7 వికెట్లతో చెలరేగిన ఉనాద్కాట్.. వరుసగా రెండోసారి ఫైనల్ చేరిన సౌరాష్ట్ర

రాజ్‌కోట్: ప్రతిష్టాత్మక రంజీట్రోఫీలో సౌరాష్ట్ర వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరింది. గుజరాత్‌తో బుధవారం ముగిసిన సెమీఫైనల్ మ్యాచ్‌లో సౌరాష్ట్ర 92 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ జట్టు కెప్టెన్ జయదేవ్ ఉనాద్కాట్ ఏడు వికెట్లతో ప్రత్యర్థి పతనాన్ని శాసించి అద్భుత విజయాన్నందించాడు. ఇక గత 8 ఏళ్లలో సౌరాష్ట్రకు ఇది నాలుగో ఫైనల్. ఇక టైటిల్ ఫైట్‌లో బెంగాల్‌తో సౌరాష్ట్ర తలపడనుంది.
సౌరాష్ట్ర నిర్ధేశించిన 327 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన గుజరాత్ ఉనాద్కాట్ (7/56) ధాటికి 234 పరుగులకే కుప్పకూలి ఓటమిపాలైంది. సౌరాష్ట్ర బౌలర్లలో ఉనాద్కాట్‌తో పాటు ధర్మేంద్రసిన్హ్ జడేజా, చిరాగ్ జాని, ప్రేరక్ మన్కడ్ తలో వికెట్ తీశారు.

పోరాడిన పార్దీవ్- చిరాగ్..
7/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో చివరి రోజు ఆటను ప్రారంభించిన గుజరాత్‌ను పార్దీవ్ పటేల్(93),చిరాగ్ గాంధీ(96) గట్టెక్కించే ప్రయత్నం చేశారు. టాపార్డంతా విఫలమై 63 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును 158 పరుగుల భాగస్వామ్యంతో విజయం వైపు నడిపించారు. సెంచరీకి సమీపించిన ఈ ఇద్దరిని ఉనాద్కాట్ పెవిలియన్ చేర్చాడు. దీంతో గుజరాత్ పోరాటం ముగిసింది.

ఉనాద్కాట్ అరుదైన ఘనత..
ఏడు వికెట్లతో ఉనాద్కాట్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇది అతనికి 20వ ఐదో వికెట్ హాల్. అలాగే ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో (3/86) మూడు వికెట్లతో కలుపుకొని మొత్తం 10 వికెట్లు పడగొట్టిన ఘనతను అందుకున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు మొత్తం 65 వికెట్లు పడగొట్టిన ఉనాద్కాట్... ఓ రంజీ సీజన్‌లో అత్యధిక వికెట్ల పడగొట్టిన తొలి పేసర్‌గా రికార్డుకెక్కాడు. అలాగే ఈ జాబితాలో బిషన్ సింగ్ బేడీ(64)ని వెనక్కు నెట్టి ఓవరాల్‌గా రెండో స్థానంలో నిలిచాడు.

52 పరుగుల ఆధిక్యం..
ఇక తొలి ఇన్నింగ్స్‌లో జాక్సన్ (103) సెంచరీతో 304 పరుగులకు ఆలౌటైన సౌరాష్ట్ర.. గుజరాత్‌ను ఫస్ట్ ఇన్సింగ్స్‌లో 252 పరుగులకే పరిమితం చేసి 52 పరుగుల ఆధిక్యాన్ని అందుకుంది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో అర్పిత్ (139) సెంచరీతో 274 పరుగులు చేసి.. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలుపుకొని 327 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications