20 [IST]
Other articles published on Oct 20, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+