BCCI అధ్యక్షుడిగా అమిత్ షా కొడుకు.. సౌరవ్ గంగూలీకి అత్యున్నత పదవి!

న్యూఢిల్లీ: భారత క్రికెట్ మండలి(బీసీసీఐ) అధ్యక్ష పదవిని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తనయుడు, ప్రస్తుత సెక్రటరీ జై షా స్వీకరించనున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బీసీసీఐ రాజ్యంగ సవరణకు దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం అనుమతి ఇవ్వడంతో జై షా, గంగూలీలు తమ పదవుల్లో కొనసాగేందుకు మార్గం సుగుమమైంది. రాష్ట్ర సంఘం, బీసీసీఐలో ఆరేళ్ల చొప్పున ఓ ఆఫీస్ బేరర్ నిరంతరాయంగా 12 ఏళ్లు పదవిలో కొనసాగవచ్చని, ఆ తర్వాతే కూలింగ్ ఆఫ్ పీరియడ్ నిబంధన వర్తిస్తుందని జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ హిమ కోహ్లీలతో కూడిన ధర్మాసనం బుధవారం తీర్పు ఇచ్చింది.

జై షాకే బీసీసీఐ సింహాసనం..
దాంతో జై షా, గంగూలీ తిరిగి ఎన్నికల్లో పోటీపడి 2025 వరకు పాలకులుగా ఉండేందుకు వారు అర్హత సాధించారు. ప్రస్తుతం ఉన్న పాలకమండలి పదవీకాలం ఈ అక్టోబర్‌తో ముగియనుంది. అక్టోబర్ తర్వాత బీసీసీఐలో మళ్లీ ఎన్నికలు నిర్వహించి జై షా ను అధ్యక్షుడిగా ఎన్నుకునేందుకు రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌లు కూడా జై షా అధ్యక్షున్నిచేసేందుకు సిద్ధమైనట్టు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తమ కథనంలో పేర్కొంది. జై షాను బీసీసీఐ అధ్యక్షుడిని చేసేందుకు సుమారు 15 రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్‌లు మద్దతుగా నిలుస్తున్నాయని తెలిపింది.

రాష్ట్రాల అసోసియేషన్లన్నీ..
ఇదే విషయంపై ఓ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన ఆఫిస్ బేరర్ క్లారిటీ ఇచ్చాడు.'జై షా భారత అత్యున్నత క్రీడా బోర్డుకు అధ్యక్షుడిగా పదవి చేపట్టేందుకు అతడు సిద్ధంగా ఉన్నాడు. అన్ని క్రికెట్ అసోసియేషన్లు అతడికే మద్దతుగా ఉన్నాయి..' అని తెలిపాడు. గంగూలీ, జై షాలు 2019 అక్టోబర్ నుంచి వాళ్ల పదవుల్లో కొనసాగుతున్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఐపీఎల్ 2020, 2021 సీజన్లతో పాటు టీ20 ప్రపంచకప్‌ను విజయవంతంగా నిర్వహించారు.

జై షాదే కీలక పాత్రం..
అంతేకాకుండా ఐపీఎల్ మీడియా హక్కుల వేలంతో బోర్డుకు భారీ ఆదాయాన్ని అందించడంలో జై షా కీలకంగా వ్యవహరించారని బోర్డు వర్గాల్లో చర్చ జరుగుతున్నది. దీంతో తదుపరి అధ్యక్షుడిగా గంగూలీని కాకుండా జై షాను ఎంపిక చేస్తే మంచిదనే అభిప్రాయంతో బోర్డు సభ్యులున్నట్టు తెలుస్తోంది. ఇక జై షాకు మార్గం సుగుమం చేసేందుకు సౌరవ్ గంగూలీని ఐసీసీకి పంపించే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. వచ్చే అక్టోబర్‌లోనే ఐసీసీ అధ్యక్షుడు గ్రెగ్ బార్క్లీ తన పదవి నుంచి తప్పుకోనున్నాడు. దీంతో గంగూలీని ఐసీసీ అధ్యక్ష పదవి మీద కూర్చోబెట్టి జై షాను బీసీసీఐ సింహాసనం అప్పగించే ప్రయత్నాలు జరగుతున్నట్లు బోర్డు వర్గాలు పేర్కొన్నాయి.

దాదా కీలుబొమ్మనే..
ఇన్నాళ్లు దాదా బీసీసీఐ ప్రెసిడెంట్‌గా ఉన్న చక్రం తిప్పింది సెక్రటరీ జై షానేనని క్రికెట్ వర్గాల్లో ఉన్న ప్రచారం. కీలక నిర్ణయాలన్నీ జై షానే తీసుకునేవాడని, గంగూలీ కేవలం సంతకాలకే పరిమితమయ్యేవాడనే అపవాద ఉంది. విరాట్ కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించడంలోనూ జై షాదే ప్రధాన పాత్రనే ఆరోపణలు వచ్చాయి. భారత క్రికెట్‌ను సర్వనాశనం చేస్తున్నాడని ఓ వర్గం అభిమానులు అతనిపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. అసలు ఏం అర్హతలున్నాయని జై షాకు అంత పెద్ద పదవి అప్పగించారని గతంలో ప్రశ్నించారు. ఇప్పుడు అతనే అధ్యక్షుడు అంటే వారు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications