Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియాలోకి సచిన్ రీఎంట్రీ.. కీలక పదవి చేపట్టనున్న మాస్టర్!

Jay Shah trying to convince Sachin Tendulkar to take up a role in BCCI
Sachin Tendulkar Re Entry In Team India

న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ.. తన టీమ్‌మేట్స్‌ ఒక్కొక్కరికి కీలక బాధ్యతలు అప్పగిస్తున్నాడు. ఇప్పటికే హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌ను నియమించిన దాదా.. నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ) డైరెక్టర్‌ బాధ్యతలను హైదరాబాద్ సొగసరి బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్‌కు అప్పగించాడు. ఇప్పుడు క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ను తీసుకొచ్చే పనిలో పడ్డాడు. ఇప్పటికే సచిన్ రాకపై ఓ ఇంటర్వ్యూలో హింట్ ఇచ్చిన దాదా.. ఆ దిశగా కార్యచరణను కూడా ప్రారంభించాడు.

సచిన్‌కు కీలక పదవి..

సచిన్‌కు కీలక పదవి..

భారత క్రికెట్‌ బోర్డులో కీలక పదవి సచిన్‌కు అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీసీసీఐ సెక్రటరీ జై షా ఈ పనిని పూర్తి చేయడంపై దృష్టిసారించాడు. సమీప భవిష్యతుల్లో భారత క్రికెట్‌కు సచిన్ సేవలను వాడుకోవాలని భారత క్రికెట్ బోర్డు భావిస్తోంది. ఈ క్రమంలోనే జై షా.. ఈ విషయంపై సచిన్‌తో సంప్రదింపులు కూడా జరిపినట్లు తెలుస్తోంది. రెండు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్ కలిగిన సచిన్.. మూడు ఫార్మాట్లలో కలిపి 3400 రన్స్ చేశాడు.

16 ఏళ్ల ప్రాయంలోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి తనదైన బ్యాటింగ్‌తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. అత్య‌ధిక మ్యాచ్‌లు, ప‌రుగులు, సెంచ‌రీలు, హాఫ్ సెంచ‌రీలు, బౌండ‌రీలు.. ఇలా ఎన్నో మైలారాళ్లను మాస్టర్ అందుకున్నాడు. అలాంటి సచిన్ సేవలను భారత జట్టుకు వాడుకోవాలని బోర్డు భావిస్తున్న క్రమంలోనే జైషా ప్రయత్నాలు ముమ్మరం చేశాడు.

ద్రవిడ్ తరహాలోనే..

ద్రవిడ్ తరహాలోనే..

టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం జై షా.. ఇప్పటికే ఈ విషయంపై సచిన్ టెండూల్కర్‌తో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే సమీప భవిష్యత్తులో సచిన్ బోర్డులో కీలక పదవి చేపట్టనున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ వర్గాలు కూడా తెలిపాయి. రాహుల్ ద్రవిడ్ సైతం హెడ్ కోచ్‌గా బాధ్యతలను స్వీకరించేందుకు నిరాకరించగా.. జైషానే అతన్ని కన్విన్స్ చేసి ఒప్పించాడు. వీవీఎస్ లక్ష్మణ్ కూడా ఎన్‌సీఏ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించేందుకు అయిష్టత కనబర్చగా.. జైషానే కన్విన్స్ చేశాడు. ఇప్పుడు సచిన్‌ను కూడా అలానే ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి.

త్వరలోనే బీసీసీఐలోకి సచిన్..

త్వరలోనే బీసీసీఐలోకి సచిన్..

‘జైషా సచిన్‌ను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. రాహుల్ ద్రవిడ్ కూడా హెడ్ కోచ్‌‌గా బాధ్యతలు చేపట్టేందుకు నిరాకరిస్తే షానే కన్విన్ చేశాడు. వీవీఎస్ లక్ష్మణ్‌ను కూడా అతనే ఒప్పించాడు. ఇప్పడు సచిన్‌ను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. అంతా అనుకున్నట్లు జరిగితే సచిన్ టెండూల్కర్ కీలక పదవి చేపడుతాడు'అని ఓ బీసీసీఐ అధికారి తెలిపాడు.

2013లో క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికిన స‌చిన్ టెండూల్క‌ర్ ఆట‌కు దూరంగానే ఉంటున్నాడు. రిటైర్ అయిన ఆట‌గాళ్లు అంతా ప‌లు జ‌ట్ల‌తో కోచింగ్ బృందంలో లేదా కామెంటేట‌ర్‌గా విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. అయితే స‌చిన్ మాత్రం అలాంటివేం చేయడం లేదు. త‌న‌కు న‌చ్చిన విధంగా లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూ గ‌డిపేస్తున్నాడు. ఐపీఎల్‌లోని ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టుకు మెంటార్‌గా ఉన్న‌ప్ప‌టికీ పూర్తి స్థాయిలో బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డం లేదు.

Story first published: Tuesday, January 11, 2022, 18:56 [IST]
Other articles published on Jan 11, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+