అప్‌కమింగ్ టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా కెప్టెన్ ఎవరా? అనే సందేహాలకు బీసీసీఐ సెక్రటరీ జై షా క్లారిటీ ఇచ్చాడు. ఈ మెగా టోర్నీలో టీమిండియా రోహిత్ శర్మ సారథ్యంలోని బరిలోకి దిగుతుందని స్పష్టం చేశాడు. గతేడాది వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో భారత సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్‌లు టీ20 మ్యాచ్‌లు ఆడని విషయం తెలిసిందే.
వన్డే ఫార్మాట్‌పై పూర్తి ఫోకస్ పెట్టగా.. హార్దిక్ పాండ్యా సారథ్యంలో కుర్రాళ్లతో కూడిన జట్టు టీ20 సిరీస్‌లు ఆడింది. టీ20 ప్రపంచకప్ 2024 కోసమే హార్దిక్ సారథ్యంలో జట్టును తయారు చేస్తున్నామని కూడా అప్పట్లో బీసీసీఐ సంకేతాలు ఇచ్చింది. వన్డే ప్రపంచకప్‌లో అసాధారణ ప్రదర్శన కనబర్చిన టీమిండియా కీలక ఫైనల్లో విఫలమై టైటిల్‌ను చేజార్చుకుంది.

టీ20 ప్రపంచకప్ 2024 అమెరికా, వెస్టిండీస్ వేదికగా జూన్ 1 నుంచి ప్రారంభం కానుంది. అయితే పొట్టి ప్రపంచకప్‌లో సీనియర్ ఆటగాళ్లను కూడా భాగం చేస్తున్న బీసీసీఐ పరోక్ష సూచనలు ఇచ్చింది. అఫ్గానిస్థాన్‌తో గత నెలలో జరిగిన మూడు టీ20ల సిరీస్‌కు కోహ్లీ, రోహిత్‌ను ఎంపిక చేసింది. మరోవైపు ముంబై ఇండియన్స్.. గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను క్యాష్ ట్రేడ్ డీల్ ద్వారా జట్టులోకి తెచ్చుకుంది.
ఆ వెంటనే అతన్ని కెప్టెన్‌గా ప్రకటించింది. దాంతో రోహిత్ శర్మ ఫ్యాన్స్ ముంబైపై ఆగ్రహంగా ఉన్నారు. ఈ క్రమంలోనే టీ20 ప్రపంచకప్ 2024లో ఎవరు సారథ్యం వహిస్తారు? అనేది క్వశ్చన్‌గా మారింది. సీనియర్ రోహిత్ శర్మకే సారథ్య బాధ్యతలు అప్పగిస్తారా? లేక హార్దిక్ ఇస్తారా? అనేది చర్చనీయాంశమైంది.
భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మూడో టెస్ట్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న రాజ్ కోట్ మైదానం పేరును నీరంజన్ షా స్టేడియంగా పేరు మార్చారు. బుధవారం ఈ కార్యక్రమం జరగగా ముఖ్య అతిథిగా పాల్గొన్న జై షా.. ఈ సందర్భంగా రోహిత్ శర్మ సారథ్యంలోనే టీమిండియా టీ20 ప్రపంచకప్ 2024 ఆడుతుందని స్పష్టం చేశాడు.
'2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో మేం ఓడిపోవచ్చు. కానీ టోర్నీలో వరుసగా 10 విజయాలు సాధించి ప్రజల హృదయాలను గెలిచాం. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్ గెలుస్తుందనే నమ్మకం నాకు ఉంది.'అని జై షా తెలిపాడు. ఈ కార్యక్రమానికి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తదితరులు హాజరయ్యారు.